ఇప్పటి వరకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందని, ఇప్పుడు ఆ అభివృద్ధిని అమలు చేసి చూపించే సమయం ఆసన్నమైందని, గజ్వేల్‌కు మహర్దశ పట్టబోతోందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు. నవంబరు 30న మెదక్ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తమ ఫాంహౌజ్‌లో ఏర్పాటు చేసిన నియోజవకర్గ అభివృద్ధి సమీక్షా సమావేశంలో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, ఎంపిపిలను ఉద్ధేశించి మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
రాష్ట్ర యంత్రాంగాన్నంతా గజ్వేల్‌కు తీసుకువచ్చి ఇక్కడే నిర్ణయాలు జరిగేలా చూస్తానని, తాను ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేసి చూపుతున్నానన్నారు. విద్యుత్, పంచాయతీరాజ్, నీటి పారుదల, వ్యవసాయం, రోడ్లు, భవనాలు తదితర శాఖల సమీక్షను నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించి అధికారులు చెబుతున్న అభివృద్ధిపనులు, వారు చెబుతున్న గణాంకాలు సరైనవేనా, కాదా అనే విషయాన్ని అక్కడే ఉన్న సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఏ సమస్య చెప్పినా అధికారులకు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తానే దిశానిర్దేశం చేశారు. ముందుగా విద్యుత్ సమస్యపై సమగ్ర చర్చ జరిగింది. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఒక రోజు పవర్ డేగా ప్రకటించి జిల్లాలోని అందరు అధికారులను కూడా ఇక్కడికే పిలిచి ప్రతి గ్రామంలోను విద్యుత్ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోజు తాను కూడా ఏదో ఒక గ్రామంలో పనులు చేస్తానని ప్రకటించారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను బిగించడం, వంగిపోయిన విద్యుత్ స్థంబాలను పునరుద్దరించడం చేయాలన్నారు. కొత్తగా మూడు 132 కేవీ సబ్‌స్టేషన్లను మంజూరీ చేశారు. ఈ పనిని ఒక ఉద్యమంలాగా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ. 10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తారురోడ్డు సౌకర్యం ఉందని, ఎక్కడైనా మెటల్ రోడ్డు ఉంటే దాన్ని తారు రోడ్డుగా మారుస్తామని అధికారులు చెప్పడంతో రోడ్లన్నీ బాగుచేయాలని, కొత్తగా నిర్మించే చోట నిర్మించాలని, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ. 411 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
కొండపోచమ్మను సందర్శిస్తా
తెలంగాణాలో ప్రసిద్ది గాంచిన కొండపోచమ్మ దేవస్థానానికి రోడ్డు బాగాలేదని, పూర్తిగా అధ్వాన్నంగా మారడంతో భక్తులు రాలేకపోతు న్నారని దేవస్థానం మాజీ చైర్మన్ మేదిని లక్ష్మి నర్సింహ్మారెడ్డి మొర పెట్టుకోగా తానే స్వయంగా కొండ పోచమ్మ దేవస్థానాన్ని సందర్శి స్తానని, అక్కడి అన్ని సమస్యలు పరి ష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
గజ్వేల్ పట్టణంలో పాదయాత్ర
గజ్వేల్ పట్టణానికి సంబంధించిన పలు సమస్యలను మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ప్రస్థావించడానికి ప్రయత్నించగా ఆ సమస్యలు ఇక్కడ వద్దని, తాను స్వయంగా గజ్వేల్ పట్టణంలో పాదయాత్ర నిర్వహిస్తానని అన్నారు. అప్పుడు గజ్వేల్ పట్టణ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా గజ్వేల్ రింగ్‌రోడ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నాలుగు లైన్ల రోడ్డు, బస్‌స్టాండ్ అభివృద్ధి తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్టాండ్ నిర్మించడం లేదని, ఆ స్థలాన్ని మరో అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగించుకోనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రజ్ఞాపూర్ డిపో సమీపంలోని బస్టాండ్‌ను అభివృద్ధి పరచాలని మంత్రి హరీష్‌రావు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తూఫ్రాన్ బస్టాండ్‌లో సిమెంట్ చేయడం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇతర బస్టాండ్‌లలో కూడా సౌకర్యాలు మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గజ్వేల్ నుంచి షిరిడి, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే
ప్రతి గ్రామపంచాయతీకి రూ. 25 లక్షలు
ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మదిరె గ్రామాల కోసం గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున విడుదల చేస్తామని తెలిపారు. నియోజక వర్గంలోని లక్షా నలభైవేల ఎకరాలకు ప్రాణహిత`చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. వర్గల్ మండలం పాములపర్తి గ్రామం వద్ద 20 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను నిర్మించి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని తెలిపారు. చెరువుల మరమ్మత్తు గురించి మాట్లాడుతూ నియోజకవర్గంలో 1,212 చెరువులు ఉండగా అందులో 604 చెరువులకు ప్రస్థుతం మరమ్మతులకు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికోసం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీత వల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుందని, భూమిలో నీటి నిలువశాతం పెరుగుతుందని, భూములు సారవంతమవు తాయని పేర్కొన్నారు. ఇలాంటి చెరువుల పూడికతీతలో రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆరు ఎక్స్‌ప్రెస్ బస్సులను గజ్వేల్`ప్రజ్ఞాపూర్ డిపోకు ఇప్పించగలనని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్దం బస్సులను గ్రామాలకు నడపాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్ నిర్మాణం చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలోను స్మశానవాటిక నిర్మించాలని దీనికి వైకుంఠదామం అని పేరు పెట్టాలని సూచించారు.
మొక్కలు నాటడానికి అత్యంత ప్రాధాన్యత
గ్రామాలలో మొక్కలు నాటడానికి అత్యంత ప్రాధాన్య మివ్వా లని సూచించారు. మొక్కలు నాటడంతో అన్ని గ్రామపంచా యతీల కంటే ముందు నిలిచిన గ్రామ పంచాయతీకి తాను రూ. 10 లక్షలు అదనపు నిధులు కేటాయిస్తానని తెలిపారు. పచ్చదనం ఉంటేనే వర్షాలు కురుస్తాయన్నారు. అందుకే తెలంగా ణాకు మళ్ళీ వర్షాలు రప్పించాలంటే మొక్కలు నాటాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలతో 240 కోట్ల మొక్క లు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ లెక్కన ప్రతి గ్రామంలో యేడాదికి 40 వేల మొక్కలు నాటాలన్నారు. గజ్వేల్‌కు అటవీ కళాశాల, హార్టీకల్చర్ యునివర్సిటీ మంజూరైనట్లు తెలిపారు. మొత్తంగా సమీక్షా సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా కొనసా గింది. సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాహూల్ బొజ్జా, మెదక్ ఎంపి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.