రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ప్రాజెక్టు మొదటి దశ పనులకు రూ. 7400 కోట్ల రూపాయల ఖర్చును ఆంధ్రాబ్యాంకు లీడ్‌ బ్యాంకుగా ఉ ండే బ్యాంకు కన్సార్టియం అంచనా వేసింది. దీనిలో ఆంధ్రాబ్యాంకు వాటాగా రూ. 1300 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించి, దానికి సంబంధించిన ఆమోదపత్రాన్ని డిసెంబరు 15న ఆంధ్రాబ్యాంకు ఎం.డి. సురేష్‌పటేల్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు అందించారు. ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఆంధ్రాబ్యాంకు ఈడీ ఎ.కె. రథ్‌, డీజీఎం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాల్లో కూడా తాము పాలుపంచుకుంటున్నట్లు ఆంధ్రాబ్యాంకు అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు. మిషన్‌ భగీరథకు రూ. 1935 కోట్లు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 235 కోట్లు, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రూ. 400 కోట్లు రుణంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Other Updates