శ్రీరంగాచార్య

వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం ఆనాటినుండి ఈనాటి వరకు తానే దేశము. దేశమే తానై భారతదేశ చైతన్య ప్రతీకగా సుస్థిరంగా నిలిచింది వాల్మీకి శ్రీరామచంద్రుణ్ణి-సముద్ర ఇన గాంభీర్యే ధైర్యేణ హిమవానివ అని చెప్పినాడు. ఇది కన్యాకుమారి నుండి గౌరీశంకరశృంగందాకా వ్యాపించియున్న మన పురాణ దేశానికి ప్రతీకయైనవాక్కు. అందు వేల సంవత్సరాల నుండి మన శ్రీరామాయణం-నిత్య నూతనంగా రాణిస్తున్నది.

వేదం మనకు ధర్మాన్ని బోధన చేస్తే వేద స్వరూపమైన రామాయణం లోకానికి నీతిని, ధర్మాన్ని బోధిస్తున్నది. అందు వివిధ దేశాలవారు వివిధ భాషల్లో, వివిధ ప్రక్రియల్లో శ్రీరామాయణ కథను రచించటం దాని గొప్పతనానికొక నిదర్శనం. ఏ మతానికో ఏ ధర్మానికో సంబంధం లేని మ¬న్నత రచనయైన రామాయణాన్ని మన తెలుగు కవులు ూడా వివిధ కాలాల్లో వివిధ రూపాలుగా రచించి.. సంతృప్తి చెంది – పాఠక జనులంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు.

ముఖ్యంగా మన తెలంగాణంలో శ్రీరామాయణ వ్యాఖ్యలే గాకుండా వందలకొద్ది అనువాదాలు వచ్చి – కొన్ని వ్యాప్తి చెందినా – ఇంన్నోె నామ మాత్రావశేషాలుగాను.. మరెన్నో నష్టసాహిత్యంలోను చేరి తెలుగువారి నష్టసాహిత్య జాతకాన్ని నిరూపిస్తున్నాయి. మనందరికీ భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం.. చిరుతల రామాయణం.. మరికొన్ని రామాయణాలే తెల్సు కాని – ఇంకా మనం తెలుసుకోవలసిన విశేషమైన రామాయణ అనువాద రచనలు ఎన్నో వున్నాయి. ఆ విధమైన వాటిలో ఒక విశేషమైన తాళపత్ర గ్రంథం జనకసుతాభ్యుదయం – దీనిని క్రీ.శ. 1780 ప్రాంతంలో వున్న ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య కవి రచించినాడు. నల్లగొండ జిల్లా అహల్యా మండలానికి చెందిన అనుముల ఈయన నివాస గ్రామం. కవి తన రచనల్లో షోడశ మహాగ్రంథ బంధురాలంకార నిర్మాణ ధురీణుడను అని తెల్పుకున్న ఈయన కృతుల్లో దాదాపు 10 గ్రంథాలు లభిస్తున్నవి. మిగతావి నామమాత్రావశేషాలు. దొరికిన వాటిలో 5 గ్రంథాలు ముద్రణమైనాయి.

ప్రస్తుత రచనతో బాటు కవి ఇతర కృతులన్నీ సిరిసెనగండ్ల నృసింహస్వామి అంకితమీయబడినవి. వాల్మీకి శ్రీరామాయణానికి సీతాచరిత్రమని పేరు పెట్టినందున (సీతాయాశ్చరితం మహత్‌గదా) తనకృతికి జనక సుతాభ్యుదయమని పేరుపెట్టినాడు (దీని విదేహరాజ కన్యకాభ్యుదయం అని మరియొక్క పేరున్నది) కవి దీనిని 6ఆశ్వాసాలు 2788 గద్యపద్యాలతో రచించినాడు. భాస్కర రామాయణం తర్వాత మన ప్రాంతంలో వచ్చిన రామకథా గ్రంథాల్లో ఇదే పెద్దది కావచ్చు. గ్రంథకర్త దీనినేగాక మరికొన్ని రచనలను ూడా అభ్యుదయ నామాంకితం చేసినాడు. శ్రీరామానుజాభ్యుదయం నృకంఠీర వాభ్యుదయం, మొదలైనవి ప్రాచీన సాహిత్యంలో ప్రత్యేక వ్యక్తుల జీవిత చరిత్రలు అభ్యుదయ నామాంకితాలున్నాయి. ఉదా:- రామాభ్యు దయం మొ|| దక్షిణాంధ్రయుగ సాహిత్యలో అభ్యుదయ రచనలు చాలా వచ్చినవి. ఇంకా వేదాంతదేశికులవారి వరదాభ్యుదయం. వంటిరచనల ప్రభావంకావచ్చు. వెంకటనరసింహాచార్య కవి అభ్యుదయనామ ప్రీతిగల్గి తన రచనల్లో కొన్నింటిని అభ్యుదయ రచనలుగా సిద్ధంచేసినాడు. ఆపద్దతి రచనల్లో జనక సుతాభ్యుదయం మొదటిది.

