తెంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా క్రీడల్లో అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో కన్ను పండుగగా జరిగిన క్రీడా పురస్కారా ప్రదాన కార్యక్రమంలో సానియా మీర్జాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందజేశారు.లియాండర్ పేస్ తర్వాత ఖేల్ రత్న పురస్కారం అందుకున్న తొలి హైదరాబాదీ, రెండో టెన్నిస్ ప్లేయర్‌గా సానియామిర్జా రికార్డు సృష్టించింది.ఈ విశిష్ట పురస్కారానికి ముందు మిగతా క్రీడాపురస్కారాలైన ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్‌చంద్ పురస్కారాను ఎంపికైన క్రీడాకారుకు రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈసారి ఖేల్ రత్న పురస్కారంతో సహా మొత్తంగా ఐదు క్రీడాపురస్కారాు రాష్ట్రానికి దక్కడం విశేషం. హైదరాబాద్ నుంచి కిడాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), అనూప్ కుమార్ (రోర్ స్కేటింగ్)ు అర్జునకు ఎంపికవ్వగా, డేవిస్‌కప్ మాజీ కెప్టెన్ శివప్రకాశ్ మిశ్రా ధ్యాన్‌చంద్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఛైైర్మన్ కే సాయిబాబా రాష్ట్రీయ ప్రోత్సాహన్ ఖేల్ సమ్మాన్ అవార్డును స్వీకరించారు.
సానియాకు మరో గ్రాండ్‌స్లామ్ :
జోరుమీదున్న సానియాకు మరో గ్రాండ్‌స్లామ్ సలామ్ అన్నది. హింగిస్ జతగా నిన్న లియాండర్ టైటిల్ కొడితే.. ఇప్పుడు సానియా వంతు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సానియా-హింగిస్ జంట యుఎస్ ఓపెన్ మహిళ డబుల్స్ ఫైనల్లో గెలిచి వరుసగా రెండో మేజర్ టైటిల్‌ను చేజిక్కించుకుంది.
అద్భుత ఫామ్‌ను కొనసాగించిన ఈ టాప్ సీడ్ ద్వయం యుఎస్ ఓపెన్ ఫైనల్లో చెరేగిపోయింది. చక్కని సమన్వయంతో కదిలిన ఈ జోడీ టైటిల్ పోరులో 6-3, 6-3తో డలెక్వా (ఆస్ట్రేలియా), ష్వెదోవా (కజకిస్థాన్)ను అవోకగా మట్టికరిపించింది. కేవం 70 నిమిషాల్లో మ్యాచ్ ముగియడం విశేషం. సానియాకు కెరీర్‌లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. హింగిస్‌కు 20వది. మార్టినా హింగిస్ వ్ల భారత్‌కు దక్కిన గ్రాండ్‌స్లామ్ సంఖ్య ఆరు కావడం విశేషం. ఈ ఏడాది చివరి రెండు గ్రాండ్‌స్లామ్‌ల్లోనూ భారత క్రీడాకారు భాగస్వామ్యంలో మహిళ, మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు సాధించింది హింగిస్.
గ్వాంగ్జూ ఓపెన్ చాంపియన్ సానియా ` మార్టినా :
సానియా మిర్జా ` మార్టినా హంగీస్ జోడి చైనా దేశ గ్వాంగ్జూ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచింది. 26 సెప్టెంబర్‌న జరిగిన ఫైనల్‌లో షిలిన్‌జూ ` జియోడి యు చైనా జోడిపై 6`3, 6`1 తేడాపై విజయం సాధించింది. దీంతో ఈ ఏడాది సానియా ` హంగీస్ జోడి సాధించిన టైటిళ్ల సంఖ్య ఆరు కాగా, సానియాకు ఏడవ టైటిల్.
హోం
»