ఉద్యమాన్ని కొనసాగించాలన్న చెన్నారెడ్డి

రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఢల్లీి చేరుకున్న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్‌ ప్రధాని ఇందిరతో సమావేశమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమెకు వివరించారు. ఆయా నేతలతో, బృందాలతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ ‘‘తెలంగాణ నేతలంతా రాష్ట్రపతి పాలన కోరతున్నారని’’ ప్రధానితో చెప్పినట్లు పత్రికలు వెల్లడిరచాయి.

దేశీయాంగమంత్రి నుండి రాష్ట్రపతిపాలన విధింపుకై ఎలాంటి సంకేతాలు రానందున ఉద్యమం కొనసాగించాలని తెలంగాణ ప్రజాసమితి నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు.

విజయవంతమైన టీఎన్జీవోల సమ్మె

సమ్మెను విరమించాలని దేశీయాంగమంత్రి చేసిన సూచనను తెలంగాణ ఎన్జీవోలు ఖాతరు చేయలేదు. జూన్‌ 10న జంటనగరాలతోబాటు తెలంగాణ తొమ్మిది జిల్లాల్లో టీఎన్జీవోల పిలుపునందుకొని లక్షలాదిగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే కొద్దిరోజులనుండి పారిశ్రామిక కార్మికులు సమ్మె చేస్తుండడంతో తెలంగాణ అంతటా పరిపాలన స్తంభించింది. రామగుండం, కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్ల్లలో పనిచేసే విద్యుచ్ఛక్తి బోర్డు సిబ్బంది, కార్మికులు సమ్మె చేయడంతో తెలంగాణతోబాటు విజయవాడవంటి నగరాలు అంధకారమయమైనాయి. కరెంటు సరఫరాలేక పరిశ్రమలన్నీ మూతబడినాయి. కొత్తగూడెంలో జూన్‌ 8 నుండే విద్యుచ్ఛక్తి సిబ్బంది సమ్మె చేస్తున్నందున 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో దాదాపు యాభైశాతం తగ్గిందని విద్యుత్‌బోర్డు ప్రకటించింది. మద్రాసు, మైసూర్‌లలో కొంటున్న విద్యుత్‌సహా అందుబాటులో ఉన్నది 235 మెగావాట్లయితే అవసరమైన విద్యుత్తు 400 మెగావాట్లు. విద్యుత్‌బోర్డు ఛైర్మన్‌ సి. నరసింహం యు.ఎన్‌.ఐ.తో మాట్లాడుతూ ‘‘కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌లో సమ్మె కారణంగా విద్యుదుత్పత్తికి తీవ్రమైన అంతరాయం కలిగింది. మామూలు ఉత్పత్తిలో 50శాతం తగ్గుదల ఉన్నది. అందువల్ల మాచ్‌ఖండ్‌, ఎగువసీలేరు ప్రాజెక్టులనుండి, నెల్లూరు థర్మల్‌ స్టేషన్‌నుండి ఉత్పత్తవుతున్న మొత్తం విద్యుత్తును సమీకరించి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సప్లయి చేస్తున్నా’’మన్నారు.

విజయవాడలోని పరిశ్రమలకు సాయంత్రం 5 గంటలనుంచి 10 గంటలమధ్య విద్యుత్‌ సరఫరా నిలిపివేసారు.
జూన్‌ 10నుండి తెలంగాణ ఏర్పాటుకై టీఎన్జీవో సంఘం ఇచ్చిన పిలుపునందుకొని హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన సుమారు ఏడువేలమంది కార్మికులు, ఉద్యోగులు, పబ్లిక్‌వర్క్స్‌లో పని చేస్తున్న వెయ్యిమంది కార్మికులు సమ్మెలో పాల్గొంటూ విధులకు గైర్హాజరైనందున వీధులన్నీ చెత్త, చెదారంతో నిండిపోయినవి. అత్యవసర సర్వీసులలో సమ్మెలను నిషేధిస్తూ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కార్మికులు, ఉద్యోగులు బేఖాతరు చేసారు. ఉద్యోగాల కన్నా ఉద్యమమే ముఖ్యమని పాలకులకు తెలియజేసారు.
ఆంధ్ర ప్రాంతీయులు అధికంగా ఉన్న సెక్రటేరియట్‌లో టీఎన్జీవోల సమ్మె విఫలమైందని, అధిక సంఖ్యలో ఉద్యోగులు విధులకు హాజరైనారని ప్రభుత్వ సీనియర్‌ అధికారి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1969 నాటికే సచివాలయంలోని దాదాపు ఎనభైశాతం ఉద్యోగాల్లో ఆంధ్ర ప్రాంతీయులు భర్తీ అయినారు. బ్రహ్మానందరెడ్డి హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొన్నారు.

