ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్వవ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆగస్ట్ 22న సచివాలయంలో కొత్త జిల్లాల ముసాయిదాను విడుదల చేసి 30 రోజుల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సచివాలయంలో అక్టోబర్ 20న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ముసాయిదాను ప్రజల మధ్యకు వెళ్లిన తర్వాత విస్తృత చర్చ జరుగుతుందని, ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయం మేరకు మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ముసాయిదా వెలువడిన తర్వాత వచ్చిన అభిప్రాయాలపై మరోసారి చర్చించడానికి 15 రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత మరోసారి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు ఉందని, 683 జిల్లాల్లో ఒక్కో జిల్లా సగటు జనాభా 18 లక్షలుందని సీఎం చెప్పారు. కానీ తెలంగాణలో 3.6 కోట్ల జనాభా ఉంటే పది జిల్లాలున్నాయని, ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ఉన్నారని వివరించారు. జాతీయ సగటున్నా తెలంగాణ సగటు రెట్టింపుగా ఉందన్నారు. విస్తీర్ణరలో కూడా జాతీయ జిల్లా సగటు 4వేల కిలోమీటర్లుంటే, తెలంగాణ జిల్లాల సగటు విస్తీర్ణం 11వేల కిలోమీటర్లుందని వెల్లడించారు. చాలా జిల్లాల్లో మండలాలు, గ్రామాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి, పరిపాలనా సౌలభ్యానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
స్వాగతించిన రాజకీయ పక్షాలు
తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సౌకర్యంగా ఉండడం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాజకీయపక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వ ప్రతిపాదనలను దాదాపు ఆమోదించారు. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు కొన్ని సూచనలు చేయగా, వాటిని పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి కె. కేశవరావు, ఎస్. నిరంజన్ రెడ్డి (టిఆర్‌ఎస్), మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పాషా ఖాద్రి, జాఫ్రి (ఎంఐఎం), రాంచందర్ రావు, మల్లారెడ్డి (బిజెపి), ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి (టిడిపి), తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి (సిపిఎం), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి (సిపిఐ) పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ డివిజన్ మండలాలు
ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్, మావల(కొత్త), బజార్‌హత్నూరు, బేల, బోథ్, జైనథ్, తాంసీ, తలమడుగు, గుడిహత్నూర్
ఉట్నూరు ఇంద్రవెల్లి, జైనూరు, నార్నూర్, సిర్పూరు (యూ), ఉట్నూరు, ఇచ్చోడ, నేరడిగొండ
కొమురం భీం మంచిర్యాల చెన్నూరు, జైపూరు, కోటపల్లి, ల్సట్టిపేట, మంచిర్యాల,
నర్సాపూర్ (కొత్త), మందమర్రి, దండెపల్లి, జన్నారం, నస్పూర్(కొత్త)
బెల్లంపల్లి (కొత్త) కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తిర్యాణి, తాండూర్, భీమిని, దహెగాం
ఆసిఫాబాద్ ఆసిఫాబాద్, బెజ్జూరు, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన,
సిర్పూర్-టీ, రిెమెరి, వాంకిడి.
నిర్మల్ నిర్మల్ నిర్మల్, దిలావర్‌పూర్, కడెం, ఖానాపూర్,
మామడ, లక్ష్మణ్‌చాంద, సారంగపూర్.
