వి. ప్రకాశ్‌

tsmagazine
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసన సభకు జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించింది. డిసెంబర్‌ 13న ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్‌. ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

2014 జూన్‌ 2న తెరాస ఆధ్వర్యంలో ఏర్పడిన గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మూడు నెలల నాలుగు రోజుల పాలనానంతరం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. శాసనసభను సెప్టెంబర్‌ 6న రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. సరిగ్గా మూడు నెలల తర్వాత డిసెంబర్‌ 7న ఎన్నికలు నిర్వహించారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో 88 స్థానాలను తెరాస గెలిచింది. సుమారు నాల్గింట మూడు వంతుల మెజారిటీని సాధించింది. గత ఎన్నికల్లో తెరాసకు లభించినవి 63 స్థానాలు మాత్రమే.

రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీగా వున్న కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ తెలుగుదేశం, సిపిఐ, ప్రొ|| కోదండరాం అధ్యక్షతన ఏర్పడిన తెలంగాణ జన సమితి పార్టీల పొత్తుతో గెలిచింది కేవలం 19 స్థానాలు మాత్రమే. గత శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డితో బాటు ఆ పార్టీ సీనియర్‌ నాయకులు డి.కె. అరుణ, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు, మాజీ మంత్రులు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, నాగం జనార్ధన రెడ్డి, మల్లు రవి, జీవన్‌ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ మరెందరో ప్రముఖ నేతలను ప్రజలు ఓడించారు.

గత ఎన్నికల్లో బిజెపి, తెలుగు దేశం కలిసి పోటీ చేయగా టిడిపికి 15, బిజెపికి 5 స్థానాలు లభించాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి కేవలం గోషామహల్‌ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకోగా మిగిలిన నాలుగు స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మూడో స్థానానికి పోగా, శాసనసభా పక్షం నేత కిషన్‌ రెడ్డి, అపజయం పాలయ్యారు. కాంగ్రెస్‌, టిజెఎస్‌, సిపిఐ తో కలిసి పోటీ చేసిన తెలుగు దేశం పార్టీకి ఈ ఎన్నికల్లో లభించినవి కేవలం రెండు స్థానాలు మాత్రమే.

బంగారు తెలంగాణ లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించిది. భూగర్భ జలాలపై 80 శాతానికిపైగా సాగుభూమి ఆధారపడిన తెలంగాణలో కోటి ఎకరాలకు పంట కాల్వల ద్వారా కృష్ణా, గోదావరి జలాలనందించి రైతులను ఆత్మహత్యల నుండి, కష్టాల నుండి బయట పడేయాలని, ఆదుకోవాలని ముఖ్యమంత్రి సంకల్పించి ‘మహా’ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి పలు ప్రాజెక్టులను ప్రారంభించి రాత్రింబవళ్ళు పనులు జరిపిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో వున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారు. గత ఐదారు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గొలుసు చెరువుల వ్యవస్థను పునరుద్ధరిస్తూ ‘మిషన్‌ కాకతీయ’ చేపట్టారు. వర్షాలు కురవక పోయినా కృష్ణా, గోదావరి జలాలను పలు చెరువులకు మళ్ళిస్తున్నారు. జనగామ, వనపర్తి తదితర నియోజక వర్గాల్లో తెరాస అభ్యర్థులు భారీ మెజారీటీతో గెలవడానికి ప్రధాన కారణం చెరువులు నింపడమే.

తెలంగాణ రాష్ట్రం ఇస్తే కరెంట్‌ తీగల్లో విద్యుత్‌ రాదు. కేవలం బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయని, రాష్ట్రం అంధకారమవుతుందనీ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రుల మాటలను, పరిహాసాలను ఛాలెంజ్‌గా తీసుకున్న కెసిఆర్‌ తాను ముఖ్యమంత్రి కాగానే నిరంతర విద్యుత్తును అందించడానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి పలు చర్యలు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన ప్రభాకర్‌ రావుని సిఎండిగా జెన్‌కో, ట్రాన్స్‌కో బాధ్యతలు అప్పగించి తన మార్గదర్శకత్వంలో దేశంలోనే తొలిసారి తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించడంలో సఫలీకృతులైనారు. రైతులు, పారిశ్రామిక వేత్తలు 24 గంటల నిరంతర విద్యుత్‌ వల్ల ఆర్థికంగా లాభపడ్డారు. ‘పవర్‌ కట్‌’ సమస్యతొలగి పోవడం వలన గృహిణులు సంతోషించారు. ఆరు వందలకు పైగా ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మెరుగైన దవాఖానాల సౌకర్యాలు, కెసిఆర్‌ కిట్‌ వంటివి కూడా ప్రజలు తెరాస వైపు ఆకర్షితులు కావడానికి దోహదపడ్డాయి.

తెరాస విజయానికి కారణాలు:

ఈ ఎన్నికల్లో తెరాస భారీ విజయాన్ని సాధిస్తుందని శాసన సభ రద్దు చేసిననాడే ఆ పార్టీ

అధ్యక్షులు కెసిఆర్‌ ప్రకటించారు. ఆయనతోబాటు కెటిఆర్‌, హరీష్‌ రావు మరెందరో తెరాస నేతలు చివరిదాకా అదే విశ్వాసాన్ని తమ ప్రసంగాల్లో వ్యక్తపరిచారు. తెరాస భారీ విజయానికి

ఏ ఒక్క అంశాన్నో కారణంగా చూపలేము. పలు కారణాలున్నాయి.

గత ప్రభుత్వ పథకాలు :

దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. 2014 జూన్‌ 2న సిఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రసంగిస్తూ ‘సంక్షేమం – అభివృద్ధి’ రెండు కళ్ళుగా తమ పాలన ఉంటుందని కెసిఆర్‌ అన్నారు. గత నాలుగేళ్ళు అదే పనిలో ఆయన పూర్తి సమయాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచే పలు పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. పదమూడేళ్ళ తెలంగాణా ఉద్యమ ప్రస్తానంలో తెలంగాణ వ్యాప్తంగా పలుమార్లు పర్యటించిన సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు తాను గమనించిన సమస్యలను గుర్తుంచుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టగానే పలు పథకాలను కెసిఆర్‌ రూపొందించారు. ప్రజలు అడగకుండానే ఈ పథకాల ప్రయోజనాలు వారికి లభించాయి. వీటిలో రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పెంపకం మొదలైన సంక్షేమ, ఉపాధి పథకాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను కలిసిన వారికి పథకాల ప్రభావం ఎంత బలంగా వారిపై ఉందో సులభంగానే అర్థమైంది. మహిళలు, వృద్ధులు, ది వ్యాంగులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడం ఈ పథకాల ప్రభావమే.

అభివృద్ధి కార్యక్రమాలు :

tsmagazine
బంగారు తెలంగాణ లక్ష్యంతో గత నాలుగు సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించిది. భూగర్భ జలాలపై 80 శాతానికిపైగా సాగుభూమి ఆధారపడిన తెలంగాణలో కోటి ఎకరాలకు పంట కాల్వల ద్వారా కృష్ణా, గోదావరి జలాలనందించి రైతులను ఆత్మహత్యల నుండి, కష్టాల నుండి బయట పడేయాలని, ఆదుకోవాలని ముఖ్యమంత్రి సంకల్పించి ‘మహా’ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి పలు ప్రాజెక్టులను ప్రారంభించి రాత్రింబవళ్ళు పనులు జరిపిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో వున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారు. గత ఐదారు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గొలుసు చెరువుల వ్యవస్థను పునరుద్ధరిస్తూ ‘మిషన్‌ కాకతీయ’ చేపట్టారు. వర్షాలు కురవక పోయినా కృష్ణా, గోదావరి జలాలను పలు చెరువులకు మళ్ళిస్తున్నారు. జనగామ, వనపర్తి తదితర నియోజక వర్గాల్లో తెరాస అభ్యర్థులు భారీ మెజారీటీతో గెలవడానికి ప్రధాన కారణం చెరువులు నింపడమే.