సీపీఐనేత రాజబహద్దూర్‌గౌర్‌ నిరాహారదీక్ష

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహిరంగంగానే వ్యతిరేకించిన భారతకమ్యూనిస్టుపార్టీ తెలంగాణ ఉద్యమ తీవ్రతను, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడాన్ని గమనించి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని, తెలంగాణ సమస్య పరిష్కారానికై అన్ని పార్టీలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించాలని కోరుతూ నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ప్రముఖ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులైన రాజబహద్దూర్‌ గౌర్‌ ప్రారంభించిన నిరవధిక నిరాహారదీక్ష జూన్‌ 9నాటికి నాలుగో రోజుకు చేరింది. గౌర్‌ 3 కిలోల బరువు తగ్గినారని పార్టీ నేతలు ప్రకటించారు. విజయవాడలో, ఆంధ్రలోని కొన్ని పట్టణాల్లో కూడా దాసరి నాగభూషణం వంటి అగ్రనేతల సారథ్యంలో ఇవే డిమాండ్లతో సీపీఐ నేతలు దీక్షలు చేస్తున్నారు.

గుండాల దాడులను తిప్పికొట్టాలన్న చెన్నారెడ్డి

తెలంగాణ ఉద్యమకారులపై ఆంధ్రప్రాంత గూండాల దాడులు నిత్యం జరుగుతూనేఉన్నాయి. అనేక ప్రాంతాల్లో తెలంగాణ పల్లెలనుండి వచ్చి కూ పనులు చేసుకుంటూ రాంనగర్‌, చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో నివసిస్తున్న వారి గుడిసెలను ఆంధ్ర గూండాలు తగులబెట్టినారు. ఆంధ్ర గూండాలు దాడులు చేస్తూంటే అనేక సందర్భాల్లో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ దాడులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నందునే పోలీసులు నిస్సహాయులుగా మిగిలినారని తెలంగాణ ఉద్యమనేతల అభిప్రాయం.
గుండాల, ఆంధ్ర పోలీసుల అఘాయిత్యాలతో బాధితులైన ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించడానికి లంగాణ ప్రజాసమితి నిధులను సమీకరిస్తుందని చెన్నారెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. గుండాల చర్యలను ఎదిరిస్తూ వాటిని విచ్ఛిన్నం చేయాలని ఆయన కార్యకర్తలను కోరినారు. ప్రతి వీధిలో గుండాల, పోలీసుల అణచివేత చర్యలను ఎదిరించడానికి రక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కొండా లక్ష్మణ్‌ ప్రజలను కోరినారు.

తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మిన ఆంధ్ర పత్రికలు

aతెలంగాణలోని తెలుగు దినపత్రికలలో ఒక్క ‘ఆంధ్రభూమి’ (ఆనాటి) తప్ప దాదాపు అన్ని పత్రికల యాజమాన్యాలు ఆంధ్ర ప్రాంతంవారే అయినందున ఆ పత్రికలు ఉద్యమ వార్తలను వక్రీకరిస్తూ, స్వంత వ్యాఖ్యానాలు జోడిస్తూ, అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మినవి. ఉద్యమ నేతలపై దుష్ప్రచారం చేసినవి. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వానికి సూచించినవి.

ఇందిర, చవాన్‌లు హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఉద్యమనేతల డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవడం ఆంపత్రికలకు పరమానందం కలిగించినట్లున్నది. వారి పర్యటనల అనంతరం ఈ పత్రికలు ఉద్యమంపై, తెలంగాణ నాయకులపై మరింత విషం చిమ్మినాయి.

ఆంధ్రప్రభ జూన్‌ 11 నాటి సంపాదకీయంలో ‘‘రాజధానిలోనూ, ఇతర నగరాల్లోనూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకపోవడం సామాన్య జనం కనీసం పౌరహక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి ఏర్పడడం, ప్రధానంగా శాంతిభద్రతల సమస్య మానవతకు సంబంధించిన విషయం. ఈ పరిస్థితిని చక్కబర్చడానికి రాజకీయ సమస్యల పరిష్కారంతో నిమిత్తం లేకుండా చర్యలు తీసుకోవచ్చును.

‘‘ఇంతవరకు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఉద్యమాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయడానికి కొంతకాలంగా జరుగుతున్న ‘‘కుట్ర’’ ఇప్పుడు కార్యరూపం దాల్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కఠినచర్యలు తీసుకొని ఈ విపరిణామాలను ఎందుకు రింపలేకపోతున్నదనే ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వలేకుండా ఉన్నారు.’’

ఆంధ్రపత్రిక జూన్‌ 8న సంపాదకీయంలో ‘‘రాష్ట్రంలో అధికప్రాంతం ప్రశాంతంగా ఉంది. తెలంగాణలో కూడా అధిక ప్రాంతంలో గోల ఏమీ ఇప్పుడు జరుగుతున్నట్లు కన్పించదు. వికటమైన పరిస్థితి అంతా జంటనగరాల్లోనూ, వరంగల్లులోనూ కేంద్రీకృతం అయి ఉంది. అక్కడ జరుపబడిన దౌర్జన్యకాండ కనీవినీ ఎరుగనిదిగా ఉంది. పోలీసు కాల్పులను, కర్ఫ్యూ విధింపును విమర్శిస్తూ ఉన్నవారు ఈ జరిగిన దౌర్జన్యకాండను గురించి ఎందుకు మాట్లాడరో, ఎందుకు దౌర్జన్యాలను ఖండిరచరో అర్థం కాకుండా ఉంది.’’

తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్ష, ఆవేదన ఆంధ్రప్రభకు ‘కుట్ర’లా కన్పిస్తే ఆంధ్రపత్రికకు ‘గోల’లా కన్పించింది. తెలంగాణలో కేవలం రెండు జిల్లాల్లో తప్ప ఎక్కడా తెలంగాణా ఉద్యమం ‘కన్పించద’ని రాయడం, దౌర్జన్యకాండ జరిగిందనడం పచ్చి అవాస్తవాలు. నిజానికి జంటనగరాల్లో దౌర్జన్యకాండ జరిపింది బ్రహ్మానందరెడ్డి తెప్పించిన గుండాలు. దౌర్జన్యానికి గురై ప్రతిఘటించింది తెలంగాణ బిడ్డలు.

ఆంధ్రజ్యోతి సంపాదకులుగా ఉన్న నార్ల వెంకటేశ్వరరావు తమ పత్రికలో కూడా అసత్యాలు, అబద్దాలు రాస్తుండడంతో సిబ్బందిని మందలించారని, ‘‘ఉద్యమ వార్తలను ఉన్నది ఉన్నట్లు రాయాల’’ని ఆదేశించినట్లు ప్రముఖ జర్నలిస్టు 1969 ఉద్యమంలో క్రియాశీలకపాత్ర వహించిన ఆదిరాజు వెంకటేశ్వరరావు తన రచనల్లో తెలిపారు. నార్లవారి ఆదేశాలకు మండిపడిన తెలంగాణ వ్యతిరేకులైన ఆంధ్ర నేతలు గుండాలను ఉసిగొల్పి విజయవాడ ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

జూన్‌ 11న ఆంధ్రజ్యోతి దినపత్రిక తన సంపాదకీయంలో ‘‘మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాల’’న్న తెలంగాణ ప్రజా సమితి డిమాండ్‌ను సమర్థించింది.

