శ్రీ టి.ఉడయవర్లు
పల్లెపట్టులలోని పల్లీయులను, వారి తీరు తెన్నులను చిత్తానికి
హత్తుకునేలాగా చిత్రించే సృజనాత్మక చిత్రకారుడు – బైరు రఘురాం.
గ్రామీణ వనితల్లో ”కొప్పుచూడు కొప్పందం చూడు” మనే కోమలులు,
వారి కనుముక్కుతీరు, కడియాలు, గాజులు, ”కొక్కరొకో” అని
మేల్కొలిపే కోళ్ళు, ”మేమేమే” అనే మేకలు, చిట్టి చిలుకలు, సీతాకోక
చిలుకలు, జలపుష్పాలు వాటి కదలికలు, పరిసరాలు రఘురాం
చిత్రాల్లో సహజసుందరంగా, కళాత్మకంగా కనిపిస్తాయి.
ఆయన ఏ చిత్రం గీసినా సంతకం లేకుండానే ఆయన శైలి ‘ఇది రఘురాం
చిత్రమ”ని పట్టిస్తుంది. ఆయన వేసే చిత్రాల్లో ముఖ్యంగా జుట్టుముడి, శరీర సౌష్టవం,
కనుముక్కుతీరు, పనితనం ఆయనకే ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన
ప్రతి గీతలో రఘురాం ముద్ర ఉంటుంది. చిన్న చిన్న రేఖల నగిషీ, నాణ్యత ఇతరుల
నుంచి రఘురాంను వేరు చేస్తుంది. నిజానికి అవే వేర్లు ఆయన చిత్రకళా వృకూజుానికి.
రఘురాం లోగడ చిత్రాల్లోని డ్రాయింగ్‌లు, గ్రాఫిక్స్‌లలోని కలం పోయిన పోకడ,
ఇటీవలి కాలంలోని వర్ణచిత్రాల్లో ఆకృతి చెదిరినా, ఒకరకంగా అంతరాశీవనమైన ఆయా
చిత్రాల్లోని రేఖా లావణ్యం, రంగుల అమరిక, భావోద్వేగం బహుపసందైనవి.
ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది నచ్చినా, ఇప్పటికే డ్రాయింగ్‌బుక్‌లో స్కెచ్
వసే ు కోవడం అలవాటు. అటా ్ల ఇప్ప టకి వలే సం ఖ్యలో అపు రూ పవ ుె నౖ స్కెచల్ ు గీశాడు .
రఘురాం స్కెచ్‌బుక్‌లను, వాటిలో ఆయన రేఖా నైపుణ్యాన్ని, ”ఈజ్”ను చూడటం
గొప్పఅనుభవం.
19?9లో హైదరాబాద్‌లో బాలయ్య – రాములమ్మ దంపతులకు జన్మించిన బైరు
రఘురాం సికిందరాబాద్‌లోని ఇస్లామిక్ ఉన్నత పాఠశాలలో నాల్గవ తరగతి
చదువుతున్న రోజులలోనే చిన్న చిన్న బొమ్మలు వేయడం ప్రారంభించాడు. ఒకరోజు
రం గు లలో చిన్న కృ షు డ్ణ ి బొమ్మచూ స ి అది ఉన్నదు న్నటుగ్ట ా వయే ు డం తో ఉపాదాó ్యయ ుడు
నరేందర్ చూసి వాహ్ రఘురాం అర్టిస్ట్” అన్నాడట. క్లాసులో అందరు చప్పట్టు
కొట్టారు. ఆ తర్వాత ఆయనే డ్రాయింగ్ టీచర్ యూసుఫ్‌కు చెప్పి చిత్రకళలో
రఘురాంను తీర్చిదిద్దమన్నారదాంతో తాను చిత్రాలు వేసి యూసుఫ్‌సారుకు చూపి
సలహాలు తీసుకునేవాడు. అంతలోనే అంతర పాఠశాలల
చిత్రకళ పోటీలు రావడంతో వాటిలో రఘురాం పాల్గొని
ద్వితీయ బహుమతి గెలుచుకున్నాడు. సికిందరాబాద్ సెయింట్
ఆన్స్ స్కూల్లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆయనకు బహుమతి
ప్రదానం చేశాడు.
అప్పుడే ఇక చిత్రకళను విడువకూడదనే నిర్ణయానికి
రఘురాం వచ్చాడు. చాలా కష్టపడి చిత్రలేఖనాన్ని సాధన
చేశాడు. ఇట్లా స్వయంగా చిత్రకళ అభ్యసించిన రఘురాం.
బి.ఏ. పూర్తి చేసిన తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్‌లలో
గుల్బర్గా నుంచి డిప్లొమా పొందారు.
వీరు రూపొందించిన ”కదలిక” అనే ఇచ్చింగ్‌కు 1997లోట.కంద్ర లలితకళా అకాడమీ అవార్డు రావడం బంగారానికి పరిమళం అద్దినట్లయింది.
ఇంకా 1990లోనే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారి స్వర్ణపతకం వీరి చిత్రానికి
లభించింది. అంతకుముందు 1983లో, 1987లో, 1983లో, 1993లోనూ
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డులు వీరికి వచ్చాయి. 1981లో, 1988లో భరతకళా
పరిషత్ అవార్డులు, 1987లో, 1989లో ఆంధ్రప్రదేశ్ లలితకళా సమితి అవార్డులు
గెలుచుకున్నాడు. 2011లో కేంద్ర సాంస్కృతికశాఖ ఫెలోషిప్ ఇచ్చింది. 2012లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న అవార్డును, 1913లో పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం ప్రదానం చేసింది.
