రామాయణం, మహాభారతం, పురాణాలు వీటన్నింటినీ సంపూర్ణంగా చదవాలంటే చాలా సమయమే పడుతుంది. అదే విధంగా వాటిల్లో వున్న పరిపూర్ణమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నా తగినంత పాండిత్యమూ అవసరం. అలాకాకుండా బ్రహ్మపురాణాన్ని ‘విజ్ఞానశాస్త్రం’ రూపంగా చిన్న పుస్తకంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందించిన రచయిత డా|| నిట్టల గోపాలకృష్ణ ప్రయత్నం విజయవంతమయ్యింది అని చెప్పవచ్చు.
సూతమహాముని పురాణాలను అందరికీ ఏ విధంగా వివరంగా తెలియపరిచారో వివరిస్తూ వ్రాసిన పుస్తకమే ఈ విజ్ఞాన శాస్త్రం (బ్రహ్మపురాణం).
అందరికీ అర్థమయ్యేవిధంగా క్లుప్తంగా సవివరంగా సమాచారాన్ని అందజేసిన రచయిత అభినందనీయుడు. బడి పిల్లలు సహితం చదివి అర్థం చేసుకోగలిగే విధంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు.
-ఎం.కె.
రచయిత: డా|| నిట్టల గోపాలక్రిష్ణ
పేజీలు: 48, వెల: రూ. 40
ప్రతులకు: గోమాత సేవా ట్రస్ట్, 202, శివసాయి సదన్, శ్రీనివాసపురం, రామంతపురం, హైదరాబాద్.