tsmagazineతెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని ఎం.ఎన్‌.జే. క్యాన్సర్‌ దవాఖాన గిన్నిస్‌ రికార్డు, ప్రపంచ రికార్డు సాధించింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకకుంట్ల చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. గిన్నిస్‌, హైరేంజ్‌ వరల్డ్‌ రికార్డులు సాధించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.

క్యాన్సర్‌ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎం.ఎన్‌.జే. క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దవాఖాన వైద్య బృందం 45 నిమిషాల పాటు అవగాహన కల్పించారు. హాజరైన వారిలో 20 ఏండ్లకు పై బడిన పురుషులు 487 మంది పాల్గొన్నారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. అత్యధికమంది పురుషులకు ఒకేరోజు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ పై అవగాహన కల్పించిన కార్యక్రమంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, హైరేంజ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సీ.ఎం. కేసీఆర్‌ నేతృత్వంలో సర్కారు దవాఖానలు బలోపేతం అవుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

tsmagazine
tsmagazine

Other Updates