జయము ఘటించుగాక! జన జాగృతి జేసిన ముఖ్యమంత్రికిన్‌
నియమము వీడకన్‌, ప్రభుత నిర్మలమైన సమాజసేవకై
పయనము సేయుచున్నదిట పాల్గొనజేయగ గ్రామవాసులన్‌
రయమున వృద్ధి చెందుటకు రాగలరోజులు రాచబాటలౌ!

నీరు-నియామకమ్ములను నిర్దయతో మహినాంధ్రపాలకుల్‌
దారుణమైనరీతి నిధి దారిమరల్చిన పక్షపాతమున్‌
ధీరుడు చంద్రశేఖరుడు ధీనిధి లెక్కలు తేల్చ, ప్రశ్నయై
వారు జవాబు లేకనట వాజముఖమ్ములు వేసిరెల్లరున్‌ !

ఆంధ్ర నాయకవాణి – ఆవమానముల బాణి
తెలగాణ నాయకుల్‌ ద్రిప్పికొట్టు
తెలివి లేదని మన తెలివినెంచినవారు
తెరమరుగైనారు దెలియకుండ
వందతప్పులు విూరె – వదనమ్ములున్‌ మారె
తెలగాణ సంకెళ్ళు తెగిపడంగ
విజయ విలాసమై వీక్షించనొకవైపు
బహుళార్థసాధక బాట వెదుక

చంద్రశేఖరార్య! సాహసమ్మన విూది
పట్టు వీడనట్టి గట్టి మనసు
న్యాయ ధర్మదీక్ష – నాయకత్వమువిూది
ఫలితమిచ్చుచుండె ప్రజలకిపుడు !

శ్రీమహనీయమై, విబుధ సేవ్యమునై, సుకళావిలాసమై,
రామకథా సుధారస విరాజితమైన సభాస్థలంబులై,
ప్రేమ మయంబునై, మదిని ప్రీతిని బంచగ ప్రాణి కోటికిన్‌
కామితముల్‌ వెలార్చు తెలగాణము వర్ధిలుగాక నిత్యమున్‌ !

చిరయశ చంద్రశేఖర, విశిష్ట గుణాకర, ముఖ్యమంత్రి, విూ
మరువగలేని సచ్చరిత మానవజాతికి మాననీయమై
వరలు ప్రజానురంజకము భవ్య మ¬జ్వలమై వెలుంగుచున్‌
నరయగ సూర్యచంద్రులు మహామహులై
నడయాడు చందమున్‌

– జీడికంటి శ్రీనివాస మూర్తి

Other Updates