‘‘పుట్టి బుద్దెరిగిన కాడ్నించి, నేను మొకి బట్టకట్టిన కాడ్నించి, గీ చెరువు గింతమన్ను ఎవ్వడు ఎత్తిబోయంగ చూడలె! గింతబాగ మా ఊరి చెరువును చూస్తనని
కలోకూడ అనుకోలేదు…’’ ఓ వృద్ధుని ఆనందం.
‘‘నిండిన చెరువును చూస్తె కడుపు నిండినట్లుంది…’’ మరో రైతు సంబరం.
నీళ్ళతో నిండి నిండు గర్భిణుల్లా కళకళ లాడుతున్న చెరువు, ఆ చెరువు కింద సాగవుతున్న వందలాది, వేలాది ఎకరా పచ్చని పంట భూము, తెంగాణ రైతు కండ్లలో తొణికిసలాడుతున్న ఆనందం…
‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువు పునరుద్ధరణ కార్యక్రమం` కొనవూపిరితో వున్న తెంగాణ బక్క రైతుకు జీవం పోసినట్లయ్యింది.
సిఎం వోఎస్డీ దేశపతి శ్రీనివాస్, నీటిపారుద శాఖా మంత్రి వోఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే ఆధ్వర్యంలో, ‘తెంగాణ వికాస సమితి’ నేతృత్వంలో 40 మంది కవు, రచయితు, మేధావు బృందం ‘చెరువు పరిశీనకు’ నిర్వహించిన రెండురోజు బస్సుయాత్ర విజయవంతంగా కొనసాగింది.
సెప్టెంబర్ 12న రెండు చిన్న బస్సులో, పొద్దున 6.30 గంటకే మా బృందం హైదరాబాద్ నుండి బయుదేరింది. తెంగాణ ప్రభుత్వం ` రైతు జీవితాలో మెగుకోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనును పరిశీలించడం మా ప్రధాన ఉద్దేశ్యం. ముందుగా వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామంలోని పెద్ద చెరువును సందర్శించాం. ఇది 117 ఎకరా విస్తీర్ణం గ పెద్ద చెరువు. ‘మిషన్ కాకతీయ’కు ముందు ఆ చెరువు దుస్థితిని మాకు ఫోటోలో చూపించారు. విపరీతమైన కంపచెట్లతో, తుమ్మ చెట్లతో చిన్నపాటి అడవిని తపించేలా, చిన్న చెరువు కట్టతో వున్న ఆ చెరువు స్వరూపం, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కార్లు ప్రయాణం చేయగ విశామైన చెరువు కట్టతో, తూము, అుగుపోసే చోట పూర్తిగా పునరుద్ధరించబడి, శోభాయమానంగా ఉంది.
మా బృందం చెరువు పరిశీనకు వస్తోందన్న విషయం తెలిసి పెద్ద ఎత్తున ఊరిజనం చెరువు వద్దకు వచ్చారు. మా బృందంలో దేశపతి శ్రీనివాస్, శ్రీధర్ దేశ్‌పాండేతో పాటు, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, వేముగంటి మురళి, తమ్మన బోయిన వాసు, గుండం మోహన రెడ్డి, వినయ్‌బాబు, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాము, వరaు శివకుమార్, పగడా నాగేందర్, ఏనుగు నరసింహారెడ్డి, ఆర్టిస్ట్ అహోబిం ప్రభాకర్, తైద అంజయ్య, పొన్నా బాయ్య, చమన్‌సింగ్, భిక్షు నాయక్, రత్నాకర్ రెడ్డి, (ఆర్‌క్యూబ్), అన్వర్, పరమాత్మ, పొట్లపల్లి శ్రీనివాసరావు, గణపురం దేవేందర్, డా॥ వడ్ల శంకర్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, అయాచితం శ్రీధర్, ఎర్రోజు శ్రీనివాస్, వి.ఆర్.విద్యార్థి, బిళ్ళా మహేందర్ మొదలైన వారు ఉన్నారు.
