kifhanమేము కాలేజీల సదువుతున్న దినాలల్లనే అమితాబ్‌ బచ్చన్‌ డాన్‌ సైన్మ రిలీజైంది. గా సైన్మను నాలుగైదు సార్లు సూసినం. గాయిన యాక్టింగ్‌ గురించి గాదు. జీనత్‌ అమన్‌ డాన్సు గురించి గాదు. ‘కైకే పాన్‌ బనారస్‌ వాలా’ పాట కోసమే గా సైన్మను గన్ని సార్లు సూసినం. మాకు పాన్‌ దినుడు అల్వాటు. మేము దినేది సాద పాన్‌ గాదు. మీటా పాన్‌ గూడ గాదు. జర్దాపాన్‌. గా పాన్‌ దింటేనే మాకు పాన్‌ దిన్నట్టు ఉండేది. జర్దా పాన్‌ దినుకుంట సడక్‌ మీద ఊంచుకుంట బోయెటోల్లం. ఇగ దాంతోని సిగిలేట్లు దాగేటి కొంత మంది మా దోస్తులు గలీజ్‌ పాన్‌ అనేటోల్లు. గాల్లు అట్ల అంటె మేము ఊకుంటమా?

ఎన్కట ఒక వైసు పోరడు పెండ్లి సూపులకు బోయిండు. పొల్ల కర్రెగున్నది. ఎవ్వరికి నచ్చలేదు. గని గా పోరనికి నచ్చింది. పెండ్లి జేస్కుంటె గా పొల్లనే జేస్కుంట అని గాడు అన్నడు.

‘కర్రె పొల్లను జేస్కుంట నంట వేందిరా?’ అని అడిగితె

‘ఒకపారి నా కండ్లతోని సూడు. పొల్ల ఎంత సక్కగున్నదో నీ సమజైతది’ అని గాడు అన్నడు.

గదే తీర్గ మా నోటితోని దింటె జర్దపాన్‌ ఎంత బాగున్నదో మీ అర్తమైతది. మా ఇంట్ల మా నాయినమ్మ జర్దపాన్‌ తినేది. కుద్దు ఆమెనే పాన్‌ గట్టుకునేది. మా బోన్గిరి తమల పాకులకు మశూర్‌. మా ఇంట్ల పాన్‌ దాన్‌ ఉండేది. గా దాంట్లనే కాసు, సున్నం, పోకలు, జర్ద, తమ్లపాకులు ఉండేటియి. ఊంచెతందుకు తూక్‌ దాన్‌ గూడ ఉండేది. యాడికన్న బోయినప్పుడు గివన్నిటిని ఒక బుడ్డ సంచిల బెట్టి గా దాన్ని మా నాయినమ్మ బొడ్లె చెక్కుకునేది. ఇగ మా నాయినకు సిగిలేటు అల్వాటు లేదు. పాన్‌ అల్వాటు గూడ లేదు. గని నస్యం అల్వాటు ఉండేది. రాత్రి పూట నిద్ర రాకుంట ఉండేందుకు సద్వుకునేటప్పటి ల్లిె గాయిన నస్యం పీల్చెటోడట. మా అన్నకు ఒక్క అల్వాటు లేదు. గాడు రాముడు మంచి బాలుడు.

సిగిలేటు దాగెటోల్లు సిగిలేటు దాగెటోల్లతోని సోపతి జేస్తరు. గాల్ల తాన సిగిలేటు లేకుంటే దోస్తు తాన అడుక్కొని దాగొచ్చు. ఇద్దరు సిగిలేటు దాగెటోల్లుంటేనే గా సౌలత్‌ ఉంటది.

గదే తీర్గ ఇద్దరు పాన్‌ దినేటోల్ల నడ్మ సోపతి ఉంటేనే కలిసి పాన్‌ డబ్బకాడ్కి బోవచ్చు. జర్దపాన్‌ దినుకుంట ముచ్చట బెట్టొచ్చు. సోపతులన్నిట్లల్ల గిసువంటి సోపతేే మజ్బూర్గ ఉంటది.

