kcrప్రజలను కల్తీల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ క్రియాశీలకం

కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో

ఫిబ్రవరి 6న హార్టికల్చర్‌ శాఖపై ముఖ్యమంత్రి సమీకూజు నిర్వహించారు. పండ్లు,

కూరగాయలు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి… ఇలా ప్రతిదీ కలుషితం

అవుతోందని, కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయిందని, ఏది తినాలన్నా భయపడే

పరిసిశీవతి వచ్చిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక పరిసిశీవతి

నుంచి బయటపడే పరిసిశీవతిని ఉద్యానవన శాఖ కల్పించాలని ఆదేశించారు.

ప్రజలు ప్రతీ రోజూ రసాయనాలు ఎక్కువగా వాడని కూరగాయలు, పండ్లు

తినడానికి, కల్తీ లేని మసాలాలు వంటివాటిని అందుబాటులోకి తెచ్చేందుకు,

రైతులు లాభదాయక వ్యవసాయం చేసేందుకు, రాష్ట్ర అవసరాలకు సరిపడా

పండ్లు, కూరగాయలు, మసాలాలు, పువ్వులు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేందుకు

అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు. ఉద్యానవన శాఖ కూడ

విస్తరించాల్సి ఉందని, ఈ శాఖలో మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెకనైజేషన్‌

లాంటి విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల

నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి

పారశీవసారథిó, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ వెంకట్రామారెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌

రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ రోజు ఏది తినాలన్నా ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి

వస్తున్నదని, నాణ్యమైనవి కాకున్నా విధిలేని పరిసిశీవతుల్లో అందుబాటులో ఉన్నవి

తినాల్సి వస్తున్నదని సిఎం అన్నారు. ఈ దుసిశీవతిని అధిగమించేందుకు ఉద్యానవన

శాఖ ఆధ్వర్యంలోనే ఫుడ్‌ ప్రాసెస్‌ చేయాలని సూచించారు. నగర శివార్లలోనే ఫుడ్‌

ప్రాసెసింగ్‌ యూనిట్‌ ను పెట్టి ప్రభుత్వ పరంగానే కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి

లాంటి వస్తువులను ప్రజలకు అందించాలని చెప్పారు.

దీనికోసం ఉద్యానవన శాఖలో అదనపు సంచాలకుడితో

పాటు కావాల్సినంత సిబ్బందిని నియమించాలని

ఆదేశించారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరంతో

పాటు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాలకు ప్రతీ

రోజు లకూజుల టన్నుల కూరగాయలు, పండ్లు, పూలు అవసరం

పడుతున్నాయని, కానీ వీటిలో 90 శాతం వేరే రాష్ట్ర్రాల

నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నదని సిఎం అన్నారు.

మన తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకుని దుబాయ్‌

పోతున్నారని, మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు

మాత్రం బెంగుళూరు నుంచి దిగుమతి

చేసుకుంటున్నామన్నారు. చివరికి కరివేపాకు, కొత్తిమీర,

మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని సిఎం

ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి కావాల్సినన్ని కూరగాయలు, పండ్లను ఇక్కడే

పండించాలని, తద్వారా దిగుమతి చేసుకునే బాధ

తప్పుతుందని, మన రైతులు బాగుపడతారని ముఖ్యమంత్రి

అన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ నగర పరిసరాల్లోని

రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు, పండ్ల సాగుకు

ప్రోత్సహించాలన్నారు. మైక్రో ఇరిగేషన్‌ ద్వారా సాగు చేస్తే

మంచి ఫలితాలుంటాయన్నారు. మైక్రో ఇరిగేషన్‌కు స ్సడీ

ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ఎక్కువ స ్సడీ

ఇవ్వాలని సూచించారు. రైతులంతా ఒకే రకం కూరగాయలుపండించడం వల్ల కూడా గిట్టుబాటు ధర వచ్చే

అవకాశాలు ఉండవని, కాబట్టి ఉద్యానవన శాఖ

అధికారులే వ్యవసాయ భూములను జోన్లుగా విభజించి

ఎక్కడ రైతులు ఏవి సాగు చేయాలో నిర్దేశించాలని

సూచించారు. వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు

తెచ్చి అమ్ముతూ లాభం పొందుతున్న నేపథ్యంలో మన

రైతులు ఎందుకు లాభం పొందరని ప్రశ్నించారు. ఉ

ద్యానవన శాఖలో మార్కెటింగ్‌ వింగ్‌ ను కూడా ఏర్పాటు

చేసి రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ వచ్చే విధంగా

కృషి చేయాలని సూచించారు. రసాయన ఎరువుల

వాడకాన్ని బాగా తగ్గించాలని సూచించారు. వేప, నిమ్మ,

సీతాఫలం, కానుగ ఆకులతో ఎరువులు తయారు చేసే

విధంగా బయో పెస్టిసైడ్స్‌ రూపొందించాలని చెప్పారు.

