ఈసారి జాతీయ క్రీడలు కేరళలోని త్రివేండ్రంలో జనవరి 31నుంచి ఫిబ్రవరి 14 వరకు జరుగనున్నాయి. మన రాష్ట్రంనుండి 150మంది క్రీడాకారుల బృందం ఈ క్రీడా పోటీలలో పాల్గొంటుంది. క్రీడలలో పాల్గొనే ఆటగాళ్ళెవరైనా ఒత్తిడిని అధిగమించి, అత్యంత ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగినపుడే విజయాన్ని వరించగలుగుతారు. ఇలాంటి విషయాల్లో జట్టుకు మనో స్థైర్యాన్నందించి వారిని విజయపథాన నిలిపే మానసిక విశ్లేకులుగా డా॥ సి. వీరేందర్‌ను నియమిస్తూ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన డా॥ వీరేందర్‌కు జాతీయ జట్టుకు సైకాలజిస్టుగా సేవలందించే అవకాశం రావడంపట్ల ఆ ప్రాంత ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
హోం
»