జిల్లాల్లో-అవతరణ-వేడుకలుsతెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. జూన్‌ రెండవ తేదీ నుంచి వారం రోజుపాటు జరిగిన ఈ ఉత్సవాలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆయా జిల్లాల ఇన్‌ ఛార్జి మంత్రులు పతాకావిష్కరణ చేసి, లబ్దిదారులకు సంబంధిత పత్రాలను పంపిణీచేశారు.
ఉద్యమ ఖిల్లా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వార్షికోత్సవ సంబురాలు అంబరాన్నంటేలా అంగరంగ వైభవంగా సాగాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం, ఓ ఇద్దరు కసినా జై తెంగాణ పలకరింపులతో వారం రోజులు వేడుకాకు పండుగలా సాగాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ దీపాల అంకరణతో ధగధగలాడాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాప్రదర్శను, ర్యాలీలు నిర్వహించారు.

జూన్‌ రెండున ఖమ్మం పట్టణంలోని పెవిలియన్‌ మైదానంలో అమరవీరుల స్థూపానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ జి. కవిత, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె. ఇంబరిది, తదితయి నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణోత్సవాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా స్థాయి, నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రంగాలో ప్రతిభ కనపరిచిన ప్రముఖులకు మంత్రి నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపికను అందించి అభినందించారు.

ఈ ఉత్సవాలో భాగంగా, ప్రతిరోజూ సాంస్కృతిక ప్రదర్శను, ప్రభుత్వ పథకాపై స్టాల్స్‌ ఏర్పాటు, వివిధ అంశాలపై చర్చాగోష్టు నిర్వహించారు.

ఈ వేడుకలో ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి, జిల్లాలకు చెందిన పువురు శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో..

ఆదిలాబాద్‌ జిల్లా అంతటా రాష్ట్ర అవతరణోత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటలవరకూ స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అరించాయి. కవి సమ్మేళనాలు, ముషాయిరా, గజల్స్‌, ఖవ్వాలి, పేరిణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో జిరిగిన వేడుకల్లో అటవీ శాఖా మంత్రి జోగు రామన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 19 మంది లబ్దిదారులకు 1.90 కోట్ల విలువైన 53 ఎకరాల భూమి పట్టాను అందచేశారు. నిరుపేదల మహిళలకు బి.సి.కార్పొరేషన్‌ ద్వారా 10 లక్ష రూపాయల రుణాలను అందచేశారు. అంతకుముందు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంవద్ద ఏర్పాటుచేసిన అమరవీరుల స్థూపానికి మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టరు ఎం. జగన్‌ మోహన్‌, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

వేడుక ముగింపు రోజున వందలాది మంది కళాకారులతో వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించారు.

మెదక్‌ జిల్లాలో.. మెదక్‌ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోను, జిల్లాలోని వివిధ పట్టణాలు, మునిసిపాలిటీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లలో రాష్ట్ర అవతరణోత్సవాలు వారం రోజులపాటు వైభవంగా జరిగాయి. జూన్‌ రెండున రాష్ట్ర నీటిపారుద శాఖా మంత్రి టి.హరీష్‌ రావు సంగారెడ్డి కలెక్టరేటులో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించడంతో ఈ ఉత్స వాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంగారెడ్డిలోని పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ రంగాలో ఉత్తమ సేవలందించిన 23మంది ప్రముఖులకు జిల్లా స్థాయిలో 51,116 రూపాయల నగదు అవార్డును మంత్రి అంద జేశారు. 450 మంది లబ్దిదారుకు 4.10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. సంక్షేమ పథకాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ను మంత్రి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా, పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్‌లో జరిగిన వేడుకలో శాసన సభ ఉప సభాపతి ఎం. పద్మా దేవేందర్‌ రెడ్డి, వివిధ నియోజకవర్గాలో ఆయా శాసన సభ్యులు పాల్గొన్నారు.

తెంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్‌ స్టేడియంలో కళాప్రదర్శలను నిర్వహించారు. సాంస్కృతిక సారధి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళాప్రదర్శను ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ ఉత్సవాలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ విద్యుత్‌ దీపాలతో అంకరించారు. మహిళలకు ముగ్గు పోటీలు, వంట పోటీలు, సెమినార్లు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, ముషాయిరా, కవ్వాలి , హెరిటేజే రన్‌ నిర్వహించారు. ముగింపు ఉత్సవంలో భాగంగా వివిధ కళారూపాల కళాకారులతో శోభాయాత్ర నిర్వహించారు.
వరంగల్.. వరంగల్ జిల్లాలో వారం రోజుపాటు నిర్వహించిన రాష్ట్ర అవతరణోత్సవాల పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ సందర్భంగా నగరంలోనూ, జిల్లాలోని వివిధ ప్రాంతాలో నిర్వహించిన కళాప్రదర్శను, కార్యక్రమాల ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షించాయి. ప్రజలుపెద్ద సంఖ్యలో భాగస్వాముయ్యారు.

