తెలంగాణ ప్రభుత్వం సంస్కృతికి, చారిత్రక వైభవానికి నిలిచిన కాకతీయ కట్టడాలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ చీఫ్‌్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాష్‌రావు, జెడ్‌పి ఛైర్మన్ డా|| ఎం. సుదీర్ కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షకులు మిలన్ కుమార్ చావ్లే లతో కలిసి హన్మకొండలోని వేయిస్తంభాల గుడి కళ్యాణమండపం పునరుద్దరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎం.పి.గా పనిచేస్తున్న కాలంలో వేయిస్తంబాల గుడి పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ రూ. 3 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.2006 జూలై 5వ తేదిన వేయిస్తంభాల గుడి పునరుద్ధరణకై శిథిలావస్తకు చేరిన నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని వినోద్‌కుమార్ వివరించారు. తదుపరి పెరిగిన అంచనాల మేరకు మరో రూ. 3 కోట్ల 80 లక్షలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అను గుణంగాసవరించిన అంచనాల ప్రకారం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రెండు విడుతలలో రూ.7 కోట్ల 30 లక్షల నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. గత 14 సంవత్సరాల నుండి పునరుద్దరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. 1000 సంవత్సరాల చారిత్రక వైభవానికి ఎటువంటి నష్టం జరుగకుండ, సిమెంట్, ఇనుములను వినియోగించకుండా స్థపతుల పర్యవేక్షణలో యధాతథంగా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. మరో వేయి సంవత్సరాలపాటు కాకతీయ వైభవాన్ని సజీవంగా నిలిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులకు రూ. 4 కోట్ల 50 లక్షలను చెల్లించినట్లు తెలిపారు. 70 శాతం పనులు పూర్తి అయినాయని తెలిపారు. సంవత్సర కాలంలో వేయిస్తంబాల గుడి కళ్యాణమండపం పునరుద్దరణకు పనులు 100 శాతం పూర్తి అవుతాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్థపతులకు చెల్లింపులు చేయాలని అధికారులకు వినోద్‌కుమార్ సూచించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలానికి అనుగుణంగా ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కేటాయించిన నిధులు కేంద్ర పురావస్తు శాఖ నుండి నిధులు విడుదల చేసినందున పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖల పర్యవేక్షణలో నిర్మాణపనులు జరుపుతామని అన్నారు. అధిక నిధుల గురించి కేంద్ర పురావస్తు శాఖ దృష్టికి తీసువెళ్తామని తెలిపారు. పురాతన కట్టడాలను పరిరక్షిస్తామని అన్నారు.
పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ పురాతన కట్టడాలైన రామప్ప, వేయి స్తంబాల గుడుల నిర్మాణంలో ప్రత్యేక శౌలిని కాకతీయులు అనుసరించినట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నైపుణ్యత కల్గిందని అన్నారు. కాకతీయులు నిర్మించిన దేవాలయాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రస్తుత వేయిస్తంబాలగుడి కళ్యాణ మండపం నిర్మాణపనులను పూర్తిచేసేందుకు తామందరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ఇంచార్జీ కలెక్టర్ హరిత, రాష్ట్ర మహిళా ఆర్ధిక అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ్‌నాయక్, ఇన్‌ట్యాక్ కన్వీనర్ పాండురంగారావు, స్ధానిక కార్పెరేటర్ వేముల శ్రీనివాస్, తహాశీల్దార్ నాగేశ్వరరావు, పురావస్తు శాఖ సంరక్షణ సహయకులు మల్లేశం, బండి నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గన్నారు.
అంతకుముందు దేవున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులచే ఆశీర్వచం తీసుకున్నారు.
– వై. వెంకటేశ్వర్లు