ayurvedam_1అనాదిగా రోగాలను నయంచేస్తూ, ఆరోగ్యాన్ని ఆయుష్షును పెంపొందిస్తూ భారతదేశ ప్రజలకు సుఖమయజీవితాన్ని ప్రసాదిస్తున్న శాస్త్రం ఆయుర్వేదం. తెెలంగాణలో ఎన్నో శాస్త్రాలు, విద్యలు, కళలు అనాదిగా అభివృద్ధిని పొందినవి. కరీంనగర్‌ జిల్లాలో తయారైన పదునైన మేలురకం కత్తులు ఎన్నో దేశాలకు ఎగుమతి అయ్యేవి. త్రవ్వకాల్లో బయల్పడిన నాణాలవల్ల వేలసంవత్సరాల క్రితమే దూరప్రాంత దేశాలతో వ్యాపారాలున్నట్లు తెలుస్తున్నది. అయితే ముస్లింల అణచివేత అధికారధోరణులవలన తర్వాత మొదట్లో మహారాష్ట్రులు ఆపిదప ఆంధ్రుల అణగద్రొక్కే విధానాలవలన అన్ని మరుగున పడిపోయినవి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, విజ్ఞాన విషయాలను వెలికితీసి పెంపొందించే ప్రయత్నాలు జరుగుతుండటం ముదావహమైన విషయం. ఆయుర్వేదం కూడా తెలంగాణలో అభివృద్ధి చెంది ఉండినదనటంలో సందేహం లేదు. కాని చరిత్రకందని విషయాలెన్నో ఉన్నవి. ఎందరో వైద్యుల చరిత్రలు, అపురూప గ్రంథాలు, ఔషధ నిర్మాణపద్ధతులు, ఔషధశాలలు మరుగున పడిపోయినవి. కరీంనగర్‌ జిల్లాలోని రామగిరి ఎన్నో అమృతతుల్యమైన ఓషధులకు నిలయంగా ప్రసిద్ధినొందినది. కల్యాణకారకమనే ఉద్గగ్రంథాన్ని జైనఉగ్రాదిత్యాచార్యుడు రామగిరిలోనే రచించినాడు. అలంపురంలోని జోగుళాంబా నవబ్రహ్మేశ్వరాలయాల సముదాయం ఒకనాటి రససిద్ధుల నివాసస్థానమని ప్రయోగశాల అని చరిత్రకారుల అభిప్రాయం.

ఆరోగ్యాన్ని దీర్ఘాయువును అందించటమేగాక ఇనుము మొదలగు నీచ(తక్కువ)లోహాలను బంగారంగా మార్చే సిద్ధులకు అలంపురం, శ్రీశైలం, నాగార్జునకొండ మొదలైనవి ఆవాసాలుగా వుండినవి. ఆయుర్వేద వైౖద్యుల అనుభవాలు, చికిత్సా పద్ధతులు, ద్రవ్యగుణాలు తెెలిపే ఎన్నో గ్రంథాలు అక్కడక్కడా పడిఉండి వెలుగుకు నోచుకోలేక కాలగర్భంలో కలిసిపోతున్నవి. వాటిని వెలికితీసి, రక్షించి ప్రజానీకానికి అందించ వలసిన అవసరం ఎంతైౖనా ఉన్నది. ఈమధ్యనే ప్రకటింపబడి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు శ్రీరమణాచారిగారిచే ఆవిష్కరింపబడిన ద్రవ్యరత్నావళి మెదక్‌, ఇందూరు ప్రాంతంలోని వైైద్యునిచే (పేరు చెప్పుకోలేదు) 17వ శతాబ్దంలో సంకలనం చేయబడిన విశిష్ట వైైద్యనిఘంటువు. ఇందులో రెండు వేేలకు పైగా ద్రవ్యాల గుణాలు చెప్పబడినవి. రకరకాల పాలు, పెరుగు, తేనె, కూరలు, కాయలు, పూలు, పండ్లు, ధాన్యాలు, వంటకాలు, వడియాలు, పచ్చళ్ళు, వరుగులు మొదలైన ద్రవ్యాలెన్నో వాటి వివిధరకాలతో చోటు చేసుకొని ఆనాటి ప్రజల జీవనశైలికి అద్దం పడ్తున్నవి. ఇట్టి గ్రంథాలెన్నో వెలికి తీయవలసి యున్నది. దానిౖ కృషి జరగాలి.