ఒక తరహా చిత్రాలు కాకుండా తొలినాళ్ళలో డ్రాయింగ్‌లు, ఆ తర్వాత
పెయింటింగ్‌లు, పిదప ఎచ్చింగ్ తదితర ప్రింటులు వేయడం, ప్రస్తుతం ఒకానొక
తరహా ఆకృతి మారిన పెయింటింగ్ రఘురాం వేస్తున్నాడు. తాజాగా ఆయన వేస్తున్న
చిత్రాల స్కెచ్‌లలో చక్కని ఆకృతులు కన్పిస్తుండగా, వాటిలో రంగులు తీర్చిదిద్దే సరికి
అవి అంతర్ధానమై, అదో తరహా చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ కొత్త చిత్రాలను
త్వరలో కళాభిమానుల కోసం ప్రదర్శించాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు.
ప్రాచీన చిత్రకారుల ధోరణులు, వారి శైలిని ఎంతగానో అధ్యయనం చేసిన బైరు
రఘురాంపై ప్రముఖ జర్మన్ చిత్రకారుడు – ఆల్బర్ట్ డ్యూరర్, డావెన్స్‌ల డ్రాయింగ్
ప్రభావం ఉన్నట్టు తోస్తుంది. ఇప్పటివరకు ఎంతో సమయం తీసుకునే అపురూపమైన
డ్రాయింగ్స్ ఐదు వందల దాకా ఆయన వేసి ఉంటాడు. అట్లాగే వందకు పైగా
పెయింటింగ్స్ వేశాడు. సుమారు రెండు వందల అంశాలపై వందలాది ఎచ్చింగ్స్
రూపొందించాడు.
రఘురాం జాతీయ, అంతర్జాతీయ సాశీవయి చిత్రకళా ప్రదర్శనలలో శిబిరాలలో
పాల్గొన్నాడు. వాటిలో 1999లో అమెరికాలోని గ్లోబల్ విలేజ్ ఆర్ట్స్, సాన్‌జోష్,
2001లో అమెరికాలోని మాస్ బెస్ట్ గ్రీన్ ఫీల్డ్‌లోని పుష్కిన్ ఆర్ట్ గ్యాలరీ, 2005లో
లండన ్ నె హూ సెంటరల్ ో, హా ంగక్ ాంగల్ ోని హా ంకాంగ ్ విజువల్ సెంటర,్ 2006లో
న్యూయార్క్‌లోని స్టోన్ సీన్స్ గ్యాలరీ, 2008లో దుబాయ్‌లోని దుబాయ్ కమ్యూనిటీ
థియేటర్ అండ్ ఆర్ట్స్ సెంటర్, 2010లో దకిూజుణ ఆఫ్రికాలోని సనావా ప్రిటోరియా,
2013లో రాయల్ ఒపెరా ఆర్కెడ్, లండన్‌లోని ఆర్ట్ గ్యాలరీ, న్యూయార్క్‌లోని జెడబ్ల్యు
మారిట్ సెంట్రల్ పార్క్‌లు, భారతదేశంలోని అన్ని పెద్ద నగరాల్లో జరిగిన చిత్రకళా
ప్రదర్శనలు ప్రదానమైనవి.
ఇక వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలలో 1991లో, 1996లో
బొంబాయిలోని జహ ంగీర ్ ఆర ్ట్ గ్యాలరీలో, 1993లో, 1997లో
హైదరాబాద్ అలయెన్స్ ఫ్రాంచైస్ ఆర్ట్ గ్యాలరీలు, 1998లో
న్యూ ఢిల్లీలోని ఆర్టిలియర్ 2221 గ్యాలరీలో, 1999లో
బెంగుళూరులోని రైట్‌లైన్స్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసినవి
చెప్పుకోదగినవి.
వీరి చిత్రాలను కేంద్ర లలితకళా అకాడమీ, లలితకళా
అకాడమీ మద్రాసు ప్రాంతీయ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
లలితకళా అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ
విద్యాలయ ం, అలయె న్స్ ప్రా ంచసై ్ (హై దర ాబాద)్ , బాó రత బవó న్
(భోపాల్), ఉత్తర ప్రదేశ్ లలితకళా అకాడమీ, సాలార్‌జంగ్
మ్యూజియం (హైదరాబాద్), మరెందరో దేశీయ విదేశీయ
కళాభిమానులు సేకరించారు.
” గ్రాఫిక్ ఆర్ట్ ఇన్ ఇండియా”లో 1850 నుంచి ఎంపికైన
చిత్రాలలో రఘురాం చిత్రం కూడా ఉంది. 1970 నుంచి
ముప్పై మూడేండ్లపాటు జనాభా లెక్కల శాఖలో సీనియర్
ఆర్టిస్ట్‌గా రఘురాం పని చేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ
చేశారు. దశాబ్దకాలంగా కేవలం చిత్రాలు వేయడమే తన నిత్య
జీవితమై గడుపుతున్న అపురూప చిత్రకారుడు – బైరు
రఘురాం.