ప్రపంచంలో కొన్ని భాషలకు మాత్రమే విస్తృతమైన పదసంపద వున్నది. ఆ కొన్ని భాషలే నాదాత్మకాలు. అవి శబ్ధ నిర్మాణంతో ఒక క్రమ పద్ధతిని …. పైగా అవి శ్రావ్యమైన భాషలు. అటువంటి భాషలలో తెలుగు ఒకటి.. ఇవి ఏ.డి. క్యాంబెల్ దాదాపు రెండొందల ఏండ్ల కిందట చెప్పిన మాటలు. ఈ మాటల్లోని నాదాత్రుకాలు. శ్రావ్యమైన భాషలు అవే మాటలమీద దృష్టి పెట్టవలసిన అవసరం వుంది. తెలుగు భాషకు సంగీతం వుందనీ, అది వినసొంపుగా వుంటుందని అర్థమవుతూనే వున్నది. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా పాశ్చ్యాత్యులు అన్నదీ అందు! తెలంగాణ భాష (తెలుగు ూడా) అజంత భాష అయినందువల్ల అది గానానికి అనుూలమని మోవియన్ విలియవ్స్‌ు వంటి ఎందరో అభిప్రాయపడ్డారు. మరి… ఈ సౌందర్యానికి కారణాలు ఏమిటి అని ఆరా తీస్తే యతి, యతిమైత్రి ఒక కారణమని స్పష్టపడుతున్నది. సాధారణంగా యతి పద్యాల్లో వుంటుంది. అది పద్య విశ్రమస్థానం. కానీ తెలంగాణ ప్రజల వ్యవహారంలో ఈ యతి చాలా సహజంగా కనిపిస్తుంది. తెలంగాణ వ్యవహార్తలు తమ దైనందిన సంభాషణల్లో చాలా చక్కగా ఈ యతి దొర్లిస్తారు.
ఉదాహరణకు భళ్ళున తెల్లవారింది అనే ఆధునిక ప్రమాణ భాషయే తెలంగాణలో తెట్టన తెల్లారింది అవుతుంది. భళ్ళున తెల్లవారడంతో ప్రాస నియతి వుంది. అయితే అది రెండవ అక్షరం. యతి మొదటి అక్షరం కనుక మన గమనం యింకా ముందుగానే యతిమీద నిలుస్తుంది. తెట్టన తెల్లారిందిలో తె-తె.. ఈ రెండింటికి యతిమైత్రి కుదిరింది.
పట్టున గుండె పల్గింది… ఇదీ తెలంగాణ వాక్యమే! పట్టికలో పూ, పల్గిందిలోని ప ూ యతి కుదిరింది. అట్లాగే బెక్కన బెంగిటిల్లిందిలోనూ యతిమైత్రి వుంది. బెంగటిల్లడం అంటే బెంగపెట్టు కోవడం. మరి బెక్కన అంటే ఏమిటి? బెంగటిల్లడం అనే క్రియకు యతి కోసం ఆ క్రియ ముందు సహాయకంగా చేరిన శబ్ద సామ్యతకోసం వచ్చిన పదం కావచ్చు. లేదా కన్నడంలో బెక్కు అంటే పిల్లి. దానివలె అత్యంత దయనీయంగా, విచారంగా బెంగపెట్టుకోవడమా! ఆలోచించాలి.
నా చెంప చెటిల్లుమన్నది వాక్యంలోనూ యతిమైత్రివున్నది (అకారానికీ, ఎకారానికీ మైత్రి కుదరదని పండితులు చెబుతారు) నిజానికి అది చెటిల్లు కాదు చటిల్లు. వేయడంలో ధ్వన్యనుకరణ యిది. ప్రమాణ భాషలో చెంప చెళ్ళుమనిపిస్తారు. చటిల్లులోని టిపోయి వర్ణ సమీకరణంతో చెళ్ళు అయింది. తెలంగాణ చటిల్లు మూలరూపం.
