cm-sarనూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో జిల్లాలు కూడా చిన్నగా ఉంటే ప్రజలకు క్షేత్రస్థాయిలోకి సుపరిపాలన చేరుకుంటుందని, తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక ఘట్టంగా నిలిచిందని, జిల్లాలు, మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలవనున్నదని సిఎం తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే జిల్లాలను క్రమబద్దీకరించనున్నట్టు సిఎం తెలిపారు. ఎన్నికల హామీకి అనుగుణంగా ‘జిల్లాల క్రమబద్ధీకరణ- పెంపు’ అనే అంశంపై అధికారిక నివాసంలో మే 5న సిఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాల పునర్మిర్మాణంపైన సుదీర్ఘ చర్చ, సమీక్ష జరిగింది. ఈ మేరకు అగస్టు 15 నుంచి కానీ దసరా పండగనాటి నుంచి కానీ నూతన జిల్లాల నుండే అధికారిక కార్య క్రమాలు చేపట్టే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త జిల్లాలు, పాతవి కలిపి మొత్తం 24- 25 వరకు ఉంటాయని సిఎం అన్నారు. వీటితో పాటు మరో 60 మండలాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వీటికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం ఆయా శాఖల అధికారులను పెంచనున్నారు. ఇందులో భాగంగా ప్రతీ 8 నుంచి 10 మండలాలకు ఒక రెవిన్యూ డివిజన్‌ అధికారిని ప్రభుత్వం నియమించనున్నది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, డిప్యుటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు డి. శ్రీనివాస్‌, పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, సిఎంవో అధికారులు భూపాల్‌ రెడ్డి, శాంతి కుమారి, స్మితా సబర్వాల్‌, ప్రియాంక వర్గీస్‌, ఇంటిలిజెన్స్‌ ఐజీ శివధర్‌ రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి తదితరులు ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపువల్ల కలిగే పరిపాలనా సౌలభ్యం, తదితర ప్రజా ప్రయోజనాలను లోతుగా చర్చించారు. కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో అందే గ్రాంటులు, నెలకొల్పే విద్యాలయాలు కేంద్రం విడుదల చేసే నిధులు, చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాను యూనిట్‌గా తీసుకునే నిర్ణయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి అందే ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో పొందవచ్చని సిఎం తెలిపారు.

ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వందల కిలో మీటర్ల దూరంలో వున్న విషయాన్ని సిఎం పరిశీలించారు. రెవిన్యూ, న్యాయ, మున్సిపల్‌, విద్యా, వైద్యం తదితర నిత్యం ప్రజలతో సంబంధాలుండే ముఖ్య కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే కేంద్రీకృతం అయివుండడం మూలాన మారుమూల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతుండడాన్ని సమావేశం విశ్లేషించింది.

రాజధానిగా హైదరాబాద్‌ నగరం దినదినాభివద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తరాలను దష్టిలో ఉంచుకుని కేంద్రీకృతం అవుతున్న అభివృద్ధిని తెలంగాణ వ్యాపితంగా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉన్నదని సిఎం తెలిపారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పలు జిల్లాలకు చెందిన పట్టణాలను జిల్లా కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా వికేంద్రీకరణ సాధ్యపడుతుందని సిఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికంటే తక్కువ విస్తీర్ణం, అతి తక్కువ జనాభా కలిగిన పలు రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ సంఖ్యలో జిల్లాలున్న సంగతిని, సమావేశం పరిశీలించింది. న్యాయపరమైన అంశాలను ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజలకు చేరువలో ఉన్నప్పుడే అధికారులు అందుబాటులో వుంటారని సిఎం స్పష్టం చేశారు.

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్త్రీయ పద్దతిలో చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల కసరత్తు చేయాలని, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని, ప్రజలే కేంద్రంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నూతన జిల్లాల ఏర్పాటు జరగాలని అధికారులను సిఎం అదేశించారు.

తమ తమ పట్టణాలు, ప్రాంతాలు జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రజలు కోరుకుంటా రని అయితే పరిపాలనా పరమయిన వెసులుబాటును దష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. జిల్లాలు పెరిగితే యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచనున్నట్లు సిఎం తెలిపారు. ఎన్ని జిల్లాలు ఉండాలి.. ఎన్ని మండలా లను నూతనంగా ఏర్పాటు చేయాల్సి వుంటుంది? ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలు ఏవి అనే అంశాలను పూర్తి స్థాయి కసరత్తు తర్వాత పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

కాగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా కలెక్టర్‌, ఎస్పీ అధికార కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని సిఎం సూచించారు. ప్రజలకు రోజూ అందుబాటులో ఉండాల్సిన రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం అంతా కలెక్టరు కార్యాలయంలో కేంద్రీకృతం అయితే బాగుంటుందని తెలిపారు. విశాలమైన గదులు, కాన్ఫరెన్స్‌ మీటింగ్‌ హాల్సు నిర్మాణాలుండాలని అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్‌ లతో నమూనాలను తయారుచేయించాలని సిఎం చెప్పారు.

కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి

జిల్లా కార్యనిర్వాహక అధికారులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు తెలంగాణ అభివృద్ధ్దిలో మరింత కీలక భూమికను పోషించే సమయం ఆసన్నమైందని సిఎం కెసిఆర్‌ ఆకాంక్షించారు. ప్రజలకోసం పనిచేసే జిల్లా కలెక్టర్లకు.. పాలనకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచి మరింత బలోపేతం చేయనున్నామని సిఎం అన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లా కేంద్రాలల్లో వివిధ శాఖలకు చెందిన ప్రధాన కార్యాలయాలను ఒకే చోటకు చేర్చి కేంద్రీకృత ”స్టేట్‌ ఆప్‌ ద ఆర్ట్‌” కలెక్టరు కార్యాలయాలను నిర్మించేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లు రెవిన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు ఆర్కిటెక్టులతో మే 6న సీఎం అధికారిక నివాసంలో ఈ మేరకు సుదీర్ఘ చర్చ జరిపారు.

సమగ్ర పాలన అందాలంటే వివిధ ప్రభుత్వ విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండాలని సిఎం పునరుద్ఘాటించారు. అందుకు కలెక్టరు కార్యాలయం కేంద్రంగా ఉండాలని తెలిపారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2 లక్షల యాభై వేల చదరపు అడుగుల బహుళ అంతస్తుల సముదాయంలో కలెక్టరు కార్యాలయాలను నిర్మించాలని సిఎం నిర్ణయించారు. విశాలమైన గదులతో ఎత్తయిన పూర్వపు బంగళాలను పోలిన నిర్మాణాలను చేపట్టాలని అన్నారు. గాలి అటు ఇటు స్వేచ్ఛగా కదలాడి ఆరోగ్యకరమైన వాతావరణానికి వేదికలుగా కలెక్టర్‌ కార్యాలయాలు నిలువాలని సిఎం అన్నారు. ఇరుకిరుకు గదులల్లో కాకుండా ప్రశాంత వాతావరణంలో ఉద్యోగులు పనిచేయడం అవసరమని.. ప్రస్తుతమున్న కలెక్టరు కార్యాలయాలు నేటి అవసరాలకు తగ్గట్టుగా లేవన్నారు. రేపు నిర్మించబోయే కలెక్టరు కార్యాల యాలు భవిష్యత్తు తరాలకూ ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు.

రెవెన్యూ, విద్యా, ఉద్యోగ, సంక్షేమ, సహకార, ఆరోగ్య శాఖ తదితర నిత్యావసర శాఖలతో ప్రజలకు ప్రతి రోజూ పని ఉంటుందని సిఎం అన్నారు. వీటన్నింటిని కలెక్టరేట్‌ కేంద్రంగా ఒకేచోట నిర్మిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తమ పనులు చేసుకోవడానికి సులువవుతుందన్నారు. పోలీసు డిపార్ట్‌ మెంట్‌ కార్యాలయాలు, జిల్లా పరిషత్తు, ట్రాన్స్‌కో, ఆర్టీసీ, కోర్టులు తదితర కొన్ని కార్యాలయాలు మినహా యించి దాదాపు ముప్పై శాఖలకు చెందిన వివిధ కార్యాలయాలు కలెక్టరేట్‌ కార్యా లయ సముదాయంలోనే ఉండను న్నాయి. ఇలా చేయడం వల్ల ప్రజల విలువైన సమయం ఆదా అవడం ద్వారా పనిలో నాణ్యత పెరుగు తుందని తెలిపారు. ప్రజలతో సమా వేశాలు నిర్వహిం చేందుకు ఎక్కువ మంది కూర్చునే వీలుగా సమావేశ సభా మందిరాలు నిర్మిస్తామన్నారు.

అత్యవసర ప్రమాద సమయాల్లో కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించడానికి వీలుగా హెలీకాప్టర్లలలో ప్రయాణం చేయడానికి అనువుగా హెలీప్యాడ్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. ఒకప్పుడు హెలీకాప్టర్‌ అంటే లగ్జరీగా చూసేవారని.. అలాంటి హెలీకాప్టర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాలకు వినియోగిస్తుందని తెలిపారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌ను విశాలమైన ప్రాంతంలో నిర్మించాలని సూచించారు. పచ్చటి గార్డెన్లను తలపించే విధంగా పూల మొక్కలతో కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణం నిండిపోవాలన్నారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు పంచాయితీరాజ్‌ కార్యాలయాలను మొక్కుబడిగా వాడే విధానం నుంచి బయటపడలన్నారు.

నూతనంగా నిర్మించబోయే కలెక్టర్‌ కార్యాలయాలను పూర్తి స్థాయిలో అప్టిక్‌ ఫైబర్‌ని వినియోగించాలని, అన్ని కలెక్టర్‌ కార్యా లయాలు ఒకే పోలికతో కూడిన ఆర్కిటెక్టు డిజైన్‌ ఉండాలన్నారు. వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానాన్ని కార్యాలయాల్లో అమలుపరచ లన్నారు. అవసరమున్న చోట ఇప్పుడున్న జిల్లా కేంద్రాల్లో కూడ నూతన కార్యాలయాలను నిర్మించనున్నారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపికచేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి అప్పగించారు.

Other Updates