పుష్కరం అంటే ఆధునిక కాలంలో ఏదైనా జీవనదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అనే అర్థం చెపుతున్నారు. అయితే పుష్కరం అంటే జలం అనే అర్థం ఉంది. మనిషికి పుష్టినిచ్చే వాటిలో నీరు ఒకటి. ”పోషయతీతి పుష్కరం” పోషించేది అనే అర్థం. జలాన్ని బాహ్య శుద్ధికి, అంతఃశుద్ధికి కూడా వినియోగిస్తుంటాం.
పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కర మహోత్సవాన్ని వందేళ్లు గుర్తుంచుకునేలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా పుష్కర ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు. కృష్ణా పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 825 కోట్లను కేటాయించింది.
14 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అధికారులు పనులను చేపట్టారు. రహదారుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులను కూడా యుద్ధ ప్రాతిపాదికన చేపట్టడం జరిగింది.