ఓటర్ల జాబితా నిర్వహణ మెరుగుపరచడానికి ,పౌరులకు సకాలంలో ప్రామాణిక సేవలను అందివ్వాలనేది జు=వీూలోని ఐటి ప్రతిపాదనల ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25, 2015న వారి వెబ్‌సైట్‌లో పౌరులకోసం జాతీయ ఓటరు సర్వీస్ పోర్టల్(చీహూూ)ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో జాతీయస్థాయిలో ప్రవేశపెట్టిన ఈ సేవలవల్ల ఎన్నికల సంఘంలో పౌరులు నేరుగా సంప్రదింపులుజరిపే అవకాశం లభించినట్టయింది. అలాగే జాతీయ స్థాయిలో వారికిసమాచారం సులభంగా పొందే సౌలభ్యం కూడా వచ్చింది. జాతీయ ఈ-సేవలను స్థూలంగా రెండు పెద్ద తరగతులుగా వర్గీకరించారు. అవి (ఎ) పౌరులకు సేవలు (బి) ఎన్నికల పనుల్లో నిమగ్నమైన అధికారులకు పరిశీలన, విశ్లేషణ, నివేదన అవకాశా లుంటాయి. ఉమ్మడి పోర్టల్ ద్వారానే లభించే ఈ రెండు సేవలు ఇంటర్‌నెట్‌కు అనుసంధానమయి వారు పొందవచ్చు. భారతీయ భాషలకు సంబంధించిన యూనికోడ్ అందుబాటులో ఉండడంతో – అన్ని అప్లికేషన్‌లలో ఈ సౌకర్యాన్ని కల్పించారు. చీహూూలో లభించే ఆన్‌లైన్ ఈ సేవలు ఇవి….
1. ఓటర్లజాబితాలో మీ పేరెక్కడుందో చూసుకోండి.
మీ పేరుగానీ, మీ బంధువుల పేరుగానీ లేదా మీ ఎపిక్ నంబరుగానీ టైప్ చేస్తే చాలు. ఓటర్ల జాబితాలో మీ పేరు, వివరాలు, పోలింగ్ స్టేషన్ వివరాలు, పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా, శాసనసభ నియోజక వర్గంవారీగా లేదా జిల్లా వారీగా మీ కు వివరాలు తెరపై కనిపిస్తాయి.
2. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చూసుకోండి.
మీ పేరుగానీ, మీ బంధువుల పేరుగానీ లేదా మీ ఎపిక్ నంబరుగానీ టైప్ చేస్తే చాలు. ఓటర్లు వారి పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోగలుగుతారు.
3. గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ వివరాలు
ఓటరు తన వివరాలు అందిస్తే గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చూసుకోవచ్చు.
4. మీ ఎన్నికల అధికారి ఎవరో తెలుసుకోండి.
మీ రాష్ట్ర, జిల్లా, శా.నియోజకవర్గ, పోలింగ్ స్టేషన్ వివరాలు తెలిపితే మీకు సంబంధించిన బూత్ స్థాయి ఎన్నికల అధికారులు(దీకూూ) / ఓటరు నమోదు అధికారి (జు=ూ) / అసిస్టెంట్ ఓటరు నమోదు అధికారి (ూజు=ూ) / జిల్లా ఎన్నికల అధికారి (ణజుూ) / ఎన్నికల ప్రధాన అధికారి (జజుూ) వివరాలు తెలుస్తాయి.
5. ఓటర్ల జాబితా పిడిఎఫ్ ఫార్మాట్‌లో
ఓటర్ల జాబితాలో తనకు సంబంధించిన సమాచారాన్ని పిడిఎఫ్ ఫార్మాట్‌లో చూడవచ్చు. అందుబాటులోకూడా ఉంచుకోవచ్చు. ఆ సమాచారంతోపాటూ పార్లమెంటరీ/శాసనసభ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్, సెక్షన్, పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంత పరిసరాల దశ్యం, మొత్తం ఓటర్లసంఖ్య, వారిలో పురుషులు, స్త్రీలు, థర్డ్ జండర్ సంఖ్య, పోలింగ్ స్టేషన్ ఉన్న భవనం చిరునామావంటివన్నీ తెలుస్తాయి. అంతేకాదు, ఓటర్లజాబితా సవరణ సందర్భాల్లో మొత్తం జరిగిన మార్పుచేర్పులు, సవరణలు, తొలగింపులుకూడా తెలుస్తాయి.
