రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే చెందేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి కేటి రామారావు తెలిపారు. ఏప్రిల్ 12న బేగంపేట క్యాంపు కార్యాలయంలో టెక్స్ టైల్, చేనేత శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తమ ప్రభుత్వం సమ్యై రాష్ట్ర చరిత్రలోనూ ఎన్నడు లేనంతగా ఈ బడ్జెట్‌లో చేనేత రంగానికి కేటాయింపులు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ప్రయోజనాలన్నీ చేనేత కార్మికులకే నేరుగా చేరేలా ఉండాల న్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని, ఆధార్, బయోమెట్రిక్ అధారంగా ఈ సబ్సిడీలు అందజేసే ప్రయత్నాలు చేయాలని అధికారులను మంత్రి అదేశించారు. చేనేత కార్మికులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీలు చేరేలా పాలసీలు తయారు చేయాలన్నారు.
గత సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అదేశాల మేరకు చేనేతల స్థితిగతులకు అద్దం పట్టేలా చేనేత డైరెక్టరీని తయారు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ నివేదికలో రాష్ట్రంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదక సామర్ధ్యం ఎంత అనే అంశాలతో కూడిన పూర్తి గణాంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు చేనేతలకు, పవర్ లూమ్, టెక్స్ టైల్స్ రంగాల పట్ల ప్రత్యేకమైన విధానాలుండాలని మంత్రి అధికారులను అదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న చేనేత మగ్గాల సర్వేలో 17000 చేనేత మగ్గాలున్నాయని. ఇప్పటికే 14,300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులను కాపాడుకోవ డమే తెలంగాణ ప్రభుత్వ చేనేత విధానం ప్రాథమిక లక్ష్యంగా ఉంటుంద న్నారు. చేనేత రంగంలో లాభదాయకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామన్నారు. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేకమైన సబ్సిడీలతో కూడిన రుణ సౌకర్యాన్ని కల్పించే ఆలోచన చేస్తున్నామన్నారు.
ఇక చేనేత మగ్గాల మీద ఏ ఏ రకాల వస్త్రాలను తయారు చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టు చీరలు, కాటన్, గ్రే క్లాత్ వంటి రకాలను ఎంత మంది నేస్తున్నారనే వివరాలుంటేనే వారికోసం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి కే.టీ. రామారావు తెలిపారు. చేనేతలకు సబ్సిడీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి అదేశించారు. తమ
ఉత్పత్తులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్ లోనూ అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామన్నారు.
ప్రభుత్వమే మాస్టర్ వీవర్ పాత్రను పోషించాలని మంత్రి అన్నారు. దీని ద్వారా చిన్న చేనేత కార్మికులకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు యార్న్ పైన 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కాటన్, పాలియస్టర్, లెనిన్ సిల్క్, వూల్ వివిధ రకాల యార్న్ ప్రొక్యూర్‌మెంట్ ఎలా జరుగుతుందో, ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో తీసుకురావాల్సిన మార్పులను మంత్రి చర్చించారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యార్న్ డిపోల వివరాలను తెలుసుకున్నారు. చేనేత శాఖనే సొంత డిపోలు ఏర్పాటు చేయాలని కోరారు. యార్న్ నేరుగా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తే ఉండే ప్రయోజనాల మీద ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రితోపాటు పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టెక్స్‌టైల్ డైరెక్టర్ శైలజరామయ్యర్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.