ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌కు ఫిబ్రవరి 10న చంద్రశేఖరరావు అభినందన సందేశం పంపారు.
‘‘ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించినందుకు మీకు నా అభినందనలు. ఓటర్లు, ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు మార్పు కోరుకుంటున్నారనడానికి మీ విజయం ఓ స్పష్టమైన సంకేతం. ఢల్లీి ప్రజలు సరైన తీర్పు చెప్పారు.గా ఆలోచిస్తున్నారని, అవినీతిరహిత, పారదర్శక పాలన కోరుకుంటున్నారని అనడానికి ఇది తగిన
ఉదాహరణ.మీ నాయకత్వంలో ఢల్లీి అన్ని రంగాలలో ప్రగతి సాధించగలదని నేను విశ్వసిస్తున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే ప్రజాస్వామ్య ఆకాంక్షను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో బలపరచిన విషయం గుర్తు చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆ సందేశంలో పేర్కొన్నారు.
కాగా, ఢల్లీి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, ఢల్లీిని దేశంలోనే అవినీతి రహిత నగరంగా నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు.