kakatiya-missionజలమే నిఖిల జగత్తుకు మూలం… సమస ్త జీవకోటికి ప్రాణాధారం. ఏటికేడు కోరలు చాచుకుంటున్న కరువు రక్కసికి కారణం జల సంరక్షణను నిర్లక్ష్యం చేయడమే. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి ఆయువుపట్టుగా మారిన చెరువుల ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడిరది. జలం జాడలేక… భూమాత చిన్నబుచ్చుకొంది. భూగర్భజలాలు అద:పాతాళానికి చేరుకుని అందకుండా పోయాయి. చెట్టు, చేను చిన్నబోయింది. మేఘాలు ముఖం చాటేసాయి. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. కాకతీయులకాలంలో వ్యవసాయ పండుగగా ఉన్న తెలంగాణలో… సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగగా మారింది.

తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నవ తెలంగాణ రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ చేయాలని పూనుకుంది. గతాన్ని స్మరించుకుంటూ, భవిష్యత్తు నిర్మించుకోవాలన్న ఉద్దేశ్యంతో కాకతీయుల కాలంనుంచి తెలంగాణకు కల్పతరువుగా భాసిల్లుతున్న చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమం క్రింద చెరువుల పునరుద్ధరణను తెలంగాణ ప్రభుత్వం యజ్ఞంగా చేపట్టి ఆయకట్టు ఆయువును పెంచేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రమంతా యుద్ధప్రాతిపదికన ‘మిషన్‌ కాకతీయ’ పనులు శరవేగంతో జరుగుతున్నాయి.

kakatiyaఖమ్మం జిల్లాలో రాష్ట్ర రహదారులు, భవనాలశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావుల మార్గదర్శకత్వంలో జిల్లా కలెక్టర్‌ డా॥ కె. ఇలంబరిది ఖమ్మం జిల్లాలో మిషన్‌ కాకతీయ పనులను ప్రారంభించారు. జిల్లాను అగ్రభాగాన నిలిపి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుపుతున్నారు.
‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మొత్తం 4517 చెరువుల్లో రానున్న 5 సంవత్సరాల్లో పునరుద్ధరణ పనులను చేపట్టి వాటికి పూర్వవైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం 903 చెరువుల పునరుద్ధరణ పనులు ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమంలో చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుత సంవత్సరం నిర్దేశించుకున్న పనుల్లో ఏప్రిల్‌ రెండోవారం వరకు 793 చెరువు పనులకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఇందుకై ప్రభుత్వం రూ. 200 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటివరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన చెరువు పనులను పూర్తిచేస్తే 56,760 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. ఆ మేరకు ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

పరిపాలన అనుమతులు మంజూరైన 793 చెరువులకుగాను 731 చెరువులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. 648 చెరువులకు అగ్రిమెంట్‌ ఖరారయ్యింది. ఏప్రిల్‌ 22 నాటికి 557 చెరువు పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనమొత్తం పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌ డా॥ కె. ఇలంబరిది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించడంతోనే సరిపెట్టకుండా ప్రభుత్వం గుత్తేదార్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్‌ డా॥ కె. ఇలంబరిది ప్రతీ శుక్రవారం రెవిన్యూ, నీటిపారుదల, అటవీశాఖ అధికారులతో సమీక్షిస్తున్నారు. సమస్యలు నెలకొన్న చెరువులపై సమీక్ష సమావేశంలో ప్రత్యేక దృష్టిసారించి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేస్తూ పనులు వేగిరం అయ్యేలా చూస్తున్నారు. చెరువు పునరుద్ధరణ పనుల్లో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థలు, గ్రామ ప్రజలు, ఆయకట్టు రైతులు, యువత క్రియాశీలక భాగస్వామ్యం ఉండేలా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దీంతో చెరువు పనుల గ్రౌండిరగ్‌లో జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డా॥ కె. ఇలంబరిది మాట్లాడుతూ.. ‘మిషన్‌ కాకతీయ’ పనులకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రభుత్వ విస్తృత ప్రచారంతో చెరువు బాగుంటే ఊరు బాగుంటుందన్న నమ్మకం ప్రజల్లో బలపడిరదన్నారు.

ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు చెరువు పనుల పరిశీలనలో ముందుంటున్నారని అన్నారు. దీనివల్ల పనుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారితనం, బాధ్యత పెరిగిందన్నారు. ఒప్పందం ప్రకారం పనులు నాణ్యతతో జరుగుతున్నాయని, జిల్లాలో మిషన్‌ కాకతీయ పనులు వేగిరమయ్యాయన్నారు. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ చెరువుల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌.టి.ఎల్‌.) నిర్ధారించే ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డా॥ కె. ఇలంబరిది పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించి చాలా సమస్యలు ఇప్పటికే పరిష్కరించామన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనను నీటిపారుదల శాఖ అధికారులు దగ్గరుండి చూస్తున్నారని తెలిపారు.

jcpపనులు సజావుగా జరిగేందుకు రెవిన్యూ, అటవీ, నీటిపారుదల శాఖ అధికారులతోపాటు మొత్తం 14 శాఖలను సమన్వయం చేశారు. పనుల్లో నాణ్యత లోపించినా, మధ్యలో పనులు ఆపినా గుత్తేదారుపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల్లో తొలగించిన మట్టి ప్రాధాన్యం, దిగుబడులు పెరిగేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో రైతులకు వివరించి, చైతన్యపరిచామన్నారు. దీంతో మట్టి తోలుకునేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందే మే నెలాఖరులోగా ఇప్పటికే ప్రారంభమైన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు జిల్లాలో చెరువు పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు.
` యం. వెంకటేశ్వర ప్రసాద్‌, ఖమ్మం

Other Updates