బందు శ్రీకాంత్‌ బాబు

అదేంటి భూమికి, చెట్టుకు కూడా పుట్టిన రోజు ఉంటుందా? అనే అనుమానం రావచ్చు. భూమి ఎలా పుట్టింది, దానిపై చెట్టు ఎలా వచ్చింది అనే విషయాను కాసేపు పక్కన పెడితే చెట్టుకు పుట్టిన రోజు ఎందుకో ఈ వ్యాసం చివరి వరకు చదివితే మనందరికీ అర్థం అవుతుంది.
ప్రస్తుతం భూమి, దానిపై ఉన్న చెట్టు కూడా సంక్షోభంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లోపించిన పర్యావరణ సమత్యుత, వేగంగా దిగజారుగుతున్న జీవన ప్రమాణాు మానవ మనుగడకే ముప్పులా పరిణమిస్తున్నాయి. ఈ  ఉపద్రవంపై అందరికీ అంతో ఇంతో అవగాహన ఉన్నా. పర్యావరణ రక్షణ దిశగా పడాల్సిన అడుగు వేగాన్ని అందుకోవటం లేదు. వాతావరణంలో కర్బన ఉద్ఘారాను తగ్గించేందుకు అంతర్జాతీయ చర్చు, ఒప్పందాు జరుగుతూనే ఉన్నాయి. కానీ చేతల్లో అసమానత కారణంగా పర్యావరణ మేుకంటే ముప్పే ఎక్కువ జరుగుతోంది. ఈ పరిణామా మధ్య కొత్తగా పుట్టిన తెంగాణ రాష్ట్రం పర్యావరణ దిశగా పెద్ద అడుగులే వేస్తోంది. తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ నివేదిక కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మొక్కు నాటడంలో తెంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ అంటూ కేంద్రం వ్లెడిరచింది. విభిన్న రంగాల్లో ప్రథమ స్థానంలో నిుస్తున్న తెంగాణ పర్యావరణ రక్షణ దిశగానూ తన ముద్రను వేసుకుంది.

