రమేశ్ కొత్త ఉద్యోగ్నంలో చేరాడు. చాలా ఉత్సాహంగా ప్రతిరోజూ పనికి వస్తున్నాడు. కానీ క్రమంగా పనిపట్ల ఉత్సాహం తగ్గి, పనికి పోవాలంటే తీవ్రమైన అనాసక్తి ప్రవేశించింది. పనికి వెళ్ళివచ్చిన తర్వాత చాలా నీరసంగా ఎప్పుడు ఆదివారం వస్తుందా! అని ఎదురుచూసేవాడు. కొన్ని రోజుల తర్వాత పని వత్తిడిలో అనారోగ్యం పాలయ్యాడు.
..ఇదంతా గమనిస్తున్న వాళ్ళ అమ్మ రమేష్ ప్రక్కకు కూర్చుని తనతో మాట్లాడింది. ఏం రమేష్ పనికి ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన నువ్వు! ఇప్పుడు ఇంత డీలా! పడిపోయావ్ ఎందుకు? ఏం! జరిగింది. అప్పుడు రమేష్! అమ్మ! నాకు తీవ్రమైన ఒత్తిడి వస్తుంది.అంత ఒత్తిడిని భరించలేకపోతున్నాను. నాలో నాకు సంఘర్షణ పెరుగుతుంది. ఎందుకింత వత్తిడి అనుభవించాలి. పని వదిలివేస్తే. అన్నీ పోతాయి కదా! అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ! నిజమే! కానీ ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే. అప్పుడేం చేస్తావ్! మళ్ళీ వదిలెస్తావ్! అంతేకదా! ఇలా! ప్రతీసారి వదిలేస్తూ పోతే. నువ్వు ఏ ఉద్యోగం చేయలేవు కాబట్టి! సమస్య పరిష్కారం వదిలెయ్యడం కాదు. అది ఎక్కడినుండి వస్తుందో గమనించి… దానిని ఎలా ఎదుర్కోవాలో నైపుణ్యాలు నేర్చుకొని.. ఎదుర్కొని విజయవంతంగా దానినుండి బయటకువచ్చి మనం చెయాల్సిన పనిని ఉత్సాహంగా చెయ్యాలి. అది మనిషి చెయ్యాల్సిన పని అని చెప్పి.. రమేష్ ఒకసారి కిచెన్‌లోకి రా! అని.. రమేష్‌ను కిచెన్‌లో తీసుకెళ్ళింది.
పోయ్యిలమీద.. 3 స్టీల్ గిన్నెలను నీళ్ళతో పెట్టి… ఒక గిన్నెలో కోడిగ్రుడ్డు, రెండవ గిన్నెలో క్యాంట్ మూడో గిన్నెలో కాఫీ గింజలు వేసింది. ఈ ముడ గిన్నెలను 30 ని||ల మరణించిన తర్వాత స్టౌ మంట ఆర్పివేసి రమేష్‌ను తను గమనించిన విషయాన్ని చెప్పమన్నది. రమేష్.. ఇందులో వింత ఏముంది అమ్మ! అన్ని ఉడకుతాయి.. అంతేకదా! అన్నాడు.. అప్పుడు అమ్మ! నవ్వుతూ మొదటిగిన్నెలో గ్రుడ్డు ముందు స్థితి. గుడ్డులోపల సొన అంత ద్రవరూపంలో వుంటుంది. పైన మాత్రం పెంకు గడ్డగా వుంటుంది. ఉడికిన తర్వాత లోపలిది గట్టి పడుతోంది. పెంకు అలాగే వుంటుంది. రెండవ గిన్నెలో క్యారెట్.. చూడడానికి మొదట వున్నట్టుగానె కనపడుతుంది. కానీ మొత్తం ఉడికి మెత్తగా తయారౌతుంది దాని కటువు తనంపోయి, మెత్తదనంగా మారుతుంది. మృదువుగా మారిపోతుంది… విరిస్తే తొందరగా ఏ శబ్దం లేకుండా విరిగిపోతుంది. మొత్తానికి భౌతిక పరిస్థితి మారిపోతుంది… ఇలా! మూడో గిన్నెలోకి కాఫీగింజలు… ఒక్కసారి గిన్నెలోని తొంగిచూడు ఏమికన్పిస్తుందో చెప్పు… ఏముంది అమ్మ! గిన్నెలోని నీళ్ళు అన్నీ కాఫీ కలర్‌లోకి మారాయి. కాఫీ డికాక్షన్‌గా తయారైంది. కమ్మని కాఫీ వాసన కూడా వస్తుంది… ఇంతకుముందు నీళ్ళు, కాఫీ గింజలు వేరువేరుగా కనపడినప్పుడు రెండు కలిసిపోయి… కొత్త వాసన వస్తుంది.. అన్నాడు. అప్పుడు వాళ్ల అమ్మా! సరిగ్గా చెప్పావ్… ఇప్పుడు మనం వీటి మధ్య వ్యత్యాసాలను చూద్దాం.
