రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 80 నుండి 90 శాతం భూభాగానికి నీరందించే ప్రాజెక్ట్ గా చరిత్రలో నిలువనున్నది. నిర్మాణదశలో వున్న ఈ ప్రాజెక్టును ఓ వైపు కేంద్ర జలసంఘం ప్రతినిధులు సందర్శించి వచ్చారు. మరోవైపు అటవీశాఖ అధికారులు కూడా ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశాలను సందర్శించి వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం అక్కడి అటవీ భూములను బృదలాయించడంలో తాము కూడా భాగస్వాములమైనందుకు గర్వంగా వుందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధులబృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించిన ఈబృందం సభ్యులు ప్రాజెక్టు పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని విధాలా ప్రత్యేకమైనదిగా సి.డబృ్ల్యూ. సి.బృందం వ్యాఖ్యానించింది.ఇది సమీకృత,బృహుళార్ధసాధక ప్రాజెక్టు అని కేంద్ర జల సంఘం ప్రాజెక్టుల అప్రైజల్ విభాగం చీఫ్ ఇంజనీర్ సి.కె.ఎల్.దాస్ అన్నారు. మిడ్ మానేరు, ఎస్.ఆర్.ఎస్.పి సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబృోతున్నదని చెప్పారు.
ఒక భారీ ప్రాజెక్టు ఇలా మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తున్న ప్రక్రియ తెలంగాణలోనే కనిపిస్తున్నట్టు దాస్ అభిప్రాయపడ్డారు. స్ట్రక్చర్ల నిర్మాణాలు, ప్రణాళిక, పనులవేగం,పనులు జరుగుతున్నతీరు తమను ఆకట్టుకు న్నాయని అన్నారు. రేయింబృవళ్లు మూడు షిఫ్టులలో భారీగా జరుగుతున్న పనుల వేగాన్ని బృట్టి వచ్చే వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందని సి.డబృ్ల్యూ.సి.బృంద సారధి దాస్ అభిప్రాయపడ్డారు.. ఇంత వేగవంతంగా పనులు జరగడం ఎక్కడా చూడలేదని వ్యాఖ్యా నించారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించేబృహత్తర ప్రాజెక్టు అని ఆయన ప్రశంసించారు.
జూన్ లో ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితాన్ని అందిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, టైమ్ ఫ్రేమ్ ప్రకారం పనులు జరిగితే అనుకున్న గడువులోపే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ప్రాజెక్ట్ వ్యయం పెరగకుండా పనులు పూర్తి అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ అన్ని శాఖలూ కలిసి కట్టుగా పనిచేయాలని దాస్ కోరారు.పనులలో వేగం మరింత పెంచాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక సవాలుగా తీసుకుందని పేర్కొన్నారు .మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలసంఘం హైడ్రాలజీ డైరెక్టర్ నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణ పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని, దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్‌గా కాళేశ్వరం నిర్మాణం అవుతున్నట్టు రాయ్ వ్యాఖ్యా నించారు.జాతీయ అభివద్ధిలో కాళేశ్వరం భాగస్వామి అవుతుందని సి.డబృ్ల్యూ.సి.సి.ఈ. దాస్ అన్నారు. ఇదొక మెగా ప్రాజెక్టు అని కొనియాడారు.కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతోపాటు బృహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమని అన్నారు. తమ ప్రభుత్వం కాళేశ్వరంను నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ప్రణాళికా బృద్ధంగా పని చేస్తున్నట్టు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం సమీక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్ణీత గడువు లోపే ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డును నెలకొల్పనున్నట్టు జోషి చెప్పారు.కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
అటవీశాఖ అధికారుల పర్యటన
రాష్ట్రంలోని 80 శాతం వరకు భూభాగానికి నీరందించే ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణం గా ఉందని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా నేతృత్వంలోని 50 మంది అటవీ శాఖ అధికారులబృందం భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో జరుగుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. ప్రత్యేక బృస్సులో హైదరాబృాద్ నుంచి బృయల్దేరిన అధికారులు ముందుగా వరంగల్ చేరుకొని అక్కడ కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. అక్కణ్నుంచి భూపాలపల్లి చేరుకున్న అధికారులు… అటవీశాఖ కార్యాలయంలోని వుడెన్ హౌజ్ ను పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు కోసం అటవీ భూముల బృదలాయింపు, ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకం తదితర అంశాలపై క్షేత్ర స్థాయి పర్యటనలో వివరాలు తెలుసుకున్నారు.
మేడిగడ్డ ఆనకట్ట, కన్నేపల్లి పంప్‌హౌజ్‌తో పాటు అన్నారం ఆనకట్ట పనులను పరిశీలించారు. ప్రతి సైట్ వద్ద ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీల ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలు, నీరు లిఫ్ట్ చేసే విధానం, పంపులు, మోటార్లు తదితర అంశాలతో పాటు పనుల పురోగతిని అటవీశాఖ అధికారులకు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం బృదలాయిస్తోన్న అటవీ భూములు, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి సంబృంధిం చిన ప్రణాళికలు తదితర వివరాలను ఆరా తీశారు.
తెలంగాణకే ప్రాజెక్టు తలమానికంగా నిలుస్తుందని… ఇందుకోసం ఇప్పటికే అటవీశాఖ తరపున అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో భాగం కావడం గర్వకారణంగా ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పనుల కోసం విలువైన అటవీ భూములు పోతున్నప్పటికీ వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా పెద్దఎత్తున అడవుల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. హరితహారం ద్వారా తగినంత పచ్చదనం పెంచుతామని చెప్పారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరానికి రికార్డు సమయంలో అనుమతులు సాధించినట్లు తెలిపారు.పెద్దపల్లి జిల్లా ధర్మారంలో టన్నెల్ పనులను కూడా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేనతో పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. టన్నెల్ పనుల వివరాలు తెలుసుకున్నారు.