వరంగల్ లోని పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ రెండవ తేదీన జరిగిన రాష్ట్ర అవతరణోత్సవాలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. జిల్లాలను అన్నిరంగాలో ముందుంచడమే అమరవీరులకు సమర్పించే నిజమైన నివాళి అని కడియం శ్రీహరి అన్నారు. ఇదే వేదికపై వివిధ రంగాలో ఎంపికైన ప్రముఖులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతులమీదుగా సత్కరించారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

వరంగల్ లోని పబ్లిక్‌ గార్డెన్‌, టౌన్‌ హామ్ లో జిల్లా సమాచార, పౌర సంబంధా శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెంగాణా కళ, సంప్రదాయాలను ఉట్టిపడేలా ‘ఏకశిల క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కూడా ఉప ముఖ్యమంత్రి సందర్శించారు.

ఈ ఉత్సవాలో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తదితర అంశాలపై సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్‌ హాలులో దాదాపు 60 మంది కవులతో కవిసమ్మెళనం నిర్వహించారు. అలాగే, జిల్లా విద్యాశాఖ, కాకతీయ సోషల్‌ స్టడీస్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెమినార్‌ హాలులో ‘తెలంగాణ ఆశు- ఆకాంక్షు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అవతరణోత్సవాల ముగింపు వేడుకాకు వరంగల్ ఖిల్లాలో ఘనంగా నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వున్న రామచంద్ర తేజావత్‌ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో బాణాసంచా కాల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనాను, పాటు, జానపద గేయాతో ఖిల్లా మార్మోగిపోయింది. సాంస్కృతిక సారధి ఛైర్మన్‌ రసమయి బాకిషన్‌ ఆధ్వర్యంలో వరంగల్  పట్టణంలోని కలెక్టరు కార్యాలయం నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌ వరకూ వందలాదిమంది కళాకారులతో నిర్వహించిన ర్యాలీ దారిపొడవునా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన వివిధ కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, పలువురు ప్రముఖులను సత్కరించారు.

జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులు ఈ వారోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

నల్గొండలో.. తెంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలకు అద్దంపట్టేలా నల్గొండ జిల్లాలో రాష్ట్ర అవతరణోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ పి. సత్యనారాయణ రెడ్డి ప్రణాళికా బద్ధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయివరకూ పండుగ వాతావరణంలో ఈ వేడుకలను నిర్వహించారు. ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది.

తొలి రోజు జూన్‌ రెండవ తేదీన నల్గొండలోని పోలీస్‌ పేరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి జి. జగదీష్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకు ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులార్పించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రముఖులను ఈ ఉత్సవాల సందర్భంగా మంత్రి చేతులమీదుగా సత్కరించారు. అదేరోజు సాయంత్రం నాగార్జున ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలో తెలంగాణ వంటకాలతో ఏర్పాటుచేసిన ఫుడ్‌ కోర్టు ను మంత్రి ప్రారంభించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

మండల కేంద్రాలో మహిళలకు ముగ్గు పోటీలు, బతుకమ్మ తయారీ పోటీలు, మ్యూజికల్‌ ఛైర్‌ పోటీలు నిర్వహించారు. పురుషులకు కబ్బడి, వాలీబాల్‌, ఖోఖో పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి పరుగు పోటీలు, సైకిల్‌ ర్యాలీలు, కళాకారుల ర్యాలీలు, డాగ్‌ షో, క్రికెట్‌, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జర్నలిస్టులకు కూడా క్రీడాపోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలో పలువురు శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్‌ జిల్లాలో.. రాష్ట్ర అవతరణ వారోత్సవo కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాయాలు, ప్రయివేటు సంస్థలు, హోటళ్ళను కూడా విద్యుత్‌ దీపాలతో సుందరంగా అంకరించారు. కరీంనగర్‌ సమీపంలోని ఎల్‌.ఎం.డి గేట్లను అలంకరించిన తీరు జిల్లాలకే హైలెట్‌గా నిలిచింది.

తొలిరోజు జూన్‌ 2న ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్‌ తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలాలువేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాం వద్ద, అమరవీరుల విగ్రహం వద్ద మంత్రి నివాళులర్పించారు. కరీంనగర్‌ లోని పోలీస్‌ పెరెడ్‌ గ్రౌడ్స్‌ లో మంత్రి ