అభివృద్ధి పథంలో దూసుకుపోవలానుకున్నప్పుడు పారిశ్రామిక ప్రగతి తప్పనిసరి. అయితే అదే సమయంలో పరిశ్రమల నుండి ఎదురయ్యే దుష్ప్రభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం కూడా తప్పనిసరి. ముఖ్యంగా కాలుష్య కారకాలను క్రమబద్దీకరించాలి. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్ మహానగరంలోవున్న కాలుష్యపూరిత పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించే అంశాన్ని మంత్రి కెటి రామారావు సమీక్షించారు. మెత్తం 1068 కాలుష్యపూరిత పరిశ్రమలను మొదటి దశలో నగరం అవతలకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి చర్చించారు. నగరంలోని పౌరుల జీవితాల్లో క్వాలీటి పెంచేందుకే ఈ ప్రయత్నమని మంత్రి తెలిపారు. మెదట కాలుష్యపూరిత కంపెనీలను తరలిస్తామని, తర్వాతి దశల్లో అన్ని పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తామన్నారు. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందపేర్కొన్నారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించడం ప్రాథమిక లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమల తరలింపు పెద్ద సవాలన్నా మంత్రి, ఇందుకోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని ప్రజల్లో అవగాహన, నమ్మకం కలించడం కోసం పనిచేస్తామన్నారు. నూతన ప్రాంతాల్లో జనావాసాలకు సాధ్యమైనంత ఎక్కువ దూరంగా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చూస్తామని, దీంతో అయా జనావాసాలకు ఏలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిచ్చార్జ్ వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఈ తరలింపుతో పరిశ్రమలు సైతం అధునాతన పరిజ్ఞానాన్ని అందుకునేందుకు, అత్యుత్తమ మౌళికవసతులు సదుపాయాల కల్పనకు అవకాశం వస్తుందన్నారు. ఈ తరలింపులో పరిశ్రమలకు పలు రకాల ప్రోత్సాహకాల విషయమై మంత్రి అధికారులతో చర్చించారు. ల్యాండ్ కన్వర్షన్, పన్ను రాయితీలు, పరిశ్రమ అవరణల్లోనే గృహవసరాలకు అనుమతి వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిశ్రమలు ఒక చోట ఏర్పాటు చేసేందుకు వాటిని వర్గీకరణ చేస్తామన్నారు. ఓకే రంగంలో ఉన్న కంపెనీలకు ఒకే క్లస్టర్లలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఉన్న భూముల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ క్లస్టర్ల ఏర్పాటులో హెచ్‌ఎండిఎ లాంటి సంస్ధలతో కలిసి పనిచేయాలని టియస్ ఐఐసి అధికారులను మంత్రి అదేశించారు. త్వరలోనే నగరంలోని పరిశ్రమలతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ అంశంలో పలు బల్క్ డ్రగ్ మాన్యూపాక్చరర్స్ అసోషియేషన్లతో మంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమలను తరలించేందుకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలో తెలపాల్సిందిగా కోరారు. నగరంలోని కెమికల్, ఫార్మా కంపెనీలను నూతనంగా ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటిలోకి తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. మిగిలిన కంపెనీలకు ప్రత్యేకంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తామన్నారు. కంపెనీల తరలింపులో పరిశ్రమలతో కలిసి సమన్వయంతో పనిచేస్తామని, వారి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. కామన్ అప్లూయెంట్ ప్లాంట్ల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసిన తర్వాతనే తరలింపు మెదలు పెడతామన్నారు.
చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలతో మంత్రి కెటి రామారావు సమావేశం
చిన్న, మధ్య తరహ పరిశ్రమలతో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఈ మేరకు తెలంగాణలోని పలు ఎంఎస్‌ఎంఈ సంఘాలతో మంత్రి సమావేశం అయ్యారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద చర్చించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ఎంఈ తమపై ప్రభుత్వం విధిస్తున్న అస్థిపన్నును తగ్గించాలని, లేదా సంస్ధల పరిమాణాన్ని బట్టి ప్రత్యేకంగా టాక్స్ విధించే అంశాన్ని పరిశీలించాలని మంత్రిని ఎంఎస్‌ఎంఈని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈ విధిస్తున్న పన్నుల వివరాలను మంత్రికి అందించారు. వాటర్ సరఫరా రేట్లను కొంత తగ్గించేలా చూడాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఎంఎస్‌ఎంఈ లకు 1500 ఎకరాల భూమిని కేటాయించాలని మంత్రిని కోరారు. ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు స్ధలం ఇస్తుందని, కానీ నిర్ణీత గడువులో కార్యకలాపాలు ప్రారంభించకుంటే అటోమేటిగ్గా లీజు రద్దు అయ్యేలా నిబంధనలు విధిస్తామని అన్నారు. బ్యాంకుల నుంచి లోన్లు, ఎన్‌పిఎల పేరుతో ఇబ్బంది పెడుతున్నాయని ఇందుకోసం ఎస్‌ఎల్‌బిసి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.