తెెలంగాణలో అడవుల విస్తీర్ణం ఎక్కువే. వాటిలో ఉపయోగకరమైన మందు మొక్కలు విరివిగా లభించి వాడబడేవి. ఉత్తరభారతానికి సన్నిహితమైనందున ఇక్కడ రసౌషధాలతోబాటు మూలికా ఔషధాల ఉపయోగూండ ఎక్కువగా ఉండేది. చెంచులు, గోండులు మొదలైన వనవాసి ప్రజలతో బాటు పల్లెటూళ్ళలోని వృద్ధులు దగ్గరలో దొరి వన్యద్రవ్యాలతో ఎన్నో రోగాలను నయం చేసేవారు. ఆ చిట్కాలు సామాన్య ప్రజానీకానింతో ఉపయోగకరం. ంద్రప్రభుత్వం వారి సర్వే ఆఫ్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ (మందు మొక్కల సర్వేక్షణం) ప్రణాళిక ద్వారా అడవులలోని మందుమొక్కల వివరాలతోబాటు ఆటవికులు వాడే ప్రశస్తమైన ప్రభావవంతమైన చిట్కాలను 1960-1980లో కొంత సేకరించటం జరిగింది. వాటిని ఇంకా సేకరించి శాస్త్రీయంగా ప్రయోగాల ద్వారా ఫలితాలను ఉపయోగాలను నిర్ధారించి సామాన్యప్రజలకు అందుబాటులోనికి తెచ్చి తక్కువ ఖర్చుతో రోగనివారణ చేసే ప్రణాళికలు రూపొందించటం రాష్ట్రానింతో మేలు.

గత రెండు మూడు శతాబ్దాలలో ఆయుర్వేదం బాగా పరిఢవిల్లిందని అనటానికి ఆధారాలున్నవి. పాలమూరు జిల్లాలో లోకాÄవారి వంశం వైద్యవృత్తిలో పేరెన్నికగన్నది. గత శతాబ్ది ప్రారంభంలో వెలిజర్లలోని లోకాబాపువద్దకు కర్ణాటక మొదలైన సుదూర ప్రాంతాలనుండి రోగులు వచ్చేవారు. ఆరోజుల్లో సంస్కృతానికి అమరకోశం వలె ఆయుర్వేదానికి ప్రారంభంలో ఇరువదియైదు శ్లోకాల చమత్కారనిఘంటువును కంఠస్థం చేయించేవారు. దీని కర్త కర్ణాటక సరిహద్దు ప్రాంతంవాడైన రాఘవాచారి. దీనిని లోకా లక్ష్మయ్యగారినుండి సేకరించి ప్రకటించటం జరిగింది. అట్లే గెలవంగల మంగళగిరిసూరి అనే వైద్యవిద్వాంసుడు అష్టాంగహృదయానికి ప్రామాణికమైన వ్యాఖ్య రచించినట్లు తాళపత్రగ్రంథాలయాల ద్వారా తెలుస్తున్నది. అర్వాచీనకాలంలో విక్రాల, భాగవతం, ప్రతివాదిభయంకర, వైద్యుల, ముదిగొండ, మందుల మొదలైన వంశాలవారు వైద్యంలో ప్రసిద్ధులైనవారు. నిదానచూడామణి, భిషగ్విజయం,మూలికాయోగము, శ్రీధన్వంతరి సంపూర్ణ వైద్యసారసంగ్రహము మొదలైన ఎన్నో గ్రంథాలు గతశతాబ్దంలో ప్రచురింపబడినవి. 1940 లో వేదాల తిరుమల వేంకటరామానుజస్వామి సుల్తానుబజారునుండి ఆయుర్వేద కళ అనే మాసపత్రికను నిర్వహించినారు. ఇది ఎంతకాలము నడచినదో తెలియదు. ఒక సంవత్సరం సంచికలు మాత్రం నాకు లభించినవి. దీనిలో ఆంధ్రప్రాంతంవారివ్యాసాలే కాక ప్రకటనలు కూడా ఉండటం విశేషం. ఆయుర్వేదానికి జరుగుతున్న అన్యాయాన్ని విమర్శిస్తున్న సంపాదకీయాలున్నవి. ఈపత్రిక సంపాదకునితోబాటు హకీం జనార్దనస్వామి, హకీం రామరాజు, హకీం మార్కండేయులు మొదలగు తొమ్మండుగురు వైద్యులు నిజాం ఆయుర్వేద సంఘాన్ని రిజిష్టరు చేయించి కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహించినారు. ఈసంఘం స్థాపించిన నిజాం ఆయుర్వేద మహావిద్యాలయమే క్రమంగా నేటి హైదరాబాదులోని ప్రభుత్వకళాశాలగా మారింది. ఈవిధంగా మరుగున పడిపోయిన చారిత్రక విషయాలు, వైద్యగ్రంథాలు, వంశాలు, చిట్కాలు, ఔషధనిర్మాణ పద్ధతులు, యోగాలు,మూలికలు మొదలైన వాటిని శాస్త్రీయ పద్ధతుల ద్వారా సేకరించి పరిశోధించి ప్రజానీకానికి ఉపయోగపడేలా చేయటం ప్రయోజనకారి కాగలదు.

ఆధునిక విజ్ఞాన సాధనాల వినియోగంతో పరిశోధనలు చేసి ఆయుర్వేదానికి అభివృద్ధిని కలిగించే దిశగా ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో ప్రణాళికలతో పరిశోధనలు సాగిస్తున్నందువలన వాటిని గూర్చి ఇక్కడ ప్రస్తావించ లేదు.

Other Updates