దీనికి ఆద్యుడు, ఆకుపచ్చని రాష్ట్రాన్ని స్వప్నిస్తూ తెంగాణకు హరితహారం ప్రారంభించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. సుదీర్ఘ పోరాటం తర్వాత కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం ముందు ఉన్న సవాళ్లు, ఎజెండాలో పర్యావరణ సమత్యుతను చేర్చటమే ఓ పెద్ద సాహసం. నీళ్లు, నియామకాు, నిధు కోసం జరిగిన ఉద్యమంలో, ఈ మూడిరటిపై హక్కుతో పాటు మా రాష్ట్రాన్ని మేమే పచ్చగా చేసుకుంటా, నివాసయోగ్యంగా మార్చుకుంటామని తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి స్వప్నించారు. సగటున అటవీ విస్తీర్ణం లెక్కగట్టి జాతీయ స్థాయిలో ఉండాల్సింది 33 శాతం, కానీ తెంగాణలో 24 శాతమే పచ్చదనం ఉంది. అందుకే ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే తెంగాణలో పచ్చదనం మరో తొమ్మిది శాతం పెంచానే సంక్పం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కు నాటడం క్ష్యంగా పెట్టుకున్నారు. గత ఐదేళ్లలో అడవు లోప, బయటి ప్రదేశాల్లో కలిపి సుమారు 175 కోట్ల మొక్కు రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. వీటి సంరక్షణకు ప్రభుత్వం, అలాగే సమాజంలోని విభిన్న వర్గాు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రభుత్వా ధినేతగా కేసీయార్‌ పచ్చదనం సంక్పం రోజు రోజుకూ మరింత ధృడమౌతోంది. పట్టుపడితే సాధించేదాకా విడువడు అని ఉద్యమకాం నుంచే పేరొందిన కేసీయార్‌ చెట్లు, అడవు రక్షణ కోసం కూడా అంతే పట్టుదతో
ఉన్నారు. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో అంటూ అడవును రక్షిద్దాం- కొత్తగా పెంచుకుందామనే నినాదం ఇచ్చారు. అక్కడితో ఆగిపోకుండా అవకాశం వచ్చిన ప్రతీసారీ పర్యావరణం గురించి, మొక్కు ఎందుకు నాటాలి, వాటిని ఎందుకు రక్షించాలి, వాటి అవసరం ఏమిటన్న విషయాన్ని చాలా చక్కగా అందరి మదిలో మొక్కల్లా నాటుతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యనిర్వాహకులైన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ మొదు, అసెంబ్లీతో సహా అది ఏ మీటింగ్‌ అయినా సరే హరితహారాన్ని ప్రస్తావిస్తున్నారు, చివరకు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతు, కార్యకర్త సమావేశంలోనూ పల్లెప్రగతిలో పచ్చదనం, పరిశుభ్రతను నొక్కి చెబుతున్నారు. ఇంటికి ఆరు మొక్కు నాటాలి, తమ కుటుంబంలోని పెద్దు, ప్లి పేర్లు పెట్టి మరీ వాటిని సాదాలి అన్నారు. అంతేకాదు ఆయా గ్రామాల్లో పెట్టిన మొక్కు 85 శాతం బతకాల్సిందే, లేదంటే సర్పంచ్‌, కార్యదర్శిపై చర్యు తప్పవంటూ కొత్త పంచాయితీ రాజ్‌ చట్టమూ తెచ్చారు. మండ స్థాయి నుంచి కలెక్టర్‌ దాకా ప్రతీ అధికారి పచ్చదనం విషయంలో జవాబుదారీగా ఉండాంటూ, ఆకస్మిక తనిఖీతో మొక్క సంరక్షణలో వారి పనితీరు త్చేుతానంటూ హెచ్చరికూ ఇస్తున్నారు. ఒకటికి రెండుసార్లు మంత్రును, కలెక్టర్లను, రాష్ట్రస్థాయి అధికారును గజ్వేల్‌ అటవీ ప్రాంతానికి పంపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన గజ్వేల్‌ అటవీ ప్రాంతాన్ని గత ఐదేళ్లుగా సీఎం పట్టుపట్టి పునరుద్ధరింపచేశారు. సింగాయపల్లి అటవీ ప్రాంతం పునరుజ్జీవనం పొంది ఇప్పుడు చిక్కని వనంగా మారింది. రానున్న కొన్నేళ్లలో ఇది చిక్కని అడవిలా మారటం ఖాయమంటూ స్వయంగా కేసీయార్‌ ఆనందంగా చెప్పారు.