తెలంగాణ రాష్ట్రం ఇస్తే కరెంట్‌ తీగల్లో విద్యుత్‌ రాదు. కేవలం బట్టలు ఆరేసుకోవడానికే పనికి వస్తాయని, రాష్ట్రం అంధకారమవుతుందనీ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రుల మాటలను, పరిహాసాలను ఛాలెంజ్‌గా తీసుకున్న కెసిఆర్‌ తాను ముఖ్యమంత్రి కాగానే నిరంతర విద్యుత్తును అందించడానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి పలు చర్యలు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన ప్రభాకర్‌ రావుని సిఎండిగా జెన్‌కో, ట్రాన్స్‌కో బాధ్యతలు అప్పగించి తన మార్గదర్శకత్వంలో దేశంలోనే తొలిసారి తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందించడంలో సఫలీకృతులైనారు. రైతులు, పారిశ్రామిక వేత్తలు 24 గంటల నిరంతర విద్యుత్‌ వల్ల ఆర్థికంగా లాభపడ్డారు. ‘పవర్‌ కట్‌’ సమస్యతొలగి పోవడం వలన గృహిణులు సంతోషించారు. ఆరు వందలకు పైగా ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మెరుగైన దవాఖానాల సౌకర్యాలు, కెసిఆర్‌ కిట్‌ వంటివి కూడా ప్రజలు తెరాస వైపు ఆకర్షితులు కావడానికి దోహదపడ్డాయి.

కెసిఆర్‌ నాయకత్వ ప్రతిభ

గ్రామాలకు వెళ్ళి ఎవరికి ఓటేస్తున్నారంటే గతంలో మౌనమే సమాధానమయ్యేది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని నియోజక వర్గాలకు చెందిన రైతు కూలీలను ప్రశ్నిస్తు కెసిఆర్‌కు, కారు గుర్తుకే వేస్తామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. వారంతా కెసిఆర్‌ ప్రతిభకు ఆకర్షితులై ఓట్లు వేసారని అనుకోవచ్చు.

తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించక ముందు కెసిఆర్‌ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సిద్ధిపేట, మెదక్‌ జిల్లా ప్రజలకు తెలిసినంతగా మిగతా తెలంగాణ ప్రజలకు వారి గురించి అంతగా తెలియదు. తెరాస ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజలతా కెసిఆర్‌ను అభిమానించారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని విశ్వసించారు. ఆయన ఒక్క పిలుపిస్తే యావత్తు తెలంగాణ ప్రజలు ఆందోళనల్లో, బంద్‌ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనేవారు. ప్రజల గుండెళ్లో హత్తుకునే విధంగా వారిలో ఆవేశం రెచ్చగొట్టేలా మాట్లాడటంలో మరెవ్వరూ కెసిఆర్‌కు సాటిరారు. ప్రజలను ఆయన స్వంతం చేసుకున్నారు. ప్రజలు ఆయనను స్వంతం చేసుకున్నారు. తెలంగా ణ కోసం ఆమరణ నిరాహార దీక్షచేసి ప్రతికూలుర, ఉద్యమకారుల మనస్సులను కూడా గెలిచారు కెసిఆర్‌.గత ఆరేడు శతాబ్దాలుగా తెలంగాణను పరిపాలించిన గోల్కొండ నవాబుల దగ్గర నుండి సమైక్య పాలకుల దాకా ఎవ్వరినీ తెలంగాణ ప్రజలు స్వంతం చేసుకోలేదు. స్వపరిపాలనగా విశ్వసించలేదు. వారి పాలనలో ప్రజలెన్నడూ ప్రశాంతంగా లేరు.

బూర్గుల తెలంగాణ ప్రాంతీయుడే అయినా విశాలాంధ్ర – తెలంగాణ ఉద్యమాల కారణంగా ప్రజలు ఆందోళనతోనే గడిపారు.

