ktrకొంతకాలం కిందట ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన దాదాపు 30 మంది బతుకుదెరువు కోసం ఇరాక్‌కు ఉపాధి కోసం వెళ్లారు. కుర్దిష్‌ మిలిటెంట్లతో అంతర్యుద్ధం జరుగుతున్న ఎర్బిల్‌ ప్రాంతంలో పనిచేస్తుండగా వీరిని పోలీసులు అనుమానించారు. సరైన అకామా(గుర్తింపు పత్రాలు)లేకపోవడంతో అరెస్ట్‌చేశారు. వారి కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు ఈ విషయాన్ని తెలుపగా, ఆయన స్పందించి ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయంతోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వివరించారు. తెలంగాణ బిడ్డలను ఇబ్బందులు లేకుండా విడిపించాలని కోరారు. ఎన్‌ఆర్‌ఐ బసంత్‌రెడ్డికి కూడా ఈ విషయాన్ని పరిశీలించమని సూచించారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో జైల్లో బందీగా ఉన్న ముప్పై మందికి విముక్తి లభించగా ఏప్రిల్‌ 3వ తేదీన బాధితులు ఇరాక్‌ నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు.

జగిత్యాలలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ జనహిత ప్రగతి సభకు హాజరైన మంత్రి కేటీఆర్‌ను ఇరాక్‌ బాధితులు గుమ్ముల రాజు, దుర్గం రవి, మామిడాల లక్ష్మణ్‌, కైరం రమేశ్‌, ఆపుదారి రమేశ్‌, ఎలుగొండ గంగాధర్‌, మారేడు లక్ష్మణ్‌ తదితరులు కలిసికృతజ్ఞతలు తెలిపారు. వారందరినీ మంత్రి కేటీఆర్‌ పరామర్శించడంతో పాటు, వివరాలు ఇస్తే సాయం చేస్తానని హామీఇచ్చారు. సరైన గుర్తింపు పత్రాలు లేక ఇరాక్‌లోని జైల్లో ఉన్న మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన కోట కృష్ణంరాజును విడిపించాలని అతని తల్లి, దుబాయ్‌లో బందీగా ఉన్న జగిత్యాల మండలం కన్నాపూర్‌ గ్రామానికి చెందిన మెటం నరేశ్‌ను విడిపించాలని అతడి భార్య లక్ష్మి.. మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. తప్పకుండా సాయం చేస్తానని మంత్రి వారికి భరోసా కల్పించారు.

Other Updates