మేం పెంబర్తి గ్రామ ప్రజతో ఈ చెరువు పునరుద్ధరణపై ‘‘మీ అభిప్రాయం ఏమిటి?’’ అని అడిగాం. ప్రజంతా ముక్తకంఠంతో ‘‘ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ఇది చాలా మంచిపని’ అని గట్టిగా చెప్పారు.
మ్లయ్య అనే రైతు మాట్లాడుతూ… ‘‘సార్, పుట్టి బుద్ధి ఎరిగిన కాడ్నించి, నేను మొకి బట్ట కట్టిన కాడ్నించి, గీ చెరువు మన్ను ఎవ్వడు ఎత్తిబోయంగ చూడలె! గింత బాగ మా ఊరి సెరువును జూస్తనని నేను కలో కూడా అనుకోలేదు సార్’’ అని ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చెరువు పూడిక తీయబడ్డా ఇంకా పూర్తిగా నిండలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన కాువ ద్వారా, వర్రె ద్వారా వచ్చే వాన నీటి ద్వారా మాత్రమే ఈ చెరువు నిండడానికి ఆస్కారం వుందని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్లు మాతో చెప్పారు. ఆ చెరువు కట్ట మీద 3 కి.మీ. నడిచేసరికి మా బృందానికి ‘ అబ్బా ఎంత పెద్ద చెరువు’ అని అనిపించింది.
దీని తర్వాత, దీనికి దగ్గరగా ఉండే ‘పెద్ద రామంచెర్ల’ గ్రామంలోని చిన్న చెరువును సందర్శించాం. ఈ చెరువు పూర్తిగా నీళ్ళతో నిండి కళకళలాడుతోంది. దీనికింద చిన్న కాువ ద్వారా, పైపులైన్ల ద్వారా వ్యవసాయం కొనసాగుతూ, పంటపొలాు పచ్చగా ఉన్నాయి. వల్లా మల్లేశం అనే ఆ ఊరి సర్పంచ్ మాట్లాడుతూ, తమ గ్రామ చెరువుకు జకళ రావడంతో ఊరి ప్రజంతా చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
ఇక్కడి సన్నకారు రైతు ఒక విషయం చెప్పారు. ‘‘ ఈ చెరువు బాగా నిండాక నీరు విడిచి పెడ్తే, అవి సహజసిద్ధమైన కాువ ద్వారా ప్రవహించి, న్లగొండ జిల్లాలోని రాఘవపురం చెరువులోకి వెళ్తాయి’’ అని చెప్పారు. సహజసిద్ధంగా ఒక చెరువు ద్వారా మరొక చెరువు నిండడం అనేది, గొుసుకట్టు చెరువు ద్వారా వ్యవసాయం అనేది కాకతీయు కాం నుండి తెంగాణ ప్రాంతంలో ఉన్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, నీటిపారుద శాఖ ఇంజనీర్లకు ఈ విధానాన్నే ఎక్కువగా కొనసాగించాని గట్టిగా చెప్పారు.
అక్కడి నుంచి ‘పసరమడ్ల’ గ్రామంలోని ‘ఊర చెరువు’ను సందర్శించాం. 12 ఏండ్ల క్రితం నుంచి ఈ చెరువులో నీటిచుక్క లేదు. వర్షాు పడ్డ రోజుల్లో కూడా పూడిక తీయని కారణంగా ఈ చెరువు నిండేది కాదు. ‘మిషన్ కాకతీయ’ పనుతో ఈ చెరువు నీటితో నిండి ఎంతో అందంగా ఉంది. ఈ చెరువు బాగుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14,45,000ు మంజూరయ్యాయి. ఈ చెరువుకు నిర్మించిన ‘రాతికట్టడం’ చాలా బాగుంది. గ్రావిటీ ద్వారా అంటే ‘వాు’ ద్వారా నీళ్ళు వచ్చి ఈ చెరువులో చేరుతున్నవి. ‘పసరమడ్ల’ జనం తండోపతండాుగా చెరువు వద్దకు వచ్చి తమ ఆనందాన్ని మాతో పంచుకున్నారు.