కవి ఈ ప్రబంధాన్ని తన 13 సంవత్సరాల ప్రాయంలో రచించినట్లు కృత్యాదిలోని తనరచనల జాబితాలో తెల్పినాడు. తానీ గ్రంథాన్ని శ్రీరామునకు మానుషలీలలు చెందనట్లు సాక్షాద్విష్ణువేయను సిద్దాంత స్థాపన కొరకు రచించుచున్నానని

మహిజకురాఘవేంద్రులకు మానుషలీలలు చెందకుండ నే

విహితములైన శాస్త్రముల వేమరు చూచియు సమ్మ తంబుగా

నహితులతోటి వాదులకు నైయటుభక్తిని చెప్పలేదు ని

మ్మహిగల యార్యశేఖరులు మానసమందున మొచ్చ చెప్పెదన్‌

అనితెల్పుకున్నాడు. అంతేగాక తాను

అఖిల రామాయణార్థంబు లన్నియేక

కృతినిఒనగూడునట్లుగా కృతిరచింతు

సకల సత్కవిదేశికుల్‌ స్వాంతమందు

నెగ్లులెన్నకక్షమియింపు డెలమినన్ను

అని తెల్పుటం. అప్పకవీయంలోని ఇది చదివిన పిమ్మట మరియెదియేనియుచదువు బుద్ధి ఎలా పొడమున్‌. పదపడి లక్షణ గ్రంథములు వెదకివెదకి సారమొల్ల వివరింపంగా- పద్యం గుర్తుకు వస్తుంది.

తన జనకసుతాభ్యుదయమనే రామకథకొరకు పరిశోధించిన రచనలు నిట్లా తెల్పినాడు.

వరవాల్మీకి వశిష్ఠనామన శుక బ్రహ్మాండవారాహ భా

స్కరయాధ్యాత్మ నృసింహనారద యగస్త్యస్కాందసత్యేక శ్రీ

హరిపద్మోత్తర తార్‌క్ష్యతార శశియాజ్ఞేయాది పౌరాణముల్‌

పరిశోధించిరచింతు రామకథనే ప్రఖ్యాతిగానిద్ధరన్‌

ఇది ఆచార్యులనారి ఆనాటి పరిశోధన మారుమూలపల్లె యందున్నకవి సాహిత్య శోధన, రచన ఆశ్చర్యకరాలే గదా! బహు గ్రంథ పరిశీలనతో రచించిన దీనియందు వాల్మీయే శ్లోకాలేగాక ఆధ్యాత్మరామాయణాదుల్లోని శ్లోకాలకు అనువాదాలున్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యవిషయం – శ్రీరామజననము నుండి అవతారపరిసమాప్తి వరకు జరిగిన ముఖ్యమైన సన్నివేశాల తేదీలను (సంవత్సర, మాస, తిథి వారాలు) తెల్పటం, (ఈ పద్ధతి ఆధునికుల్లో వావిలికొలను వారి ‘మందరం’లో కలదు)

రచనలో విశేషఛందః ప్రయోగం, చిత్రకవిత, వివిధాలైన వర్ణనలు ఆధ్బుతంగావున్నాయి. ప్రతి పద్దతీ కవి ప్రబంధ రచనా ప్రౌఢిమను వ్యక్తపరుస్తుంది. ఈయన ఇతరకృతులకన్న ఇదియే బహువిధాలా రూపంలోను, కవితా రూపంలోను ప్రథమ స్థానంలో వుంటుంది. తనది రామకథయైనా ప్రబంధవాసనవదలుకోలేని కవి శ్లేషలో వారసతుల నిట్లా వర్ణిస్తున్నారు.

వలరాజగురుజన వర్థితసద్ధర్మ

వర్తన తమకుల వర్తనముగ

కొతుకక శ్రీధరుకోరిభజించుటే

యనిశంబుతమ జిహ్వకాస్పద ముగ

పంచాయుధాంచి తలాంఛనమ్ములెతమ

భుజుయుగ్మములల్లె భూషణముగ

భగవదనుగ్రహ ప్రాపితార్థమెతమకు

యోగ్యమౌసోషక భోగ్యములుగ

మోదమునుకర్పురాంబకమూల్యముననె

ధ్యానమెప్పుడు భుజగశయానునందె

గానియితరమ్ము లెరుగమిక్కాయమునను

ననుచు విహరింతు రవ్వేటి వారసతులు

ఇది భగవత్పరమేగాక వారకాంతా రీతిని చక్కగా తెల్పుచున్నది. శ్రీమహాభారతం లోని ఒకటిగొనిరెంట నిశ్చలయుక్తి చేర్చి ఇత్యాది పద్యప్రభావంతో సంఖ్యాపరంగా శ్రీనారా యణవైభవాన్ని, సంఖ్యాపరంగా నారాయణమంత్ర వైవిధ్యాన్ని ఇట్లా తెల్పినాడు.

ఆరింటిని వహించి మూడింటి వర్జించి

యారింటికెక్కుడైయుతిశయించి

యైదింటహితుడునై యైదింటికహితుడై

యైదింటీక్కుెడై యర్హమొంటి

నాల్గింటిలో మెల్గినాల్గింటికినిహెచ్చి

నాల్గింటనొసగెటి నాధుడగును

మూటినిసృజియించి మూటనువర్తించి

మూటికతీతుడై ముదముతోడ

రెంటినందకనంటి వేరొంటియుగుచు

నలిరుచుండెడు నారాయణఖ్యమహిమ

వినగవేడుకబొడ మెమామనములందు

శ్రాతనవసేత సద్గుణోపేత సూత,

వీటి వివరణ విస్తృతమగునని తెల్పలేదు. ఈ పద్ధతి పద్యాలు మరికొన్నియున్నాయి. ఇది కవి లోకజ్ఞ చిత్రకవితారతి. ఇంతచక్కని రచన సూర్యాలోక భాగ్యానికి నోచుకుంటే మన తెలంగాణలో వందల సంవత్సరాలనాటి శ్రీరామకథా వైభవ ప్రౌఢ ప్రబంధరీతి వ్యక్తం కాగలదని ఆశ.

చరితం రఘునాధస్వ ఇత్యాధి శ్లోకానికి కవి ఈ అనువాదం…

సతతము రాముని చరితము

క్షితిలో ననుదినము నరులు శేముషులందుం

గొతుకక నొక్కొక వర్ణము

మతిదలచిన బాతకములు

మానుటయరుదే!

Other Updates