ఓయూలో  ప్రసంగించిన ఇక్బాల్‌సారే జహాసె అచ్ఛా, హిందూస్తాన్‌ హమారా అనే జాతీయ గీతం రాసి మనకు నిత్యస్మరణీయుడైన మహాకవి డా.సర్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌. ఈ పాట వింటూంటే ఇప్పటికీ శరీరం రోమాంచిత మవుతుంది. వేలం ఉర్దూలోనే కాదు, ఆంగ్లంలోనూ ఆయన రచనలు విశ్వవ్యాప్తమైనాయి.

1877, నవంబర్‌ 9వ తేదిన ఇక్బాల్‌ ఉమ్మడి పంజాబ్‌లోని సియోల్‌కోటలో జన్మించారు. ఆయన తాతగారైన షేక్‌ రఫీక్‌ కశ్మీర్‌ నుంచి వలసవచ్చారు. లండన్‌లో ఎం.ఏ, ఫి.హెచ్‌.డి, బ్యారిష్టరు పరీక్షలలో కృతార్డుడై భారత దేశానికి తిరిగి రాగానే అలిఘఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం వారు తమ వద్ద ఆచార్య పీఠం వహించమని ఆహ్వానిస్తే దాన్ని ఇక్బాల్‌ తిరస్కరించారు. అటు పిమ్మట బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను లా¬ర్‌ కళాశాలలో ఫిలాసఫి శాఖాధిపతిగా నియమించింది. ఉదయం కాలేజీలో పనిచేస్తూ మధ్యాహ్నం నుంచి చీఫ్‌కోర్టులో ప్రాక్టీసు చేసుకోడానికి అనుమతిస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు. ప్రభుత్వం అందుకు అంగీకరించింది. స్వేచ్ఛాÛ జీవి అయిన ఇక్బాల్‌ ఈ పదవిలో మూడేళ్ళకన్నా ఎక్కువకాలం ఉండలేకపోయారు.

1923 నాటి ఇక్బాల్‌ ప్రాక్‌ ప్రపంచంలో ఇమడనంతటి గొప్ప కవి. ఆయన రచించిన నా జీవిత రహస్యాలు అనే మొదటి గ్రంథాన్ని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ నికొల్సన్‌ ఇంగ్లీషులో అనువదించాడు. దీనితో కవిచంద్రుని కీర్తి ప్రతిష్ఠలు ఇంగ్లాండ్‌లో మారుమ్రోగిపోయాయి. పంజాబ్‌ గవర్నర్‌ సర్‌ ఎడ్వర్డ్‌ మెకలిగన్‌, ఇక్బాల్‌ని తన అధికర నివాసానికి ఆహ్వానించి బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు సర్‌ అనే బిరుదు ప్రసాదించనున్నదనే శుభవార్త చెవిలో వేశాడు. ఇది వినగానే ప్రశాంత గంభీరమూర్తి అయిన ఇక్బాల్‌, మా గురువుగారైన సయ్యద్‌ మీర్‌ హసన్‌కు మొదట షవ్‌ుషుల్‌ ఉలేమా (అస్థానకవి) బిరుదు ప్రసాదించండి. తరువాత నేను దీన్ని స్వీకరిస్తాను అని సమాధానమిచ్చాడు. ఇది ఎలా సాధ్యం! మీ గురువుగారు ఒక్క గ్రంథమైనా రాయందే అని గవర్నరు సందేహం వెలిబుచ్చాడు. ఆయన రాసిన ఏకైక గ్రంథం నేనే. ఇది ఒక్కటి చాలదా? అని అనగానే గవర్నరు మరి మాట్లాడలేకపోయాడు. గురువుగారికి షవ్‌ుషుల్‌ ఉమ్రా ఇక్బాల్‌కు సర్‌ బిరుదు ఒకటేసారి లభించాయి.

బ్రిటీష్‌ ప్రభుత్వంలో ఉద్యోగం చేయనని భీష్మించుకున్న ఇక్బాల్‌ కవితా వ్యాసంగం కొనసాగించడానికి భోపాల్‌ సంస్థానం నవాబు నెలకు ఆయన వందల పింఛను ఏర్పాటు చేసాడు. ఒక సంవత్సరపు పుస్తకాల రాయల్టీ మీద ఆయనకు ఇరవై అయిదు వేల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో లా¬ర్‌లో ఆయన ఇల్లుకట్టుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకు డబ్బు ఇబ్బందిగానే ఉండేది. ఈ సంగతి తెలుసుకున్న ఆగాఖాన్‌ ఆయనకు నెలకు అయిదు వందల పింఛన్‌ ఏర్పాటు చేయటానికి ముందుకు వచ్చాడు. కవి ఇక్బాల్‌ అంగీకరించలేదు. నిజాం నవాబు తన తోషేఖాన్‌ (అనాధల సహాయ నిధి) నుంచి వెయ్యి రూపాయల చెక్కు పంపించాడు. నేను బిచ్చగాణ్ణి దాన్ని తిరస్కరించాడు. ఆత్మాభిమానంలో ఇక్బాల్‌తో సమానుడైన కవి ఆ రోజుల్లో మరొకరు లేడు.

ఇక్బాల్‌ మొదటిసారి 1916లో హైదరాబాద్‌ కొచ్చాడు. అవి ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహదూర్‌ పరిపాలన చివరి రోజుల్లో అలాగే కిషన్‌ ప్రసాద్‌ ప్రధానిగా ఉన్న చివరి రోజులు. కిషన్‌ ప్రసాద్‌ బహదూర్‌ స్వయాన గొప్పకవి. కానీ ఇక్బల్‌ విషయంలో ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇక్బాలమియా అభ్యుదయ కవి దర్బారులో ప్రవేశిస్తే సదరు రోజులు చెల్లుబాటు కావని దర్బారులో తిష్ఠవేసుకొని ూర్చున్న కవులు నిజాం దర్శనాన్ని అడ్డుకున్నారు. ఇక ఎంతూ ఇక్బాల్‌కు నిజాం దర్శనం కానేలేదు. ఉన్నకాలం నిరీక్షణలోనే గడచిపోయింది. ఇవి దర్బారు రాజకీయాలు, మహారాజ్‌ బహదుర్‌ ూడా ఎంతో బాధపడ్డాడు. కానీ ఆయన చేసిందీ, చేయగలిగిందీ ఏమీ లేదు. కవి కలం ఎప్పుడూ ఒకలా ఉండదు.

1928లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించ డానికి ఇక్బాల్‌ ప్రభుత్వ అతిధిగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయన అప్పటి ప్రధాని సర్‌ అక్బర్‌ హైదరీ అదికార నివాసం దిల్‌కుషలో ఉండగా బెల్లా విస్టా అతిధిగృహంలో బస చేసాడు.

నగరంలోని టౌన్‌హాల్లో (ఈనాటి అసెంబ్లీ భవనం) ఇక్బాల్‌ కు అపూర్వమైన స్వాగతం లభించింది. మొదటిరోజు సభకు మహారాజ్‌ బహదూర్‌ అధ్యక్షత వహించగా, రెండవ నాటి సభకు బిరారు రాజకుమారుడు అధ్యక్షత వహించారు. ఈ రెండు సభల్లోనూ ఆయన ఇంగ్లీషులోనే ప్రసంగించారు. మహారాజ్‌ బహదూర్‌ ఇంట్లో జరిగిన సభలో ూడా ఆయన కవితలు చదువలేదు. ఎక్కువ వేదాంతం మీద మాట్లాడాడు. ఈసారి ఇక్బాల్‌ దర్బారీ దుస్తులు ధరించకుండానే ఏడవ నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదుర్‌ దర్శనం సులభంగానే లభించింది. గంటసేపు నిజాంలో ఆయన మాట్లాడినాడు. ‘నేను ఢిల్లీకి వచ్చినప్పుడు నువ్వు నన్నెందుకు కలుసుకోలేదయ్యా?’ అని నిజాం ఆప్యాయంగా ప్రశ్నించాడు. అప్పుడు తాను పంజాబ్‌లో లేననీ, ఆప్గనిస్తాన్‌ అమీరు ఆహ్వానంపై ఆ దేశ పర్యటనలో ఉన్నట్లు చెప్పుకున్నాడు. ‘న్యాయశాఖ మంత్రి పదవో, న్యాయమూర్తి పదవో ఇస్తా, చేస్తావా’ అని నిజాం ఆప్యాయంగా అడిగాడు. ఇప్పుడు ఉద్యోగం చేసే స్థితిలో లేనని ఇక్బాల్‌ నిజాం ఆదరణను తిరస్కరిస్తున్న ఆవేదనతో అన్నాడు.

ఇక్బాల్‌ 1906లో ముస్లిం లీగ్‌ శాసన భ్యుడయ్యారు. ఇస్లామిక్‌ ప్రపంచంలో ఆధునికత రావాలని జీవితాంతం కృషి చేశాడు. 1931లో ఆయన రెండవసారి యూరప్‌ వెళ్లినప్పుడు అక్కడ ముస్సోలినీ, ఫ్రెంచ్‌తత్వ వేత్త లూయిస్‌ బెర్గ్‌మన్‌ వంటివారిని కలుసుకున్నాడు. ఆ మహాకవి మృత్యువుతో పోరాడుతున్న చివరి రోజుల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయనను లా¬ర్‌లో చూడటానికి వచ్చాడు. నెహ్రూను చూసి పులకింతుడైన ఇక్బాల్‌ , నీకు జిన్నాకు ఎందులో సామ్యం ఉందని నీవు దేశభక్తుడివి. జిన్నా రాజకీయ వేత్త అని గాఢంగా నెహ్రూని ఆలింగనం చేసుకున్నాడు. ప్రపంచంలో ల్లాె భారత దేశం ఉత్తమమైంది. ఇది ఓ ఉద్యానవనం. మనం బుల్‌బుల్‌ పిట్టలం.. మతం పరస్పర వైరాన్ని బోధించదు మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం అని గర్వంగా చెప్పిన మహాకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ 1938, ఏప్రిల్‌ 21న కాలంచేశాడు.

Other Updates