మా బృందంలో కొంతమంది వ్యవసాయం చేసినవారు, వ్యవసాయ జీవితంతో బమైన సంబంధం వున్నవారు, వారు తెంగాణ భాషలోనే ప్రజతో మమేకమై మాట్లాడారు. ‘‘ఇప్పుడెట్లుందే? ఏమనిపిస్తుందే’’ అని అడిగారు.
‘‘కడుపు నిండినట్టుంది సారు, నాుగు గింజు పండితే, మా పోర బతుకు బాగుపడతయి సార్’’ అని వాళ్ళ సమాధానం.
60 ఏండ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రంలో, ఆదరణ కోల్పోయిన గ్రామాను, చెరువును చూస్తుంటే తెంగాణ ప్రాంతం ఎంత వివక్షకు గురయ్యిందో మాకు అర్థమయ్యింది. ఈ సందర్భంగా తెంగాణలో నీళ్ళు లేని దుస్థితిని వర్ణిస్తూ ‘గోరటి వెంకన్న’ రాసిన పాట గుర్తొచ్చింది.
‘‘ నాచుపచ్చని బావు తెంగాణ
నాపరాళ్ళు నిండెరా!
గుప్పించి గుప్పించి బోరు దుముకుతుంటె
ఒక్కటైనా మడి చిక్కగా తడవదు’’
అని తెంగాణ రైతు బాధల్ని చెప్పిన పాటు, ఇక ప్రజల్లో నుంచి మాసిపోయే రోజులొచ్చినవి.
అక్కడి నుంచి కాట్రపల్లి పెద్ద చెరువును సందర్శించాం. ఎక్కడికివెళ్లినా ప్రజు చెప్పింది ఒకటే, ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువును పునరుద్ధరించడం వ్ల చెరువుకి మంచిరోజువచ్చాయి. చెరువు మట్టితో పంటపొలాు బపడ్డాయి, పంటు బాగున్నాయి’
ఇంకా గ్రామాకు జరిగిన మేు ఏమిటంటే…
సాకలి రేవు పునరుద్దరించారు.
– ఊళ్ళలో భూగర్భ జ మట్టం పెరిగింది.
– బావులోకి నీరు వచ్చి చేరింది.
– మంచినీటికి, సాగునీటికి కొరతలేని పరిస్థితి వచ్చింది.
– చాలా చెరువుల్లో చేప ప్లిను పోసి పెంచడం ద్వారా బెస్తవాళ్ళు, జారు పరిస్థితి మెరుగుపడిరది.
గొర్రెకు, పశువుకు కావాల్సినంత నీరు అందుబాటులోకి వచ్చింది.
ప్రజ స్పందన, ఉత్సాహం మాకు అసటను లేకుండా చేసింది. ఆకలి కూడా తెలియలేదు. మొదటిరోజు మేం భోజనం చేసే వరకు సాయంత్రం 5 గంటయ్యింది. దాని తర్వాత కూడా ఇంకా రెండు చెరువును సందర్శించాం. దేవాదు ప్రాజెక్టు ద్వారా పైపులైన్ల నుండి నీరును పంపుచేసి చెరువుకు నీరు వచ్చేట్టు చేసే కార్యక్రమం కూడా ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఉంది.
ప్రస్తుతం మా పరిశీనలో 87 చెరువు మత్తడిపై నుంచి నీళ్లు దూకుతున్నవి. మిషన్ కాకతీయ పను విషయంలోని నాణ్యత పై ప్రజు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేలాది చెరువుల్లో నీటితో నిండిన జకళ కనబడుతోంది. సంతోషంతో రైతు తమ పొలాు సాగు చేస్తున్నారు.