వాడు చెటాన చెంప దెబ్బ ఏసిండు వాక్యంలో చెటాన చెంప దెబ్బల్లోనూ యతిమైత్రివుంది. చెటాన అంటే చెట్టన కావచ్చు. చెట్ట అంటే చేయి.. చేయితో దెబ్బ కొట్టడమే చెటానచెంపదెబ్బ కావచ్చు.లేదా…చెంపదెబ్బకు సపోర్టింగ్‌గా శుద్ధి సౌమ్యంతో వచ్చిన పదం ‘చెటాన’ కావచ్చు. పిటాన పిరం అటువంటిదే! పిరం అంటే ప్రియం, అధిక ధర పిరం పదానికి ఆసరాగా ముందు చేరిన మాట పిటాన. ఏమైతేనేం… వీటన్నింటిలోనూ యతిమైత్రి బ్రహ్మాండంగా వుంది.
ఆధునిక ప్రమాణ భాషలో మొహం వేళ్ళాడేసుకొని వచ్చాడు అనే వాక్యం వుంది. అంటే నిరుత్సాహ పడిపోయి, నీరుగారి పోయి రావడం. తెలంగాణలో దీనికి సమానార్థకంగా జబ్బలు జారేసిండు అంటున్నారు. ఈ జబ్బలు జారేడయంలోని యతిమైత్రి గురించి మళ్ళీ వేరేచెప్పాలా? అట్లాగే జ్వరం తగ్గిందా అనే ప్రశ్నావాక్యం తెలంగాణలో జరం జారిందా అవుతుంది. జరం జారడంలోనూ యతిమైత్రి వుంది. పాలు విరిగాయి అనే ప్రమాణ భాషా వాక్యం తెలంగాణలో పాలు పల్గినై అవుతుంది. చూడండి.. పాలు పలగడంలో యతిమైత్రి లేదూ! అట్లాగే ఊరు కటాల్న కదిలింది అంటారు. కటాల్నలోని క ూ, కదిలిందిలోని క ూ యతి కుదిరింది. వాడు తప్పి పోయాడు అనే తెలుగు వాక్యానికి సమానంగా కాట గల్సిండు వుంది తెలంగాణలో. ఇక్కడా యతిమైత్రే! (కాడు అంటే అడవి. కాట గలవడం అంటే అడవిలో దారితప్పినట్లు తప్పిపోవడం) కాలక్షేపం చేస్తున్నాడు, పొద్దు గడుపుతున్నాడు అంటే తెలంగాణలో పొద్దు పుచ్చుకుంటున్నడు అని. పొద్దు.. పుచ్చుకొ నడంలోనూ యతి విచ్చుకొంటున్నది.
తెలంగాణ ప్రజలు తిడుతున్నపుడు ూడా యతిమైత్రిని మరిచిపోరు. నీ మొకాన మొద్దులు పెట్ట, నీ కడుపు కాల, నీ చేతులకు జెట్టపుట్ట మొదలైన చీవాట్లలోనూ యతి నియతి వుంది. ఆధునిక ప్రమాణ భాషలోని ూలీనాలీ చేసుకొని బతకడం తెలంగాణలో కైకిలి గంబడి చేసుకొని బతకడం అవుతుంది. కైకిలి గంబడి (కంబళి) లోనూ యతి వుంది. ముగ్గురు వచ్చారు అనడానికి మూట ముగ్గురు వచ్చిండ్రు అన్నా, కార్జాలు కాలిపోతే, గుండెలు ూలిపోతై అని బాధాతిశయాన్ని అభివ్యక్తీకరించినా తెలంగాణ వ్యక్తులు యతిని మతిలోంచి వదలరు. యతి నియతి తెలుగు భాషా లక్షణం. ఆ లక్షణం సలక్షణంగా తెలంగాణ పలుకుబడిలో నిలిచి వుండడం విశేషం.
డా|| నలిమెల భాస్కర్