గుడ్డుకు, క్యారెట్‌కు కాఫీ గింజలకు… సమానమైన పరిస్థితులను కల్గించాము.. అంటే నీటిలోనే వేశాము. అవునా? సమానమైన వాతావరణాన్నే కలిగించాము… అంటే… గిన్నె, ఉష్ణోగ్రతలాంటివి… అన్నింటిని సమానమైన వేడి దగ్గరే, సమానమైన సమయంలోనే కల్గించాము! అయినా మూడింటిలో.. ఇంత తేడా ఎందుకు వుంది. గ్రుడ్డు, క్యారెట్‌లో చూడటానికి రెండు పూర్వస్థితిని కలిగివున్నాయి కానీ గుడ్డులోపల అంతా గట్టిపడింది. కానీ క్యారెట్ గట్టిగా వున్నది. మెత్తగా మారింది. గమ్మత్తుగా లేదు.
కానీ కాఫీది ఇంకొక పరిస్థితి. అది తనను మార్చుకుంటూ పరిస్థితులకు కూడా తన లక్షణాన్ని అంటించేసింది. నీరులో మమేకమై.. నీటిని కూడా కాఫీగా మార్చేసింది.
ఇప్పుడు దీంట్లో పాలు కలుపుకొని కాఫీ త్రాగుతాము… అమ్మ వేడి పాలుపోసి కాఫీ తయారు చేసి రమేష్‌కు ఇచ్చింది… రమేష్ ఆలోచిస్తూ కాఫీ పూర్తి చేశాడు. ఇంతకూ నాకు ఏమి చెప్పదలచుకున్నావు అమ్మ! అని అడిగాడు…రమేశ్. అప్పుడు వాళ్ల అమ్మ చూడు రమేష్… జీవితంలో అందరికీ ఒకే రకమైన ఇబ్బందులు వస్తాయి.. మనం! వాటిని స్వీకరించడంలో.. ఎలా! వుండాలనేదే మన జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. నీలాంటి మిత్రులు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొని వుంటారు. అయితే వాళ్ళు ఎలా తీసుకున్నారు గమనించడం ఒక ప్రత్యేకత… మనం ఎలా? వుండాలనుకుంటున్నామో అర్థం చేసుకోవాలి. గుడ్డులాగానా, క్యారెట్‌లాగానా… అందరికీ పనికి వచ్చే కాఫీలాగానా! అనేది మనమే నిర్ణయించుకోవాలి.
రమేష్! కిచెన్‌లో ఇంత పెద్ద సూత్రం దాగివుందా!…పెద్దపెద్ద ఉద్యమాలు కూడా… ‘కాఫీ’ మంత్రం లాగానే… తను వేడికి… ఉడుకుతూ చుట్టూరా ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే… తన లక్షణాలను కూడా ప్రతి అణువుకూ కలిగించడమే ఆ పరిణామం. అంత ఉపయోగకారిగా మార్చుకోవడం ఓ గొప్ప పాఠం. రమేష్! మొహం ఆనందంతో వెలిగింది. సమస్య వస్తే పారిపోకుండా పరిష్కారం దిశగా ప్రయత్నించడం, వత్తిడి పెంచుతున్న పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం అవసరం. రమేష్‌కు మాత్రం గుడ్డులాగా, క్యారెట్‌లా కాదు కాఫీ గింజల్లా మారడానికి ప్రయత్నిస్తే ఫలితం అమోఘంగా ఉంటుందనిపించింది. ఇప్పుడు ఒత్తిడి ఒక వరంలాగా ఒక అద్భుతమైన పరిస్థితులలో తనను కొత్తగా మార్చే ఆలోచనలాగా అనిపించింది. డియర్ ఫ్రెండ్స్ మీరూ ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్…