గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సమయం అసన్నమైంది. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్కరాలురానే వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి పుష్కరం కావడంతో ప్రభుత్వం భవిష్యతి అన్న రీతిలో వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి పుష్కరాల్లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యాచరణ రూపొందించింది.ఇక పుష్కరాలు నాటికి గోదావరి నదిలోకి నీరు వస్తుందా లేదా అనే అందరి సందేహాలను పటాపంచు చేస్తూ వరుణ దేవుడి కటాక్షం వల్ల పుష్కరాలకు  వర్షాలు కురుస్తున్నాయి. భారతదేశంలో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవనది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యంగా ఈ పుణ్య నది రాశి, సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయం లో గోదావరి నది ఒడ్డున వెసిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్త జనం పోటెత్తనుంది. కోట్లాను కోట్ల మంది భక్తులు గోదావరి నది స్నానం కోసం పుష్కర ఘాట్లకు తరలిరానున్నారు.దీంతో పుఫ్కర ఘాట్లు ప్రత్యేక శోభతో విరాజిలనున్నాయి.

గోదావరి పుష్కరాలు 2015

జులై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. జులై 14 న ఉదయం 6 గంటల 26 నిమిషాలకు ప్రత్యేక పూజలు,గోదావరి హారతితో పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతం భక్తుతో కిటకిటలాడనుంది.

కుంభమేళా తరహాలో పుష్కరాలు

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు తెలంగాణ  ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వచ్చిన మొదటి పుష్కరాలు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పుష్కరాలను నిర్వహిస్తోంది. పుష్కరాల కోసం కెసీఆర్‌ ప్రభుత్వం జూన్‌ ఆఖరు వరకు 600 కోట్ల రూపాయాలను కేటాయించింది. తెలంగాణలోని 5 జిల్లాల్లో 106 ఘాట్లను దేవదాయ శాఖ అధ్వర్యంలో నిర్మించారు. తెలంగాణలోని మిగతా జిల్లాలోని భక్తుతో పాటు ఛత్తీస్‌ ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి భక్తు తరలిరానున్నారు. 6 నుంచి 8 కోట్ల మంది భక్తులు పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలను నిర్వహిస్తున్నందున రాష్ట్రపతి , ప్రధాన మంత్రితో పాటు ఇతర రాష్ట్రా ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, గవర్నర్లను అహ్వానించనుంది. రాష్ట్రపతి, ప్రధానిని ముఖ్యమంత్రి స్వయంగా అహ్వనించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహాదారు రమణా చారి వివిధ ఫీఠాధిపతులను కలిసి, పుష్కరాల్లో పాల్గొనాలని కోరారు.

పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

గోదావరి పుష్కరాల్లో 6 నుంచి 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నాన మాచరించే అవకాశమున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందు తలెత్త కుండా ప్రత్యేక బస్పు, ట్రైన్లను ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాలు జరిగే ప్రాంతాలకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంది. మొత్తం 2600 బస్సులను పుష్కరాల కోసం కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. భక్తులు వేచి చూడకుండా ఉండేందుకు పుష్కర ఘాట్‌ కు చేరుకునేలా ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచనున్నారు. పుష్కర ఘాట్‌ వద్ద వీవీఐపీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధర్మపురిలో పుణ్యస్నాన మాచరించనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌ తో పాటు మరికొంతమంది ప్రముఖులు బాసరలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. బాసర, భద్రాచం, ధర్మపురి, కాళేశ్వరం వద్ద హెలిపాడ్‌ను సిద్ధం చేశారు. ప్రైవేట్‌ ఎజెన్సీ ఆధ్వర్యంలో హెలికాప్టర్‌ నడుపుతున్నారు. భక్తులు కూడా ఈ కమర్షియల్‌ చాఫర్‌ ను వాడుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.

పుష్కర నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష 70 శాతం మేరకు గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి నది 5 జిల్లాల్లో ప్రవహిస్తోంది.. కానీ ఆంధ్రప్రదేశ్‌ , మహరాష్ట్రకు 100 కోట్లు కేటాయించి ..తెలంగాణకు మాత్రం 50 కోట్లే కేటాయించి కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపింది.

భారీ ఎత్తున ఏర్పాట్లు : పుష్కరాల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. పుణ్యస్నానమాచరించేందుకు వస్తున్న భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ప్రధాన రహదారులపై సైన్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు.. స్నానల ఘట్టా వద్ద అపరిశుభ్రతకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మహిళా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కంట్రోల్‌ రూమ్, కాల్‌ సెంటర్లు, పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని గోదావరినది పారుతున్న అయిదు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచం తదితర ప్రాంతాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి సరస్వతీదేవి భాసిల్లుతున్న బాసర పుణ్యక్షేత్రంతో పాటు సోన్‌, గూడెం, మంచిర్యాల తదితర 38 ప్రాంతాలలో పుష్కరఘాట్‌లను ఏర్పాటు చేశారు.

అలాగే నిజామాబాద్‌ జిల్లాలో పోచంపాడ్‌, కందకుర్తి, తడపాకల్‌ తదితర ప్రాంతాలతో పాటు మొత్తం 16 ప్రాంతాలలో ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 38 పుష్కరఘాట్లు ఏర్పాటు జరిగింది. వీటిలో ముఖ్యమైనవి ధర్మపురి, కాళేశ్వరం, కోటి లింగాలు , మంథని తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఇక వరంగల్‌ జిల్లాకు సంబంధించి 4 ప్రాంతాలలో పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు. వీటిలో ముల్లుకట్ట, రామన్న గూడెం,మంగపేట మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, పర్ణశాలతో పాటు మొత్తం 10 ప్రాంతాలలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో జిల్లా వారీగా తీసుకుంటే నిజామాబాద్‌ జిల్లాలో కందకుర్తి, పోచంపాడ్‌, తడపాకల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో బాసర, సోన్‌, గూడెం, మంచిర్యాల్‌ , కరీంనగర్‌ జిల్లాలో ధర్మపురి, కాళేశ్వరం, కోటి లింగాలు , మంథని, వరంగల్‌ జిల్లాలో ముల్లుకట్ట, రామన్నగూడెం, మంగపేట, ఖమ్మం జిల్లాలో భద్రాచం, పర్ణశా తదితర ప్రాంతాలు ఉన్నాయి. మొత్తంగా గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉమ్మడి ప్రభుత్వం హయాంలో పన్నెండేళ్ళ క్రితం కేవలం ఇరవైమూడు ఘాట్లు నిర్మించి చేతు దులుపుకున్నారు. ఈసారి ప్రజలు అవసరాలను ముందుగానే అంచనావేసి మొత్తం నూటా ఆరు ఘాట్లు నిర్మించారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ సరఫరాతో పాటు అన్ని హంగుూ పెద్ద ఎత్తున కల్పించారు. స్వీయపానలో తొలిసారి జరుగుతున్న ఈ పుష్కరాలు ప్రజలకు ఆహ్లాదానాన్నీ, ధార్మిక ప్రేరణను విశేషంగా అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Other Updates