ఇలా మొక్కు నాటాలి, పెంచాలి, అడవిని రక్షించాలి అని చెప్పిన నాయకుడు మనకు వర్తమా న రాజకీయాల్లో అంతగా కనిపించలేదు. అంతర్జాతీయ, జాతీయ పర్యావరణ సమస్యను ప్రజ దృష్టికి తెస్తూ, కాుష్యం వ్ల పీల్చే గాలి పాడై, ఆక్సీజన్‌ను మనం కూడా కొనుక్కునే రోజు రావొద్దంటూ స్వయంగా మన సీ.ఎం కోరుతున్నారు. రాబోయే తరాకు కోట్ల రూపాయ ఆస్థికంటే మంచి నివాసయోగ్యమైన వాతావరణం ఇద్దామంటూ పిుపునిస్తున్నారు. ముఖ్యమంత్రి దృఢచిత్తం, అధికార యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం, పర్యావరణ దిశగా ప్రజను చైతన్యవంతం చేయటం ఇప్పడు ఫలితాను ఇస్తోంది. గత ఐదేళ్లుగా నాటిన మొక్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సత్ఫలితాను యిస్తున్నాయి. రహదారు వెంట పచ్చదనం శోభిస్తోంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిని చేపట్టిన ప్రభుత్వం గ్రామాు, పట్టణాల్లో పచ్చదనం పెంపు, పరిశుభ్రత చేపట్టు అంటోంది. చెట్టును, అడవిని ప్రేమిస్తున్న ముఖ్యమంత్రి అటవీ శాఖకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించుకోవానే ఉద్దేశ్యంతో అన్ని అటవీ ప్రాంతాకు ప్రభుత్వం ఫెన్సింగ్‌ వేస్తోంది. అలాగే ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కు నాటడంతో పాటు, సహజసిద్ధంగా అడవి పెరిగేలా పునరుజ్జీవన చర్యను కూడా ముమ్మరం చేసింది. పట్టణ ప్రాంత వాసుకు చక్కని ప్రకృతి అహ్లాదాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున అర్బన్‌ అటవీ పార్కును సీ.ఎం సూచనతో అటవీ శాఖ అభివృద్ధి చేస్తోంది.
ఇప్పుడు పల్లెప్రగతితో పాటు పట్టణ ప్రగతిని కూడా ప్రభుత్వం చేపట్టింది. పల్లెతో పాటు పట్టణాను కూడా పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచటమే ఈ కార్యక్రమా క్ష్యం. అంతేకాదు ఆయా ప్రాంతాకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాను అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో ఆక్రమణ నుంచి రక్షించి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దానిలో కొంత భాగాన్ని చక్కటి అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుగా అభివృద్ధి చేస్తారు. మిగతా ప్రాంతాన్ని కన్జర్వేషన్‌ జోన్‌గా సహజ అడవి అభివృద్ధి చెందేలా చర్యు తీసుకుంటారు. పార్కులోకి సందర్శకు వచ్చి వాకింగ్‌ చేసుకోవటంతో పాటు, పర్యావరణ హిత కార్యక్రమాు చేపట్టి అవగాహన కల్పిస్తారు.
చెట్లను పెంచేందుకు, అడవిని రక్షించేందుకు ఇంతగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పుట్టిన రోజంటే అడవికి పండగ, ప్రతీ చెట్టుకూ పుట్టిన రోజే. మనకు ఇన్ని సౌకర్యాు ఇచ్చిన సమాజానికి, మనమూ ఎంతో కొంత తిరిగిఇవ్వాల్సిందే. అది సామాజిక బాధ్యత. అందుకే మంత్రి కేటీయార్‌, రాజ్యసభ సభ్యు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ‘ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌’ అన్నారు. అందరమూ ఒక్క మొక్కైనా నాటుదాం.. సీ.ఎంతో పాటు చెట్టు పుట్టినరోజునూ పండగలా చేద్దాం.. అని ఇచ్చిన పిుపుకు రాష్ట్రమంతా కదిలింది. పండగలా జనం ముఖ్యమంత్రి పుట్టిన రోజును జరుపుకోవటంతో పాటు మొక్కు నాటారు. చీఫ్‌ సెక్రటరీ నుంచి మొదు అధికారయంత్రాంగం అంతా కదిలింది. పుట్టిన రోజు కాస్తా మొక్కు నాటే పండగ అయింది.

ఉత్సవాు, కేక్‌ కటింగ్‌ బదు మొక్క పంపిణీ జరిగింది. ఒక సామాజిక బాధ్యతను తాము అభిమానించే నేత పుట్టినరోజు సందర్భంగా నెరవేర్చిన ఆనందం అందరి కళ్లల్లో కనిపించింది. ఈ చర్యు అన్నీ కూడా తెంగాణకు హరితహారం కార్యక్రమానికి మరింత స్ఫూర్తిని ఇచ్చేవే, పర్యావరణ పరంగా పచ్చదనం ప్రాధాన్యతను ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం అము చేస్తోంది. ప్రతీ కార్యక్రమానికి దీనిని జోడిస్తోంది. ఇప్పుడు పౌయిగా మన బాధ్యత పెరుగుతుంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజా చైతన్యం తోడైతేనే ఏ కార్యమైనా మంచి ఫలితాు ఇస్తుంది. అందుకే ‘మనమూ పాల్గొన్నాం, ఓ మొక్క నాటాం.’ అని కాకుండా ఆ మొక్కను పెంచే బాధ్యత తీసుకోవాలి. ఉన్న అడవిని పరిరక్షించుకునే స్వచ్ఛంద సంక్పమూ ప్రతీ పౌరుడూ తీసుకోవాలి. అప్పుడే చెట్టు పండగ సార్థకం. ఆకు పచ్చని రాష్ట్రాన్ని స్వప్నిస్తున్న ముఖ్యమంత్రికి కూడా అంతకుమించిన సంతోషం కుగుతుంది.

Other Updates