‘‘ఇంతకుముందు కాకపోయినా, హైదరాబాదుకు వచ్చి వివిధ వర్గాలవారిని కలుసుకుని చర్చలు జరిపిన తర్వాతనైనా హోంమంత్రి చవాన్‌కు ఈ క్రింది విషయాలు స్పష్టపడి వుండాలి.

ప్రస్తుతపు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంమీద, దాని ముఖ్యమంత్రిమీద అధిక సంఖ్యాకులకు విశ్వాసం లేదు.
‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగా నిలపగోరితే, దానికి మొదటి చర్యగా ప్రస్తుత ముఖ్యమంత్రిని వైదొలగమని కోరాలిÑ అందుకు ఆయన నిరాకరిస్తే బర్తరఫ్‌ చేయాలి. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. లేదా రాష్ట్రపతి పాలనను కొన్నాళ్ళపాటు విధించాలి. రాష్ట్ర సమైక్యతమాట అటుంచి, శాంతి భద్రతలను పునరుద్ధరించాలన్నా ఇది కేంద్ర ప్రభుత్వం కనీసపు కర్తవ్యం.

‘‘మూడు వారాలనాడే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించి వుండవలసిందని, ఆ తర్వాతనే చవాన్‌ హైదరాబాద్‌ వచ్చి పరిస్థితి చక్కదిద్దడానికి యత్నించి వుండవలసిందని ‘‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’’ తన సంపాదకీయంలో వ్రాసింది (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్తలను సమగ్రంగా తన సంపాదకీయంలో నార్ల వెంకటేశ్వరరావు ఉదహరించారు).
తన సంపాదకీయంలో బ్రహ్మానందరెడ్డిపై నార్ల వెంకటేశ్వరరావుగారు ఈ క్రింది వ్యాఖ్యలు చేశారు.

‘‘రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని కేవలం శాంతిభద్రతల సమస్యగా చిత్రించి, దేశానికి తప్పుడు అభిప్రాయాన్ని కలగించడానికే బ్రహ్మానందరెడ్డి ఇప్పటికీ యత్నిస్తున్నారు. తనకు ఇంకా ఎక్కువ అధికారాలిస్తే పరిస్థితిని క్షణాలలో అదుపు చేయగలనని మొన్ననే ఆయన ప్రగల్భాలు పలికారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండడంకంటె ఈయనకు కావలసిన అధికారాలేమిటో తెలియదు. నిజానికి ప్రస్తుత సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కానేకాదుÑ పరిపాలనా సమస్య కూడా కాదుÑ అది ప్రధానంగా రాజకీయ సమస్య. దానికి చేయవలసింది రాజకీయ పరిష్కారమే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కప్పిపుచ్చుతున్నారని భావిస్తున్నది మేమొక్కరమేకాదు. తమ సోమవారం (9.6.1969)నాటి సంచికలో ‘‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’’ చీఫ్‌ ఎడిటర్‌ ఫ్రాంక్‌ మొరేస్‌ వ్రాసిన ఈ వాక్యాన్ని చూడండి: ుఔష్ట్రవఅ ్‌ష్ట్రవ జష్ట్రఱవట వీఱఅఱర్‌వతీ, వీతీ. దీతీaష్ట్రఎaఅaఅసa Rవససఱ ంబతీఙవవఱఅస్త్ర ్‌ష్ట్రవ ష్ట్రశీశ్రీశీషaబర్‌ ఱఅ ువశ్రీaఅస్త్రaఅa, షశీశీశ్రీశ్రీవ సవంషతీఱపవస ఱ్‌ ఱం a శ్రీaష aఅస శీతీసవతీ ంఱ్‌బa్‌ఱశీఅ ష్ట్రవ షaం ్‌aశ్రీసఱఅస్త్ర, aఅస ఎబర్‌ ష్ట్రaఙవ తీవaశ్రీఱంవస ష్ట్రవ షaం, ్‌ష్ట్రవ ఎశీర్‌ బఅఱఅష్ట్రఱపఱ్‌వస అశీఅంవఅషవ.ు నిజమే. ఆరు నెలల తర్వాత కూడా రాష్ట్రం ఇంతకుముందు పన్నెండేళ్లలో ఎన్నడూ ఎరుగని విపత్కర పరిణామాన్ని ఎదుర్కొంటున్న తరుణంలోకూడా ప్రస్తుత పరిస్థితిని శాంతి భద్రతల సమస్యగా ముఖ్యమంత్రి వర్ణించడం నాన్సెన్స్‌కాక మరేమిట’’ని నార్ల వ్యాఖ్యానించారు.

