గురుకుల విద్యాలయాల్లో ఏం జరుగుతున్నది. అక్కడ ఏం చేస్తున్నారు. అవి ఎట్లాంటి విజయాలు సాధిస్తున్నాయనే విషయాల గురించి రోజూ ఏదో రూపంలో చర్చ జరుగుతూనే ఉన్నది. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాలయాల సొసైటీ నేడు దేశంలోనే ఆదర్శంగాకోవాల్సిన సంస్థగా మారింది. అలా మార్చుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏరడ్పక ముందు ఆతర్వాత జరిగిన మార్పులు మన రాష్ట్రం గర్వించుకునేలా చేసింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం గురుకుల విద్యాలయాలపై దృష్టి పెట్టింది. దాని నుండి సమర్థవంతమై మఫలితాలు రాబట్టింది. నాడి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే కనీ వినీ ఎరుగు ని రీతిలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నది. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే గురుకుల విద్యాయల్లో జరుగుతున్న విద్యాబోధన. సంస్థ సాధిస్తున్న మంచి ఫలితాల గురించి ప్రస్తావించారు. ఈ యేడాది జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఆరేళ్లు పూర్తవుతుంది. ఈసందర్భంగా తెలంగాణ గురుకులాలు సాధించిన విషయాలు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరు గురించిన వ్యాసం ఇది.
గురుకుల పాఠశాలు సాధించిన మూడు విషయాలు:
1.తాము ఎవ్వరికీ తక్కువ కాదనే భావనను పెంచాయి.
2.ఇంగ్లీషు మాద్యమంలోనూ రికార్డులు బద్దలు కొడ్తామని నిరూపించాయి.
3.బయటి బయటి చదువు నేర్పడం
గతంలో గురుకుల విద్యాలయాల బోధన బయటి స్కూళ్ల కంటే కాస్త భిన్నంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ల కంటే భిన్నంగా గురుకులాల విద్యాలయాల విద్యా విదానం ఉంది. పిల్లలకు నాణ్యమైన తిండితో పాటు వారికి పూర్తి రక్షణ కల్పిచండంలో ప్రభుత్వం అభినందించ దగిన ప్రయత్నం చేస్తున్నది. అంతే కాదు గురుకుల సొసైటీ కార్యదర్శిగా సమర్థవంతమైన అధికారిని నియమించడం వల్ల ప్రభుత్వ పని మరింత సులువు అయింది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఆధునిక కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ప్రయివేటు బడుల్లోనే కాదు… నేడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా లేని సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని నామునా స్కూళ్లుకూడా ఉన్నాయి. గౌలి దొడ్ది. మహేంద్రహిల్స్ వంటివి. కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చదువు ఒక్కటే కాదు. బడి బయట బతికేందుకు దారీ చూపిస్తున్నారు.
పిల్లలకు, ఉపాధ్యాయులకు అనుబంధం బలపడేందుకూ సరి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతీయేటా వందల మంది విద్యార్థులు సంగీతం, సాహిత్యం, ఆటలు, పాటలు, మాటలు, కోడింగ్, డీ కోడింగ్ వంటి వాటిల్లో శిక్షణ పొందుతున్నారు. ఇలాంటివి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో నేర్పడం అరుదైన విషయమే. ఈ సొసైటీకి చెందిన విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత గురుకుల విద్యాలయాల్లో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి అర్థం అయింది. ఆ తర్వాత ప్రపంచ రికార్డులు క్రియేట్ చేయడంలో ఈ విద్యార్థులతో పోటీ పడే వారు దేశ వ్యాప్తంగానే లేకుండా పోయారు. 2014 నుండి ఇప్పటి వరకు పదో తరగతి ఫలితాల్లో ఈ సంస్థలు సరి కొత్త రికార్డులు నెల కొల్పుతున్నాయి. ప్రతీయేటా 80 శాతం వరకు ఫలితాలు సాధిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి మొత్తం ఫలితాలతో పోల్చుకుంటే గురుకుల సొసైటీల పాస్ శాతం 95 వరకు ఉంది. ఇంటర్మీడియట్ లో 2014 నుండి ఇప్పటి వరకు ప్రతీయేటా 80 శాతం వరకు ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఉత్తీర్ణత 65శాతం వరకు ఉంటే గురుకుల విద్యాలయాల్లో 80శాతానికి పైగా ఉంది.
కొత్తగా ఎస్సీల కోసం 104 కొత్త గురుకుల విద్యాలయాలు. ఎస్టీల కోసం 53 ప్రారంభించారు. ఇందులో 30 డిగ్రీ కాలేజీ అమ్మాయిల కోసం. 17 ఎస్టీ అమ్మాయిల కోసం ప్రారంభించారు. కొత్త పాత అన్ని కలుపుకుని జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఐఐటి, ట్రీపుల్ ఐటి, నీటి. ఐఐఐఎంస్. ఎంబీబీఎస్ లలో 2014 నుండి ఇప్పటి వరకు 201 మంది విద్యార్థులు అర్హత సాధించారు.గురుకుల విద్యాలయ సంస్థల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టిన తర్వాత విద్యార్థుల్లో మానసిక స్థయిర్యం పెరిగింది. అంతే కాదు పోటీ ప్రపంచంతో తామూపోటీ పడ్తామనే బలమైన భావన కూడా వారిలో వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుతైమన నిర్ణయాల్లో గురుకులాల్లో మార్పులు. వాటికి బడ్జెట్ కేటాయింపులు. సమర్థవంతమైన అధికారి చేత నడిపించడం వంటివి బాగా కల్సి వచ్చాయి. ఈ స్కూళ్లు సాధించిన విజయాల గురించి తెలుసుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాధికారులు. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యాధికారులు గురుకుల విద్యాలయాలను సందర్శించారు. అక్కడ అమలు చేస్తున్న విద్యా విదానం. అక్కడి అమలు అవుతున్న అన్ని విషయాలను జాతీయ స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. మన రాష్ట్రాకే కాదు దేశానికే గురుకుల విద్యాలయాలు సగర్వంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ విద్య సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది కూడా గురుకుల విద్యాలయాలే. సమర్థవంతమైన నిర్వహణ. చేయూతనిచ్చే ప్రభుత్వం ఉంటే విజయాలు సాధించడం కష్టం కాదని ఈ గురుకులాలే నిరూపిస్తున్నాయి.
జి. బుచ్చన్న