పూల తోటలపైన దృష్టి పెట్టండ

హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ

నగరాలు, పట్టణాల్లో పెండ్లిళ్ళు, ఇతర ఫంకూజున్ల కోసం వేల

టన్నుల పూలను ప్రతీ రోజు వాడుతున్నారని, వాటిని

కూడా పక్క రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని

సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూల తోటలు

పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న పాలిహౌజ్‌ లు ఎన్ని? ఇంకా

ఎన్ని అవసరం? రాష్ట్రానికి ఎంత మొత్తంలో

కూరగాయలు, పండ్లు, పూలు అవసరం? ఎంత ఉత్పత్తి

ఉంది? ఎంత దిగుమతి చేసుకుంటున్నాం? తదితర

విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని

సూచించారు. ఉద్యానవన శాఖను విస్తరించడానికి

అదనంగా ఉద్యోగులను కూడా నియమించుకోవాలని

చెప్పారు. వచ్చే జూన్‌ నాటికి ఉద్యానవన ప్రణాళిక

రూపొందించాలని ఆదేశించారు.

బుద్వేల్‌లో జర్నలిస్టు టవర్స్‌

 

జర్నలిస్టులలో ఎక్కువ మంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారేనని,

వారికి సొంత ఇండ్లు కూడా లేవని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా

జర్నలిస్టులందరికీ దశల వారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు.

మీడియాలో పనిచేసే అన్ని విభాగాల జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తామని కేవలం

ఇండ్లే కాకుండా, హౌజింగ్‌ టవర్లలో ఇతర పౌర సదుపాయాలు కల్పిస్తామని

సఎి ం వలె డ్ల ంి చారు . రాష్ట్రం లోని జర్న లిసు ల్ట ంతా వుె రు గ నౖ జీవితం గడ ప ాలన్నదే

తమ లకూజ్యుమన్నారు. రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ పరిధిలోని దాదాపు వంద

ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌ జర్నలిస్టుల కోసం నివాస గృహాల సముదా

యాలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వెల్లడించారు.

నగర ం లో పని చేస అన్ని విబాó గాల జర్న లిసు ల్ట కూ గృ హా లు సవ ుకూ ర లా బహు ళ

అంతస్తుల టవర్స్‌ నిర్మిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8న క్యాంపు కార్యాలయంలో

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, జర్నలిస్టు నాయకులు శ్రీనివాసరెడ్డి,

అమర్‌, పల్లె రవి, క్రాంతి, విరాహత్‌ అలీ, పివి. శ్రీనివాస్‌, నాగేశ్వర్‌ రావు,

రమేష్‌ హజారి, బుద్దా మురళీ, సతీష్‌, శైలేష్‌రెడ్డి తదితరులతో సమావేశమై

చర్చించారు.

ముఖ్యమంత్రి సూచనల మేరకు నగరంలోని పలు ప్రభుత్వ సశీవలాలను

పరిశీలించి వచ్చిన జర్నలిస్టులు బుద్వేల్‌ ప్రాంతంలోని సశీవలం ఇండ్ల నిర్మాణానికి,

రవాణా సదుపాయాలకు అనువుగా వుందని నిర్ణయించారు. జర్నలిస్టుల అభీష్టం

మేరకు బుద్వేల్‌లోనే ఇండ్ల నిర్మాణం చేపడతామని సిఎం ప్రకటించారు.

బుద్వేల్‌లోని సశీవలం ప్రస్తుతం గ్రామీణాభివృద్ధ్ది శాఖ ఆధీనంలో వుందని, దానిని

తిరిగి ప్రభుత్వానికి బదలాయించాలని పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి

ఎస్‌.పి.సింగ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అనితారాంచంద్రన్‌ను సిఎం

ఆదేశించారు. జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం

చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావుకు సూచించారు.

హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో మొదటి విడతలో ఇండ్లు కడతామని,

ఇతర ప్రాంతాల్లోని జర్నలిస్టులకూ ఇండ్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. జిల్లా

కేంద్రంలోనూ జర్నలిస్టులకు ఇండ్లు కట్టే విషయంలో మంత్రులు, కలెక్టర్లకు

సూచనలు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పార్ట్‌టైమ్‌

రిపోర్టర్లందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకంలో భాగంగా గృహాలు

కట్టిస్తామన్నారు.

Other Updates