చవాన్‌కు కొండా లక్ష్మణ్‌ లేఖ:

జంటనగరాల్లో అమాయకులైన ప్రజలపట్ల పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడినట్లు కేంద్ర హోంమంత్రి చవాన్‌కు తెలంగాణ పి.సి.సి. అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ ఫిర్యాదు చేసారు. ‘‘నేను, పిసిసి ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, మాజీ శాసనసభ్యులు బి. రాందేవ్‌తో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించాము. పలు ప్రాంతాలలో పోలీసులు తలుపులు బ్రద్ధలుకొట్టి ఇళ్ళల్లోకి వెళ్ళి ఆస్తులకు నష్టం కలిగించినట్లు తెలిసింది. పెక్కుమందిని గాయపరిచినట్టు కూడా తెలిసింది. ఆంధ్రకు చెందిన పోలీసు అధికారులు అమానుషంగా ప్రవర్తించి ఆంధ్ర, తెలంగాణ ప్రజలమధ్య తీవ్ర విభేదాలను సృష్టిస్తున్నారు. పోలీసులు విచక్షణారహితంగా అరెస్టులు జరిపినారు. ఇటువంటి సంఘటనలపై న్యాయవిచారణ జరిపించాల’’ని కొండా లక్ష్మణ్‌, చవాన్‌ను కోరినారు.

తెలంగాణ అంతటా సాధారణ సమ్మె:

జూన్‌ మొదటి వారంలో మొదలైన పారిశ్రామిక కార్మికుల సమ్మె, 7న ప్రారంభమైన విద్యుచ్ఛక్తి సిబ్బంది, కార్మికుల సమ్మె, 10నుండి సాగుతున్న టిఎన్జీవో, మున్సిపల్‌, పబ్లిక్‌వర్క్స్‌ కార్మికులతో సమ్మెలతో తెలంగాణ వ్యాప్తంగా పరిపాలన స్థంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితి నెలకొని ఉండగా జూన్‌ 13నుండి తెలంగాణ పంచాయతీరాజ్‌ ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించారు. మూతబడ్డ స్కూళ్ళు తిరిగి తెరిచిన వెంటనే ఉపాధ్యాయులంతా సమ్మెకు దిగుతారని రాష్ట్ర టీచర్ల సంఘం అధ్యక్షులు ఎం. బాలకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ కార్మికనేత రాజబహదూర్‌ గౌను పరామర్శించడానికి వచ్చిన మఖ్దూం మొహియుద్దీన్‌, జె. సత్యనారాయణ ‘‘మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేయడంలో జాప్యం జరిగితే రాష్ట్రంలోని కార్మికవర్గం మొత్తం సాధారణ సమ్మె చేస్తుంద’’ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజబహద్దూర్‌ గౌర్‌ను పరామర్శించడానికి ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు, హసన్‌ ఫరూకి (కవి), రామబ్రహ్మం దీక్షా శిబిరాన్ని సందర్శించారు.

