ఓ సామాన్యుడికి ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌చేసి ‘‘బాగున్నారా?’’ అంటే…
ఆ ఫోను అందుకున్న వ్యక్తి ఆనందానికి ఇక హద్దేముంటుంది!
సరిగ్గా అదే జరిగింది! అంతేకాదు. ఆయన సమస్యకు పరిష్కారం కూడా లభించింది.
ప్రతాప శాయిరెడ్డి హుజూరాబాద్‌లోని ప్రతాపవాడకు చెందిన రిటైర్డ్ టీచర్. నవంబరు రెండవ తేదీ ఉదయం శాయిరెడ్డి ఇంట్లో ఫోన్ మోగింది. ఫోన్ అందుకున్న శాయిరెడ్డి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఫోన్‌లో అవతలినుంచి…
‘‘హలో… నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాట్లాడుతున్న… ప్రతాప
శాయిరెడ్డిగారూ బాగున్నారా? మీ హుజూరాబాద్‌కు సంబంధించిన మోడల్ చెరువును రిజర్వాయరుగా మార్చాలని ‘సాక్షి’ దినపత్రికలో మీరు రాసిన లేఖను చూశాను. ఈ చెరువుకోసం 60 కోట్ల రూపాయలు మొన్ననే కేటాయించినం. ఇంకా పనులు మొదలుపెట్టలే. ఖచ్చితంగా పనులు ప్రారంభించి, అతి త్వరలోనే దీని ఓపెనింగ్‌కు నేనువస్తా. గా ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుస్తా’’ అంటు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌చేసి చెప్పారు.
కెప్టెన్ లక్ష్మీకాంతరావు ద్వారా ప్రతాప శాయిరెడ్డి ఫోన్ నంబరు తెలుసుకున్న ముఖ్యమంత్రి నేరుగా ఆయనతోనే మాట్లాడారు.
హుజూరాబాద్‌కు సంబంధించిన మోడల్ చెరువును రిజర్వాయరుగా మారిస్తే పట్టణ ప్రజలకు తాగునీటితోపాటు, చుట్టుప్రక్కల వ్యవసాయభూములకు సాగునీటి సమస్య కూడా తీరుతుందని గత ప్రభుత్వకాలం నుంచి ప్రతాప
శాయిరెడ్డి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనేకమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
చివరకు ‘సాక్షి’ దినపత్రికకు ఓ లేఖ రాశారు. పత్రికలో ఆ లేఖను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం స్పందించి, ప్రతాప శాయిరెడ్డికి ఫోన్ చేశారు.
అంతేకాదు…
ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖా మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయాలనుంచి కూడా సంబంధిత అధికారులకు ఈ మోడల్ చెరువుకు సంబంధించిన సమాచారం వచ్చింది. హుజూరాబాద్ తహశీల్దార్ బండి నాగేశ్వరరావుకూడా ప్రతాప శాయిరెడ్డితో ఈ మోడల్ చెరువు గురించి చర్చిం చారు. తన లేఖకు తక్షణం స్పందించి, తగు చర్యలు గైకొన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు ప్రతాప శాయిరెడ్డి మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
హోం
»