మొదటి రోజు రాత్రి ఖమ్మంలో బస చేశాం. చిరుజ్లుతో ఖమ్మం నగరంలో తడుస్తూ తిరిగాం. మరునాడు పొద్దున్నే మేం బస్సు యాత్రకు ముందే వర్షంలో తడిశాం. నా పక్కగా నడుస్తున్న దేశపతి శ్రీనివాస్ ‘‘చినుకు కనేత వస్త్రాన్ని సింగారించుకుంది ధరిత్రి’’ అంటూ తిక్ కవిత్వ పాదాు కోట్ చేశాడు.
ఈ రెండు రోజు చెరువు పరిశీన, ప్రజతో మమేకం కావడంతో పాటు, సాహిత్య వాతావరణంలో కూడా తడిసిముద్దయ్యాం. పత్రిక వారితో మాట్లాడుతున్నా చెరువుపై కవిత్వం పొంగిపొర్లింది.
వరంగల్ జిల్లాలోని మర్రిపెడ మండం ఎ్లంపేట పెద్ద చెరువును సందర్శించినపుడు ప్రజ నుండి విశేష స్పందన వచ్చింది. ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే, ఆ ఊరి సర్పంచ్‌తో పాటు జనం బాగా వచ్చారు. ఈ చెరువుకు ఒక ఫీడర్ చానల్ ఉన్నప్పటికి, పాత ఫీడర్ చానల్‌ని పునరుద్ధరించాని ప్రజు కోరుకుంటున్నారు. ఇక్కడ ఎస్టీ రైతు ఎక్కువగా బ్ధిపొందుతున్నారు. ఈ చెరువు ఆయకట్టు 215 ఎకరాు. ప్రజల్లో ఆనందం కనిపించింది.
ఖమ్మం ప్రాంతంలో జూన్‌నెలో కురిసిన వర్షాతో అమ్మపాలెం జగన్నాథ చెరువు పూర్తిగా నిండి ఉంది. ‘‘15 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయని పని కెసీఆర్ ప్రభుత్వం చేసింది’’ అని ఒక రైతు నాతో అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగం వెంగళరావు ఊరులోని బయ్యన్నగూడెం పెద్ద చెరువును సందర్శించాం. మైనర్ ఇరిగేషన్ కింద ఇక్కడ ‘వరి’ బాగా పండుతోంది.
ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ కాువను మా పర్యటనలో భాగంగా ఎక్కువసేపు సందర్శించాం. కాకర్లపల్లి వద్ద పెద్ద రిజర్వాయర్ నిర్మించి, సిమెంట్ కాువ ద్వారా చెరువుకు నీటిని అందజేయడం దీని ప్రధాన క్ష్యం. ఆసియాలోనే ఈ తరహా పెద్ద కాువ ఇది. ఈ పెద్ద ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు మాబృందం సభ్యుడు శ్రీధర్ దేశ్‌పాండే నాతో చెప్పారు.
మా పర్యటనలో పరిశీలించిన విషయాు :`
1. తెంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,800 చెరువుల్లో పూడిక తొగించబడిరది.
2. చెరువు పునరుద్ధరణ పనుల్లో తెంగాణ ప్రభుత్వం
ఉత్తమ ఫలితాు సాధించి, ప్రజ మెప్పు పొందింది.
3. కొన్ని చోట్ల రైతు ఆత్మహత్యకు గత ప్రభుత్వా విధానాలే కారణం గాని, ఈ ప్రభుత్వ అండ ప్రజకు ఉంది’’ అనే విషయం పరిశీనలో తేలింది.
మొత్తానికి తెంగాణ ప్రభుత్వం, తెంగాణ వికాస సమితి చొరవతో మేం చేసిన ఈ బస్సుయాత్ర చెరువు పరిశీన సంతృప్తికరంగా ముగిసింది. ఈ యాత్రలో మేం రూపొందించిన ప్రతి పాదనను ముఖ్యమంత్రి కెసీఆర్‌కు నివేదించనున్నాం.
కొత్త ప్రభుత్వంలో కు పండడంతో రాత్రి 2 గంటకు హైదరాబాద్ చేరుకున్న మేం, ఆనందంగా ఇంటిదారి పట్టాం.
హోం
»