గత ఏడు శతాబ్దాల్లో తొలిసారి తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ పాలనని తమ స్వపరిపాలనగా భావించారు. సుఖశాంతులతో బ్రతికారు. గత నాలుగు దశాబ్దాదలుగా తెలంగాణ పల్లెల్లో ఎక్కడ చూసినా పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ళు, ఎన్‌కౌంటర్లు, రాజ్యహింస – ప్రతి హింస, నెత్తురు మడుగుల్లో యువతీయువకులు మరోప్రక్క పోలీసులు, రాజకీయ అవసరాలకోసం సృష్టించబడ్డ మత వైషమ్యాలు, పాత నగరంలో కత్తుల కోలాటాలు, ఉగ్రవాదుల బాంబుదాడులు, అమాయకుల మరణాలు… ఇవేవీ గత నాలుగున్నరేళ్ళ పాలనలో తెలంగాణ గడ్డపై మునుపటిలా జరగలేదు.

ఉద్యమ కాలంలో, పరిపాలనలో కెసిఆర్‌ వ్యక్తిత్వం, నాయత్వ ప్రతిభ ఎవరెస్ట్‌ పర్వతమంత మహోన్నతంగా ఎదిగింది. మరో ప్రక్క దివిటీతో వెదికినా కెసిఆర్‌కు ధీటైన మరో నేత ప్రతిపక్షంలో ప్రజలకు కనిపించలేదు.

మహా కూటమి – చంద్రబాబు ప్రవేశం

ముందస్తు ఎన్నికలకు తెరాస సిద్ధపడ్డప్పుడు కాంగ్రెస్‌ – తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటాయనే అంచనాలు ఎవరికీ లేవు. ఎన్నికల ప్రచారంలో అధికారంలో వున్న తెరాస తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి – సంక్షేమ పథకాల గురించే దృష్టి పెడుతుందని, ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై, తాము అధికారంలోకి వస్తే చేయాలనుకుంటున్న మేనిఫెస్టో అంశాలపై ప్రచారం చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ ఆశయాలకు, ఆవిర్భావ లక్ష్యాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో జతకలవడానికి సిద్ధపడ్డారు. ఈ పరిణామం కొంత మేరకు ఎన్నికల ప్రచార దిశను మార్చింది.

చంద్రబాబు తమ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకునే దిశలో ఆ పార్టీ సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలో దించడం పై దృష్టి పెట్టకుండా కేవలం కెసిఆర్‌ను గద్దె దించే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో సీట్ల పంపకం చేసుకోవడం, ఇదే విషయాన్ని కోదండరాంతో సహా మహాకూటమి నేతలు పలుమార్లు తమ ప్రసంగాల్లో ప్రధాన అంశంగా పేర్కొనడం తెలిసిందే.
tsmagazine

చంద్రబాబు ప్రవేశంతో తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రజల్లో ముఖ్యంగా యువతలో, ఉద్యోగుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. గత నాలుగేళ్ళుగా చంద్రబాబు, కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రాజెక్టులనాపడానికి కోర్టులలో వేసిన కేసులు, చేసిన కుట్రలు ప్రజలు మరువలేదు. ఈ కూటమి అధికారంలోకి వస్తే స్టీరింగ్‌ చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని, కెసిఆఆర్‌ తలపెట్టిన కోటి ఎకరాలకు సాగునీరందించే స్వప్నం సాకారం కాదని అర్థం చేసుకున్న తెలంగాణ జనం 88 స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించారు.

