మహా రాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహా బలేశ్వరం కొండల్లో పుట్టి కర్ణాటక మీదుగా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణమ్మకు త్వరలోనే పుష్కరశోభ సంతరించుకోనున్నది. గురువు కన్యారాశిలోకి ప్రవేశించగానే ఆగస్టులో కృష్ణానదికి 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సర్కారు సంకల్పించింది.
పుష్కరాల కోసం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ ప్రవహించే మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో రూ.825 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది.
భారీగా పెరిగిన పుష్కర ఘాట్ల సంఖ్య
ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పుష్కరాలను గత పాలకులు తెలంగాణలో కృష్ణానదీ పరి వాహక ప్రాంతంలో పెద్ద పటీ వయే ు లదే ని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి వస్తున్న కృష్ణా పుష్కరాలు కావడంతో అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలనే కృతనిశ్చయంతో తెలంగాణ సర్కారు ఉంది. గత పుష్కరాల సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో 17 ఘాట్లు ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా మరో 35 ఘాట్లను నిర్మిస్తున్నారు. నల్లగొండ జిలాల్లో 11 ఘాట్లు ఉండగా మరో 23 ఘాట్లను నిర్మిస్తున్నారు.
రెండు జిల్లాల్లో మొత్తం 86 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.212 కోట్లు కేటాయించింది. గత పుష్కరాల సందర్భంగా నిర్మించగా శిథిలావస్థలో ఉన్న 17 ఘాట్లకు కూడా మరమ్మతులు చేపట్టనున్నారు.
గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు తమ ప్రభుత్వం ఈ ఏడాది ముందుగానే కసరత్తు ప్రారంభించిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సహచర మంత్రులు, చీఫ్ సెక్రటరీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై ఎప్పటి కప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాలను ఎంతో సమన్వయంతో ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా విజయవంతంగా నిర్వహించామని.. అదే స్పూర్తితో ఇప్పుడు కృష్ణా పుష్కరాలను బ్రహ్మండంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజురూ చేశారని మంత్రి వివరించారు. కృష్ణా పుష్కరాలకు సుమారు 4కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని..దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
పుష్కర స్నానమాచరించేందుకు తెలంగాణ లోని 10 జిలాల్ల భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. దీంతో రవాణా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా విశాలమైన రహదారులు నిర్మించేందుకు ఆర్ ఆండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు.
స్నానపు ఘట్టాల వద్ద భక్తుల సౌకర్యం కోసం వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, తాత్కలిక షెడ్లు, మంచినీటీ సరఫరా, శానిటేషన్, వివిధ శాఖల ఆద్వర్యంలో చేపట్టే పనుల కోసం ప్రభుత్వం మొత్తం రూ .825 కోట్లను కేటాయిచింది. ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణానికి రూ. 398 కోట్లు, పంచాయతీ రాజ్ విభాగ రహదారులకు రూ. 133 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.38.04కోట్లు, పంచా యతీరాజ్ శాఖకు రూ.10.22కోట్లు, తాగునీటి సౌకర్యానికి రూ.18.30కోట్లు కేటాయించారు. మత్య్స శాఖకు రూ. 1.19 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 8.6 కోట్లు, ప్రజారోగ్య శాఖకు 0.16 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 1.75 కోట్లు శాఖకు రూ . 10 కోట్లు ఫైర్ శాఖకు కోట్ల రూపాయలు, దేవాదాయ శాఖకు రూ. 4.54 కోట్లు వ్యయం చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పుష్కరాల ఘాట్ల పరిసరాల్లోని అన్ని నదీతీర ఆలయాల అభివృద్దికి అదనపు నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో నదీతీర ఆలయాలను అంగరంగ వైభవంగా తీర్చదిద్దనున్నారు. శక్తిపీఠంమైన ఆలంపూర్ జోగుళాంబ ఆలయంతోపాటు ఇతర ప్రముఖ ఆలయాల మరమ్మతు పనులను రూ.2.46 కోట్లతో దేవాదాయ శాఖ అద్వర్యంలో చేపట్టారు.
ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి
దట్టమైన పచ్చని అటవీప్రాంతం, కనుచూపు మేరకు విస్తరించిన నల్లమల కొండలు, సందర్శకులను కనువిందు చేయనున్నాయి. జాతీయ రహదారులతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకకు గల అంతర్రాష్ట్ర రహదారులు, రైల్వే స్టేషన్లు, రెండు జిల్లాలకు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో పాలమూరు, నల్గొండ జిల్లాలోని పుష్కరఘాట్లలో పుష్కరస్నానం చేసేందుకు, ప్రకృతి సోయగాన్ని, మహిమాన్విత ఆలయాలను దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నది. దీంతో మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పుష్క రాలకు వచ్చే విఐపలీకు బస చేసందు కు విడిది గృహాలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులను కూడా మంజురూ చేసింది. ఆధ్యాత్మిక శోభ ,ఆహ్లాదకర వాతావరణం ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత భక్తులు సమీపంలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు రవాణాతో పాటు మిగతా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లా మట్టపల్లి, సాగర్, వాడపల్లి, ఆడవి దవేలపల్లితో పాటు మహాబూబ్ నగర్ జిల్లా నదీ అగ్రహారం, సోమశిల, కృష్ణ దత్తాత్రేయ స్వామి, బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం, ఆలంపూర్ జోగులాంబాలయం వంటి ప్రముఖ దేవాలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుణ్యస్నానమాచరించేందుకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఆలయ పరిసర ప్రాంతాలను, స్నానఘట్టాలను తీర్చిదిద్దునున్నారు. అవసరమైన చోట ఎల్ ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ల అడ్రస్ సిస్టమ్, హోర్డింగ్ లు, సీసీ కెమెరాలతో పాటు సాంస్కృతిక కళాబృందాల ద్వారా పుష్కరాల ఔన్యత్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఇక ఠంచన్‌గా ఆసరా పెన్షన్లు
ఆసరా పెన్షన్ల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ పెన్షన్ల చల్లింపునకు ప్రతి నేలా ఆర్ధిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేస్తుంది. అనంతరం సెర్ప్ ద్వారా జిల్లాలకు ఆ నిధులు చేరతాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తికావడానికి కొంత వ్యవధి పడుతుంది. దీంతో లబ్ధిదారులకు పెన్షన్ చెల్లింపులో జాప్యం జరుగుతోంది. అంతేగాక, ఏనెలలో ఏతేదీన పెన్షన్ చెల్లించేది అధికారులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీంతో లబ్ధిదారులు పెన్షన్ల కోసం ఎదురుచూపులు చూడవలసివస్తోంది. అందుకే ఈ అనవసర జాప్యాన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సూచనలమేరకు ప్రభుత్వం ఈ పెన్షన్ల క్రింద సంవత్సరంలో చెల్లించవలసిన మొత్తం నిధులను ఒకే సారి విడుదలకు ఆదేశాలు జారిచేస్తూ కీలక నిర్ణయిం తీసుకుంది. ఈ వుే ర కు సంవత్సరం మొత్తానికి కలిపి4,438 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఏప్రిల్ 16న ఆర్ధిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీచేసింది.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, తదితర వర్గాల వారికి ప్రభుత్వం గతంలో అందచేసిన 200 రూపాయల పెన్షన్ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.1,000కి పెంచింది. పెరిగిన ఈ మొత్తం ఆయా వర్గాలవారికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పుడు ఇక జాప్యం లేకుండా ప్రతినెలా ఠంచన్‌గా ఆసరా అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. ఇకపై ఆసరా పెన్షన్ పొందే లబ్ధిదారులు నిధుల విడుదల కోసం ఎదురుచూడవలసిన పనిలేకుండా, సకాలంలోనే పెన్షన్ పొందే అవకాశం ఏర్పడింది.