సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ అందమైన కల. ఎందరో నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు నేనున్నాను అంటూ నిలబడ్డ మన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఓ వరం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు.

ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు.

పగలు పనికి పోయినా రాత్రి మనది అనే ఓ చిన్న గూడు ఉంటే చాలు అనుకునే నిరుపేద కుటుంబాలకు కోటి వెలుగులు పంచుతూ 560 చదరపు అడుగుల వైశాల్యంలో విశాలమైన రెండు పడకల గదులు, ఒక వంట గది, ఒక హాల్‌తో పాటు రెండు బాత్‌రూంలతో, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళని ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తోంది.

తొలివిడతగా 18,520 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ, జిహెచ్‌ఎంసి పరిధిలోనూ 2 లక్షల 80వేల 616 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ రికార్డు.

రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గృహ నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు 2,80,616 గృహాలను మంజూరీ చేసింది.

వివరాలు :

1.మంజూరీ చేయబడినవి :2,80,616

2.టెండర్లు పిలవబడినవి :2,38,926

3.టెండర్లు ఖరారు అయినవి:1,99,835

4.నిర్మాణం ఆరంభించినవి:1,79,078

5.నిర్మాణం పూర్తి అయినవి :1,23,314

(1) 100 శాతం పూర్తి అయినవి:32,008

(2) 90 శాతం పూర్తి అయినవి:91,306

6.వివిధ దశలలో నిర్మాణంలో వున్నవి :55,764

7.ప్రాజెక్టు అంచనా వ్యయం :రూ.కోట్లు 18,520

8.ఇప్పటి వరకు అయిన ఖర్చు :రూ. కోట్లు 6,141

రాష్ట్రంలో మొదలైన గృహాలలో 69 శాతం గృహాలు ఇప్పటికే పూర్తి అయినవి. ఇప్పటి వరకు రూ. 6,141 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసింది.

బిల్లుల విడుదలలో పారదర్శకత

కాంట్రాక్టర్లు బిల్లులు సమర్పించిన 15 పని దినాలలో జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు విడుదల చేయడం జరుగుతోంది. ఇందులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా బిల్లుల చెల్లింపులో జవాబుదారితనం, పారదర్శకత కోసం ”ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ మానీటరింగ్‌ సిస్టమ్‌ (ఓపిఎంఎస్‌)ను” ప్రవేశ పెట్టడం జరిగింది.

జిల్లా కలెక్టర్ల నుండి నిధుల విడుదల కోసం వచ్చిన ప్రతిపాదనలు వెంటనే పరిశీలించి రాష్ట్ర స్థాయి నుండి నిధుల విడుదల చెయ్యడం జరుగుతుంది.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళ డిజైన్‌, లే-ఔట్లలో, సృజనాత్మకత, ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు, పారదర్శకత పాటిస్తున్నందుకు ”ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఓపిఎంఎస్‌)”కు జాతీయ స్థాయిలో హడ్కో అవార్డులు దక్కించుకుంది.

కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలు

డబుల్‌ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు 1,99,835 గృహాలకు టెండర్లు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు పలు ప్రోత్సాహకాలు కల్పించడం జరుగుతోంది.

సిమెంట్‌ కంపనీలతో చర్చించి మార్కెట్‌ ధర కన్నా తక్కువకు అనగా ఒక బస్తాకు రూ. 230 చొప్పున సరఫరా చేయబడుతోంది.

గృహ నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా ఇవ్వబడుతున్నది. సీవరేజి చార్జీలు కూడా మాఫీ చేయబడుతోంది.

గృహ నిర్మాణానికి వినియోగించే స్టీల్‌కు మార్కెట్‌ ధరను అనుసరించి అంచనా ధరపై వ్యత్యాసాన్ని అదనంగా చెల్లిస్తున్నారు.

టెండర్ల ప్రక్రియలో ఇ.ఎం.డి. 2.5 శాతం నుండి 1 శాతానికి తగ్గించారు. కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లులో ధరావత్‌ని 7.5 శాతం నుండి 2 శాతానికి తగ్గించారు.

నిర్మాణ పని పూర్తి అయిన తరువాత విడుదల చేసే ఎఫ్‌.ఎస్‌.డి. కాలాన్ని 2 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించబడింది.