ప్రధాని ఢల్లీికి పిలిచినా వెళ్ళని సీఎం:

తెలంగాణలో పరిస్థిని స్వయంగా తెలుసుకున్న ప్రధాని ఇందిర దేశీయాంగమంత్రి చవాన్‌ ద్వారా కూడా తెలంగాణ నేతల అభిప్రాయాలను తెలుసుకుని జూన్‌ 16న పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిపి ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించాలని నిర్ణయంచుకున్నారు. బ్రహ్మానందరెడ్డిని జూన్‌ 13న ఢల్లీికి రావలసిందిగా కోరినారు. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంనుండి తనను తొలగిస్తారని భావించిన (తన సన్నిహితులద్వారా తెలుసుకుని) సి.ఎం. బ్రహ్మానందరెడ్డి ఢల్లీికి వెళ్ళకుండా ఏవో కుంటిసాకులు చెప్పి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈలోగా ప్రధాని ఇందిర ‘సిండికేట్‌’లో ఉన్న లను లోబర్చుకుని తన పీఠాన్ని పదిలపర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినారు. తెలంగాణ సమస్యపై తన అభిప్రాయాలు ఇప్పటికే తమ చెప్పినానని, ఇక కొత్తగా చెప్పేదేమీ లేదని, ప్రధానికి తెలిపే సాహసం చేశారు.

జూన్‌ 16న జరిగే కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముందే తెలంగాణ సమస్యపై ఒక అంచనాకు రావాలన్న ఇందిర, చవాన్‌ల ప్రయత్నాలను బ్రహ్మానందరెడ్డి వమ్ము చేశారు. తనకు అనుకూలంగా పార్లమెంటరీ పార్టీ సభ్యులను కూడగట్టుకోవడానికి ఢల్లీిలోని తన అనుయాయులతో పావులు కదిపినారు. మరో ప్రక్క తను తెలంగాణ ఉద్యమం యెడ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆలోచిస్తున్న సహచర తెలంగాణ ప్రాంత మంత్రులను, ఇప్పటిదాకా తనకు మద్దతుగా నిలిచి ఇప్పుడిప్పుడే డా॥ చెన్నారెడ్డితో సంప్రదింపులు నెరుపుతున్నారని అనుమానం ఉన్న శాసనసభ్యులను నయాన్నో భయాన్నో ఒప్పించి తనకు మద్దతుగా సంతకాల సేకరణ మొదలుపెట్టినారు. వీరు సంతకాలు చేసిన పత్రాలను ప్రధానికి చూపించి తనకే శాసనసభలో మెజారిటీ ఉన్నదని, తన విధానాలను రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభ్యులు అధిక సంఖ్యలో బలపరుస్తున్నారని నచ్చజెప్పి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలని బ్రహ్మానందరెడ్డి యోచన.

‘‘ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డికి ఇదే చివరి యాత్ర కాగలద’’ని డా॥ చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడానికి మళ్ళీ ఢల్లీినుండి ముఖ్యమంత్రిగా కాసు తిరిగిరార’’ని కూడా ఆయన అన్నారు. జూన్‌ 19న ఢల్లీిలో జరిగే కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రపతి పాలనకై ఒత్తిడి తెస్తారన్న ఆశాభావాన్ని చెన్నారెడ్డి వ్యక్తం చేశారు.

తెలంగాణలోని పోలీసు బలగాలు ప్రజలపై అత్యాచారాలు చేస్తున్నందున తాము పోలీసు దళాలను వెనక్కి పిలిపించు కోవాలని కోరుతూ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు డా॥ చెన్నారెడ్డి తెలిపారు. తెలంగాణ సమస్యపై దేశీయాంగ మంత్రి వై.బి.చవాన్‌తో తరచుగా ప్రధాని చర్చిస్తూనే ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి ఏవో సాకులు చూపి ఢల్లీి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపిన తర్వాత జూన్‌ 14న చవాన్‌ ఇందిరతో మళ్ళీ సమావేశమైనారు. జూన్‌ 19న జరుగనున్న కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయానికి రావాలన్నదే వీరి ఆలోచన.

Other Updates