6. కొత్త ఓటరుగా నమోదుకావాలన్నా/సవరణ చేయాలన్నా/తొలగించాలన్నా/ మార్పులు చేయాలనుకున్నా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ-సేవ ద్వారా పౌరులు కొత్త ఓటరుగా నమోదుకావాలన్నా/సవరణ చేయాలన్నా/తొలగించాలన్నా/ మార్పులు చేయాలనుకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ-సేవ లో మరో విశేషం- దరఖాస్తుదారులు తమ ధవీకరణ పత్రాలు, ఫొటోల స్కానింగ్ కాపీలను అప్‌లోడ్ చేయవచ్చు.
7. దరఖాస్తు పరిశీలన స్థాయి తెలుసుకోవచ్చు.
మీ రిజిస్ట్రేషన్ ఐడి నంబరు ఎంటర్ చేస్తే అప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు దాని పరిశీలన ఏ స్థాయిలో ఉందో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
8. దరఖాస్తు ఫారాలు
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుదారులు వారివారి దరఖాస్తులు సమర్పించా లనుకుంటే ఈ పోర్టల్ ద్వారా పలురకాల – ఫారమ్ 6, 6ఎ, 7,8, 8ఎ వంటి ఫారాలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వాటిని డౌన్‌లోడ్ / ప్రింట్ చేసుకోవచ్చు.
9. అపాయింట్‌మెంట్ కూడా….
దరఖాస్తుదారు తన సౌకర్యాన్నిబట్టి బూత్‌స్థాయి అధికారితో అపాయిట్‌మెంట్ నిర్ణయించుకోవచ్చు.
10. పౌర ఫిర్యాదుల పరిష్కారం
ఓటర్ల గుర్తింపు కార్డుకు సంబంధించిగానీ, ఓటర్లజాబితా ఫారాల(6, 6ఎ, 7, 8, 8ఎ) వంటివి సమర్పించడానికి సంబంధించిగానీ పౌరులు దీనిద్వారా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు.
11. అధికారుల కోసం
ఎన్నికల నిర్వహణ సిబ్బందికోసం డాష్ బోర్డు సౌకర్యం ఉంది.దాని ద్వారా మొత్తం ఎంతమంది పౌరులు ఓటర్లగా పేరు నమోదు చేసుకున్నారు, కొత్తగా చేరినవారు, తొలగింపులు, మార్పుచేర్పులు, లేదా అందిన ఫిర్యాదులవంటివి చూసుకోవచ్చు.
ఇ.ఆర్.ఓ. నెట్
ఆన్‌లైన్‌లో /ఆఫ్‌లైన్‌లో అందిన దరఖాస్తులు/అభ్యంతరాల పరిశీలనకు, పరిష్కారానికి ఓటరు నమోదు అధికారులు వారికింది సిబ్బంది కోసం రూపొందించిన వేదిక జు=ూ.చీవ్. ఎన్నికల సంఘం ప్రకటించే కార్యక్రమాలకు తగ్గట్టుగా ఓటర్ల నమోదు ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల ప్రధాన అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్లనమోదు అధికారుల నుండి ఎన్నికల సంఘం వరకు మొత్తం ఎన్నికల యంత్రాంగంలోని అందరు అధికారులను అనుసంధానంచేసే సంపూర్ణ పకడ్బందీ నెట్‌వర్క్ ఇది. వెబ్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థలో పౌరులు / దరఖాస్తుదారులు సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ఏ స్థాయిలో ఉందో తెలిపే ప్రామాణిక సేవలను కూడా ఇది అందిస్తుంది.
ప్రధాన కార్యకలాపాలు :
ఎ. కొత్త పేర్ల నమోదు, అభ్యంతరాల పరిశీలన
1. మొత్తం ప్రక్రియను చూపే డాష్‌బోర్డు
2. కొత్త పేర్ల నమోదు, అభ్యంతరాలను కంప్యూటర్‌లోకి ఎక్కించడం
3. పార్ట్ నంబరు, దీకూూ లను నిర్ణయించడం
4. క్షేత్రస్థాయి పరిశీలనకు చెక్‌లిస్ట్ రూపకల్పన
5. క్షేత్రస్థాయి పరిశీలన నివేదికను కంప్యూటర్‌లోకి ఎక్కించడం
6. ఓటర్లు / అభ్యంతరాలు తెలిపిన వాళ్ళు లేదా క్షేత్రస్థాయిలో పునః పరిశీలన విచారణలకు తేదీని నిర్ణయించడం
7. మునుపటి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి జు=ూ నుండి నివేదిక పొందడం
8. ఎంట్రీలు మళ్ళీ మళ్ళీ పడకుండా సంబంధిత జు=ూలతో సమాచారం పంపిణీ