ఈ పథకం అమలును అధ్యయనం చేయడానికి వచ్చిన జాతీయ స్థాయి, ఇతర రాష్ట్రాల అధికారులు, నిపుణులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇటీవల పర్యటించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికారులు పరిమితమైన యూనిట్‌ ధరలో నాణ్యతా ప్రమాణాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఇళ్లను ప్రశంసిస్తూ వారి రాష్ట్రంలో అమలు పరచడానికి చర్యలు తీసుకొంటున్నారు.

దేశానికే ఆదర్శంగా కొల్లూరు మెగా హౌసింగ్‌ కాలనీ

రాష్ట్రప్రభుత్వం బలహీన వర్గాలవారికోసం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది కొల్లూరులో నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.1354.59 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ మెగా ప్రాజెక్ట్‌ మార్చి మాసాంతంలోగా పూర్తిచేసి లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కొల్లూరులోని 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాకుల్లో అత్యాధునిక షీర్వాల్‌ టెక్నాలజితో జీ.హెచ్‌.ఎం.సీ చేపట్టిన ఈ మెగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆకస్మికంగా తనీఖీ చేశారు. కొల్లూరు ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడం, ఇళ్ల నిర్మాణాలలో అధికారులు మంచి టీం వర్క్‌ తో పనిచేయడం పట్ల స్పెషల్‌ సీఎస్‌ సంతప్తిని వ్యక్తం చేశారు. కొల్లూరు మెగా హౌసింగ్‌ కాలనీ నిర్మాణం 2020 మార్చి మాసంలో పూర్తి అవుతాయని ప్రకటించారు.

కేవలం 10 నెలల క్రితం ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు ఇంత వేగవంతంగా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొల్లూరు ఇళ్ల కాలనీని దేశంలోనే మోడల్‌ కాలనీగా రూపొందిస్తున్నారు. ఈ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నారు. కొల్లూరు హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తికి నిర్ధిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకొని , అందుకు అనుగుణంగా పనులు కొనసాగి స్తున్నారు. దేశంలోనే బలహీన వర్గాలకు ఉచితంగా 15,660 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ఒకే దగ్గర నిర్మించిన దాఖలాలు లేవు. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మోడల్‌ సిటీగా రూపొందించనున్నట్టు చిత్రా రామచంద్రన్‌ వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు ప్రతిరూపమైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన బిల్డింగ్‌ మెటీరియల్‌ను ఉపయోగించడంతో పాటు థర్డ్‌పార్టీ ద్వారా నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు.

ఒకొక్క ఇంటికి రూ. 7.90 లక్షల వ్యయం. మరో 75వేల రూపాయలతో మౌలిక సుదుపాయలు కల్పిస్తున్నారు. ఈ డబుల్‌ బెడ్‌రూం కాలనీలో సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతోంది. అంతర్గత సి.సి రోడ్లు, స్మార్ట్‌ వాటర్‌ డ్రైయిన్లు, మంచినీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీతో పాటు సీవరేజ్‌ ప్లాంటు (ఎస్‌.టి.పి) నిర్మాణం, వీధి విద్యుత్‌ దీపాలు, ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ ఏర్పాటు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, కమ్యూనిటీ కాంప్లెక్స్‌, పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాల ఏర్పాటు, బస్టాప్‌, పోలీస్‌ స్టేషన్‌, ఫైర్‌ స్టేషన్‌, పెట్రోల్‌ బంక్‌ నిర్మాణం. వివిధ మతాల ప్రార్థనా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

షియర్‌ వాల్‌ సాంకేతిక పద్ధతిలో నిర్మాణం, మొత్తం 15,660 డబుల్‌ బెడ్‌ రూమ్‌లు కలిపి 96,75,100 చదరపు అడుగుల విస్తీర్ణం. ప్రతి బ్లాకుకు రెండు మెట్ల దారులు. ప్రతి మెట్ల దారి 3మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం. ప్రతి బ్లాకుకు 8మందిని తీసుకెళ్లే కెపాసిటి కలిగిన రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు.

Other Updates