ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తమ దేశంలో పర్యటించవలసిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్ర విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (డీజీ) రaాంగ్ టాయో ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చైనా విద్యుత్ పరికరాల తయారీ సంస్థ ‘డాంగ్ ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డీఈసీ)తో పరస్పర అవగాహనా ఒప్పదంకోసం నవంబరు 29న ఆ దేశ అధికారులు మన రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా ఈ ఆహ్వానపత్రం అందజేశారు.తెలంగాణ, సిచువాన్ రాష్ట్రాల మధ్య స్నేహబంధం బలోపేతం చేయడంతోపాటు వ్యాపారం, సాంస్కృతిక అంశాలలో పరస్పర సహకారంకోసం చైనాలో పర్యటించ వలసిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు రాసిన లేఖలో టయో పేర్కొన్నారు. ‘డీఈసీ’ ప్రధాన కార్యాలయంగల సిచువాన్‌తోపాటు, చెంగ్డూ రాష్ట్రంలో కూడా పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. రెండు రాష్ట్రాలలో అపార ఖనిజసంపద, విస్తృత పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయని, చరిత్ర, సంస్కృతి, వనరుల్లో రెండు రాష్ట్రాల మధ్య సారూప్యతలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
హోం
»