ముథోల్-భైంసా(కొత్త) కుబీరు, కుంటాల, భైంసా, ముథోల్, లోశ్వేరం, తానూరు
కొత్తగూడెం కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు, చండ్రుగొండ,
అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట, గుండాల
భద్రాచలం భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు,
బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక
ఖమ్మం ఖమ్మం ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం,
ూసుమంచి, నేలకొండపల్లి, బోనకల్లు, చింతకాని,
ముదిగొండ, కొణిజెర్ల, సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం(కొత్త)
వైరా(కొత్త) సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వైరా,
ఏన్కూరు, జూలూరుపాడు, మధిర, ఎర్రుపాలెం
కరీంనగర్ కరీంనగర్ కరీంనగర్, కొత్తపల్లి (కొత్త), కరీంనగర్ రూరల్ (కొత్త),
మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం,
వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, చొప్పదండి,
గంగాధర, రామడుగు
సిరిసిల్ల సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ,
చందుర్తి, కోనారావుపేట
జగిత్యాల జగిత్యాల జగిత్యాల, రాయికల్, సారంగపూర్, ధర్మపురి, పెగడపల్లి,
గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూరు
కోరుట్ల (కొత్త) కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్
పెద్దపల్లి పెద్దపల్లి పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, జాలపల్లి, ఎలిగేడు, ధర్మారం,
యు-పెద్దకాల్వల(కొత్త),
మంథని అంతర్‌గాం(కొత్త), శ్రీరాంపూర్, కమాన్‌పూర్,
మంథని, ముత్తారం, రామగుండం
రంగారెడ్డి వికారాబాద్ వికారాబాద్, ధారూరు, పెద్దేముల, తాండూరు, యాలాల,
బషీరాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం,
(వికారాబాద్) చేవెళ్ల చేవెళ్ల, నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, పరిగి, పూడూరు, దోమ,
కుల్కచర్ల, గండీడ్, షాబాద్, మోయినాబాద్
మల్కాజ్‌గిరి మల్కాజ్‌గిరి మల్కాజ్‌గిరి, మేడ్చల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, దుండిగల్(కొత్త)
కీసర(కొత్త) శామీర్‌పేట, కీసర, ఘట్‌సేర్, ఉప్పల్, జవహర్‌నగర్(కొత్త)
శంషాబాద్ రాజేంద్రనగర్ ఫరూఖ్‌నగర్, కొత్తూరు, శేంపేట, కొందుర్గు,
శంషాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గండిపేట (కొత్త)
ఇబ్రహీంపట్నం మంచాల, యాచారం, మహేశ్వరం, సరూర్‌నగర్, కందుూరు,
ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ (కొత్త), బాలాపూరు(కొత్త)
నల్లగొండ నల్లగొండ చండూరు, చిట్యాల, కనగల్లు, కట్టంగూరు, మునుగోడు,
నకిరేకల్, నల్లగొండ, నారాయణపురం,
నార్కెట్‌పల్లి, తిప్పర్తి, తేేపల్లి, గట్టుప్పల (కొత్త),శాలిగౌరారం.
మిర్యాలగూడ దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల(హలియా),
నిడమనూర్, పెద్దవూర, త్రిపురారం,
మాడుగులపల్లి(కొత్త), తిరుమలగిరి(సాగర్)(కొత్త)
దేవరకొండ చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి,
గుర్రంపోడు, కొండమల్లేపల్లి(కొత్త), మర్రిగూడ, నాంపల్లి, పీఏ పల్లి
సూర్యాపేట సూర్యాపేట ఆత్మూరు (ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం, నాగారం (కొత్త),
నూతన్‌కల్, పెన్‌పహాడ్, సూర్యాపేట,
తిరుమలగిరి, నేరెడుచర్ల, గరిడేపల్లి, తుంగతుర్తి
కోదాడ (కొత్త) చిల్కూరు, హుజూర్‌నగర్, కోదాడ, మట్టపల్లి, మేళ్లచెరువు,
నడిగూడెం, మోతె, మునగాల, అనంతగిరి (కొత్త)
యాదాద్రి జనగాం ఆలేరు, గుండాల, రాజపేట, జనగాం, లింగాల ఘణపురం,
దేవరుప్పల, బచ్చన్నపేట
భువనగిరి మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్,
బొమ్మల రామారం, ఆత్మూరు (ఎం),
భూదాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్,
మోటకొండూరు (కొత్త), అడ్డగూడూరు (కొత్త)
మెదక్ మెదక్ మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట (ఆర్), శంకరంపేట్ (ఎ), టేక్మాల్, రేగోడ్, కొల్చారం, అల్లాదుర్గం
తుప్రాన్ (కొత్త) కౌడిపల్లి, చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి, తూప్రాన్
నారాయణఖేడ్ (కొత్త) కల్హేర్, కంగ్టి, నారాయణ్‌ఖేడ్, సిర్గాపూర్(కొత్త), మనూర్.
సంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు,
అమీన్‌పూర్(కొత్త), రామచంద్రాపురం, పుల్కల్,
జిన్నారం, గుమ్మడిదల(కొత్త), హత్నూర, ఆందోల్, నర్సాపూర్
జహీరాబాద్(కొత్త) మునిపల్లి, కోహిర్, రాయికోడ్, ఝరాసంఘం, న్యాల్‌కల్, జహీరాబాద్
సిద్దిపేట(కొత్త) సిద్దిపేట దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, నంగునూరు, చిన్నకోడూరు,
సిద్దిపేట (అర్బన్), సిద్దిపేట (రూరల్),
కోహెడ, హుస్నాబాద్, ముస్తాబాద్, ఇల్లంతకుంట
గజ్వేల్ (కొత్త) మద్దూరు, చేర్యాల, దౌల్తాబాద్, గజ్వేల్, జగ్‌దేవ్‌పూర్,
కొండపాక, ములుగు, వర్గల్
నిజామాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ నార్త్(కొత్త), ముగ్పల్ (కొత్త),
ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి (కొత్త),
జక్రాన్‌పల్లి, సిరికొండ, నవీపేట,
ఆర్మూర్ ఆర్మూర్, ఆలూరు (కొత్త), బాల్కొండ, మెండోరా (కొత్త),
కాంపల్లి, మ్లాూర్, వేల్పూరు, భీంగల్, నందిపేట
బోధన్ బోధన్, రెంజల్, యెడపల్లి, కోటగిరి, వర్ని, రుద్రూర్ (కొత్త)
కామారెడ్డి కామారెడ్డి బ్నిూరు, రాజంపేట (కొత్త), దోమకొండ, గాంధారి,
కామారెడ్డి, లింగపేట, మాచారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి,
రామారెడ్డి (కొత్త), ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట
బాన్సువాడ (కొత్త) బాన్సువాడ, బిర్కూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ భూత్పూరు, దేవరకద్ర, హన్వాడ, కోయిల్‌కొండ,
మహబూబ్‌నగర్ (అర్బన్), మహబూబ్‌నగర్ (రూరల్-కొత్త),
నవాబ్‌పేట, మరికల్ (కొత్త), జడ్చర్ల, బాలానగర్, అడ్డాకుల, మిడ్జిల్, రాజపూర్(కొత్త)
నారాయణ్‌పేట బొమ్మరాసుపేట్, దామరగిద్ద, ధన్వాడ, దౌల్తాబాద్, కొడంగల్,
కోస్గి, మద్దూర్, మాగనూర్, మక్తల్,
నారాయణ్‌పేట, నర్వ, ఊట్కూరు
నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ బిజినేపల్లి, కొల్లాపూర్, కోడేరు, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, తెల్కపల్లి, తిమ్మాజిపేట,
తాడూరు, ఆమనగల్లు, కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ,
అచ్చంపేట అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూరు, లింగాల, పదర (కొత్త), ఉప్పునూతల, వంగూరు
వనపర్తి వనపర్తి ఆత్మూరు, వీపనగండ్ల, పానగల్, ఘన్‌పూర్, గోపాల్‌పేట్,
కొత్తకోట, అమరచింత(కొత్త), పెబ్బేరు,
పెద్దమందడి, వనపర్తి, సీసీ కుంట
గద్వాల అలంపూర్, ధారూరు, గద్వాల, గట్టు, ఐజా, ఇటిక్యాల, మల్దకల్,
మన్‌పహాడ్, నందిన్నె (కొత్త), వడ్డెపల్లి
వరంగల్ నర్సంపేట నెక్కొండ, చెన్నరావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి, నర్సంపేట
వరంగల్ ఆత్మూరు, గీసుకొండ, పర్వతగిరి, సంగం, వరంగల్,
ఖిలా వరంగల్ (కొత్త), హసన్‌పర్తి, ఐనవోలు (కొత్త),
వర్ధన్నపేట, శాయంపేట, పరకాల
హన్మకొండ హుజూరాబాద్ భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్,
జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట(కొత్త)
హన్మకొండ (కొత్త) చిల్పూరు(కొత్త), వేలేరు (కొత్త), రాయపర్తి, రఘునాథపల్లి,
ధర్మసాగర్, స్టేషన్ ఘణపూర్,
హన్మకొండ, ఖాజీపేట(కొత్త), జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, నర్మెట్ట
జయశంకర్‌జిల్లా భూపాలపల్లి(కొత్త) కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్‌రావు,
భూపాల్‌పల్లి, చిట్యాల, (కొత్త) ఘణపూర్(ములుగు), రేగొండ, మొగుళ్లపల్లి
ములుగు ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట,
ములుగు, తాడ్వాయి, వెంకటాపూరం
మహబూబాబాద్ మహబూబాబాద్ బయ్యారం, గార్ల, డోర్నకల్, సేముద్రం, కురవి,
మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు,
తొర్రూరు, గూడూరు, కొత్తగూడెం