శతముఖ భారతావని స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశంలోని అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను, సంప్రదాయాలను, కఠోర వాస్తవాలను ప్రతిబిం బిస్తూ, ప్రతిఘటిస్తూ ఔరా భారతా అనిపించిన యువకవి, నవీన్‌కుమార్ నామా 104 పద్యాలతో శతకంలా నాలుగు పాదాలతో ‘ఔరా భారతా’ అనే మకుటంతో దేశభక్తితోపాటుగా, నవ సమాజ నాగరికత, శాంతి-కాంతి-క్రాంతిలాంటి ఈ మహోన్నత కవితా సంపుటిని మనకందించారు ఈ యువకవి.
కాషాయం ఖరీదైపోయింది
హరిణము కవలించి వేస్తోంది
ఆకుపచ్చ చిచ్చురేపుతోంది
ధర్మ చక్రం మొరాయిస్తోంది, ఔరా భారతా!! అని అంటాడు. ధర్మచక్రం మొరాయించేది, సమాజంలోనా.. మానవ సంబంధాలలోనా మనం ప్రశ్నించుకోవాలి, అన్యాయాన్ని, అధర్మాన్ని, సవినయంగా, సగర్వంగా ఈ శతముఖి భారతావనిలో పొందుపర్చి, ఆవేదనతో, ఆలోచనలతో, తన ముందు జరిగిన అనుభవాలతో రచించి మన కందించాడు.
చక్కని సంస్కారాన్ని నేర్పించటానికి ప్రతి వారిని కవనమై కనిపించు కదలించు అంటాడు.
– డా|| కావూరి శ్రీనివాస్
రచన: నవీన్‌కుమార్ నామా,
వెల: రూ. 60, ప్రతులకు: నవోదయ, నవచైతన్య అన్ని కేంద్రాల్లో…