మితిమీరిన అహంభావం, ‘సన్‌’ స్ట్రోకులు, వెన్నుపోట్లు :

ఒక్క మజ్లీస్‌ పార్టీలో తప్ప దాదాపు అన్ని పార్టీల్లో కొందరు ప్రముఖ నేతలు ఓడిపోయారు ఇక్కడ ఆ నేతల పేర్లు ప్రస్తావించడం సభ్యత కాదు. కానీ వీరిలో కొందరి వ్యక్త్తిత్వం ప్రజలకు నచ్చలేదు. మరికొందరి పుత్రరత్నాల అవినీతి, ఒంటెత్తు పోకడలు తండ్రుల ఓటమికి కారణమైనాయి. తమ స్వంత పార్టీలలోని సహచర అభ్యర్థుల ఓటమికి కూడా కొందరు నేతలు కృషి చేశారని వార్తలు వెలువడ్డాయి. వాటిని నిరాధారమని కొట్టి పారేయలేము.ఎప్పుడూ ఏదో ఒక ప్రధాన పార్టీ పొత్తుతో గెలిచే కొన్ని పార్టీల అగ్రశేణి నాయకులకు ఓటమి పాలవడం ద్వారా తమ పలుకుబడెంతో తెలిసి వచ్చింది. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు సభ్యతా సంస్కారాలను విడిచి ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు, వాడిన భాషను ప్రజలు అసహ్యించుకున్నారు.

నీచపు ఎత్తుగడలు :

ప్రక్క రాష్ట్రం నుండి వచ్చిన కొందరు ఇంటలిజెన్స్‌ అధికారులు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు చిక్కడంతో చంద్రబాబు కుట్రలు బట్టబయలైనాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలకు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికే చంద్రబాబు ఈ ఆంధ్ర ప్రాంత పోలీసులను వినియోగించాడనేది స్పష్టం. గతంలో మునుపెన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో ‘డబ్బు’ ప్రభావం కనిపించింది. సుమారు 145 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు ఎన్నికల కమీషన్‌ ధృవీకరించింది. లగడపాటి రాజగోపాల్‌ ‘సర్వే’లు ఒక ప్రహసనంగా మారినవి. ఆయన సర్వేలు నిజమవుతాయని (గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అనుభవాల ఆధారంగా) ప్రజలు నమ్మేవారు. తెలంగాణలో లగడపాటి నిజస్వరూపం బట్టబయలైంది. ఆయన అంచనాలన్నీ తలక్రిందులైనాయి. ఆంధ్రలో బెట్టింగులను దృష్టిలో పెట్టుకుని ‘లగడపాటి’ అబద్దపు సర్వేలు ప్రకటించారని ప్రజలిప్పుడు భావిస్తున్నారు.
tsmagazine

చరిత్రాత్మక విజయం

ఏ అధికార పార్టీకైనా ఎంతో కొంత ప్రతికూల పరిస్థితి ఎన్నికల్లో వుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన తొలి ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ఆశలు చాలా ఎక్కువగానే ఉండేది. ఏ ప్రభుత్వానికైనా ఐదు దశాబ్దాల విధ్వంసం నుండి తేరుకొని అన్ని రంగాలను పునర్నిర్మాణం చేయడం నాలుగేళ్ళలో అయ్యే పని కాదనేది స్పష్టం. కానీ కెసిఆర్‌ అనితర సాధ్యమైన పద్ధతిలో తన పాలన సాగించి ప్రజల మనస్సులను గెలిచారు. నెగెటివ్‌ ఓటు పెరగకుండా జాగ్రత్తపడ్డారు. పాజిటివ్‌ ఓట్ల వరద పారించడం సులభం కాదు. తన పథకాలైన రైతుబంధు, రైతు బీమా వంటి వాటికి ఐక్యరాజ్య సమితిచే ప్రశంసలందుకున్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, 24 గంటల నిరంతర విద్యుత్‌ వంటి పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ప్రధాని, రాష్ట్రపతి, నీతి ఆయోగ్‌చే ప్రశంసలు పొందాయి.

తెరాస భారీ విజయానికి మరెన్నో కారణాలు వున్నా ప్రముఖంగా కన్పించేవి ప్రస్తావించడం జరిగింది. ఇదొక చారిత్రిక విజయం. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ఆదరాభిమానాలతో మరింత జనరంజకపాలనను అందిస్తుందని ఆశించుదాం.

Other Updates