తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు, కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్న రాష్ట్రప్రభుత్వం కొత్తగా జలవనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థకు డైరెక్టర్, ఛైర్మన్‌గా వి.ప్రకాశ్‌ను నియ మించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ళ పాటు కొనసాగుతారు. ఈ మేరకు ఫిబ్రవరి 23న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 100 కోట్ల రూపాయల క్యాపిటల్ కార్పస్ నిధితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తయ్యేలా కృషిచేయడం తెలం గాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ప్రధాన బాధ్యత. తన అభిరుచిని గుర్తించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనకు ఈ బాధ్యతలు అప్పగించారని వి. ప్రకాశ్ తెలిపారు. ముఖ్యమంత్రికి ఆయన కృత జ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతలలో వి.ప్రకాశ్ ఒకరని, నీళ్ళ విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొ న్నారు. సాగునీటి రంగంపై విశేష అవగాహన ఉన్నందుకే ఆయనను జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించామని సి.ఎం తెలిపారు. ఆయనకు సి.ఎం అభినందనలు తెలుపుతూ, నూతన బాధ్య తలు విజయవంతంగా నిర్వర్తించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు
హోం
»