sridharతెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ తొలి చైర్మన్‌గా డాక్టర్‌ అయాచితం శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఫిబ్రవరి 15న ఉత్తర్వులు జారీచేశారు. రచయిత అయిన శ్రీధర్‌ డిగ్రీకళాశాల లెక్చరర్‌గా పనిచేసి మూడేళ్ళక్రితం పదవీవిరమణ చేశారు. తెలంగాణ వికాస సమితికి సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ జేఎసికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా తనను నియమించినందుకు శ్రీధర్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు కృతజ్ఞలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రాష్ట్రంలోని గ్రంథాలయాలు నూతన రూపురేఖలు సంతరించుకొనేలా కృషిచేస్తానన్నారు. గ్రంథాలయ వ్యవస్థ సక్రమంగా నిర్వహించేందుకు ఉద్యమస్ఫూర్తితో కృషిచేస్తానన్నారు.

Other Updates