ఒకపారి మా ప్రమోద్‌ గాడు బస్సుల కోటికి బోబట్టిండు. గాని నోట్లె పాన్‌ ఉన్నది. గాన్కి కిటికి పక్కన సీటు దొరికింది. ఇగ దాంతోని కిడ్కిిల ల్లేె గాడు ఊంచ బట్టిండు. తెల్లంగి దొడుక్కోని ఒకడు మోటర్‌ సైకిల్‌మీద పోబట్టిండు. ప్రమోద్‌గాడు ఊంచితే గాని అంగిమీద పడింది. మోటర్‌ సైకిిలోడు బస్సు ముంగట్కి బోయిండు. డేవర్‌ బస్సు రుకాయించిండు. బస్సు గిట్ల ఆగంగనే ప్రమోద్‌ గాడు జట్న బస్సు దిగి ఎన్కకు సూడకుంట ఒక్కటే ఉర్కుడు. ఒగాల్ల గానికి గీడు దొర్కితె ఆ పెయ్యిల బొక్కలు చూర చూర అయ్యేటియి.

నేను ఒక పత్రిక ఆఫీస్కు బోయి కత ఇచ్చేడ్ది ఉండె. పాన్‌ డబ్బ కాడ్కి బోయి పాన్‌ దీస్కున్న. ఎన్క సన్నం, మీద్కి పెద్ద పొక్క అచ్చం బుడ్డ తరాజు లెక్క ఉన్న కాయితంల పాన్‌ బెట్టి పాన్‌ దుక్నపోడు ఇచ్చిండు. నేను పాన్‌ దీస్కొన్క. గని పాన్ల ల్లిె గారిన కాసు నా అంగిమీద బడింది. అంగి ఎర్రగైంది. ఒక జరూర్‌ పని మీద సెక్రటేరియట్‌కు బోయిన. గాడ అందరు నాది్క సూడ బట్టిండ్రు.

‘పెయ్యంత నెత్తురుతోని దడుస్తె. దవకానకు బోక గీడిందుకు అచ్చినవు’ అని ఒకడు అడిగిండు.

‘గిది నెత్తురు మర్క గాదు’ అని నేనంటె

‘మల్ల ఏం మర్క’

‘కాసు మర్క. నేను పాన్‌ తింట గదా. పాన్‌ను నోట్లె బెట్టుకోబోతుంటె గా దాంట్ల ల్లిె కారిన కాసుతోని నా అంగి జెర ఎర్రగైంది’

‘గట్లయితె గిది నెత్తురు మర్క గాదంటవు’

‘అవ్‌’

‘పట్నంల కొట్లాటలు అయితున్నయి. నిన్ను ఎవడన్న కత్తితోని పొడ్సిండనుకుంటరు. జల్ది ఇంటికి బోయి ఇంకొక అంగి దొడుక్కొని రా’

గా దినం నాకు చార్మినార్‌ కాడ్కి బోయే పని బడ్డది. బస్సు ఎక్కిన. బస్సుల కిడ్కి పక్కపొంటి గూసున్న ఒకడు పాన్‌ దింటున్నడు. నడ్మల కిడ్కిల ల్లిె ఉంచుతున్నడు. గాడు ఉంచె తల్కె ఎన్క గూసున్నోని మీదబడ్డది. గాడు గూడ పాన్‌ తింటున్నడు. అఫ్జల్‌ గంజ్‌ వొచ్చింది. కిడ్కిల ల్లిె ఊంచుతున్నోడు బస్సు దిగబట్టిండు. గాడు ఊంచంగ అంగి కరాబైనోడు గూడ బస్సు దిగుకుంట ఊంచినోని మీద ఊంచిండు. గాని అంగి గూడ కరాబైంది. గాల్లిద్దరు తిట్టుకుంట ఒకరి మీద ఒకరు ఊంచుకోబట్టిండ్రు. గప్పుడు తొవ్వపొంటి బోయెటోని మీద గాల్ల ఊముబడ్డది. గాడు గుండు గుండున్నాడు. గాడు గల్లి దాదా. గాని యెంబడి ఇద్దరున్నరు. గాల్లు గుడ్క దాదాలె. గా ముగ్గురు గల్సి గీల్లిద్దర్ని మెత్తగ తోమిండ్రు. బస్సుల గూసున్నప్పుడు పాన్‌ తినద్దని, తిన్నా ఊంచద్దని నా కర్తమైంది. పాన్‌ తినుడు బంద్‌ జేస్తె బాగుంటదనుకున్నా. గని జర్దపాన్‌ నన్ను ఇడుస్తలేదు. ‘కైకే పాన్‌ బనారస్‌ వాలా’ అని పాడుకుంట కల్కత్తా జర్దపాన్‌ను

ఇప్పట్కి గూడ ఇడుస్తలేను.

Other Updates