magaనిర్మాణమౌతున్న యాదాద్రి ప్రతిమలుపు ఫొటో నిక్షిప్తం…

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న మహాకట్టడం, తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మందిర నిర్మాణం. ఇది మొదలైన రోజు నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రతి మలుపు ఓ ఛాయా చిత్రంగా మలిచారు. ఇందుకు పూనుకున్నది ఎవరో కాదు సీనియర్‌ ఫొటో జర్నలిస్టు కె. రమేశ్‌. గత 25 ఏండ్లుగా ఒక ప్రముఖ దిన పత్రికలో పనిచేసిన కె. రమేశ్‌ ఫీల్డ్‌ ఫోటోగ్రఫీలో నిపుణుడు. ఖమ్మం జిల్లాకు చెందినవాడు. తాను స్వయంగా శిల్పకళలో తర్ఫీదు పొందినవాడు, కొన్నా ళ్లు దేవాలయ నిర్మాణాలలో కూడ పాల్గొన్నాడు. దీనితో ఆధ్యాత్మికతతో పాటు కళాత్మకత, ప్రాచీన భారతీయ పరంపర, విలువల మేళవింపుతో రూపొందించడానికి తదేక దీక్షతో పనిచేస్తున్న మహా స్థపతి సుందరరాజన్‌, సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయిల మద్దతు, చేయూత ఆయనకు లభించింది. ఈ క్రమంలో నిర్మాణం మొదలైన నాటినుంచి ఈ చరిత్రాత్మక కట్టడం నిక్షిప్తం చేసుకుంటున్న ప్రతిమలుపును తన కెమెరాలో బంధిస్తూ భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రితో పాటు ఇందుకు సంబంధించి పనులు జరుగుతున్న హైదరాబాద్‌ సమీపంలోని కోహెడ గ్రామం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మార్టూరు, ఆళ్లగడ్డ, కోటప్పకొండ, కమ్మవారి పల్లె వంటి ప్రాంతాలకు వెళ్ళారు. మొత్తానికి చారిత్రిక, కళాత్మక దృష్టితో కె.రమేశ్‌ చేస్తున్న కృషి కొత్త రాష్ట్రమైన తెలంగాణ సాంస్కృతిక రంగంలో విశిష్టమైంది.

(చిత్రమాలిక.. సెంటర్‌స్ప్రెడ్‌లో)

Other Updates