గలగల జలజల గలగల జలజల
జోరుజోరుగా.. హోరుహోరుగా..
కదలివచ్చినది కాళేశ్వర జలధారా..
కదలివచ్చినది కాళేశ్వర జలధారా..
తెలంగాణాజీవన ప్రాణాధారా..
కదలివచ్చినది కాళేశ్వర జలధారా..
శరవేగమ్ముగ సార్థకమైనది సాగునీటి యజ్ఞం
వరదాయినియై ప్రసాదించు నవ జీవన సౌభాగ్యం
కేసీఆరూ.. మానసమ్ములో జనియించిన జల సంకల్పం
మానవ నిర్మిత మహాద్భుతమ్ముగ రూపొందిన శుభ సందర్భం ||కేసీఆరూ||
గంగా……..లక్షలాది ఎకరాల భూములను లక్ష్యసిద్ధితో తడపంగా..
తరతరాలుగా తపియించిన మన తలరాతలు ఇక మారంగా..
కదలివచ్చినది కాళేశ్వర జలధారా.. ||కదలివచ్చినది||
దిగువన పారే నదీజలాలను ఎగువకు చేర్చిన తపస్సు
తెలంగాణ జన జీవితాలలో బంగరు కాంతుల ఉషస్సు
గంగా…….గోదారి గంగా……
ఎండిన నేలను ప్రవహించునులే ఎడతెగని జీవ ధారలూ…
నిండిన కుండల తలపించునులే జలకళలొలికే చెరువులు
ధాన్యలక్ష్మితో తెలంగాణము ధన్యతనొందే సమయం
కేసీఆర్ పరిపాలనలో భవితవ్యం బహు సుందరం
మన భవితవ్యం బహు సుందరం
కదలివచ్చినది కాళేశ్వర జలధారా..
తెలంగాణాజీవన ప్రాణాధారా..
కదలివచ్చినది కాళేశ్వర జలధారా……… ఆ….ఆ….ఆ…. ||కదలి||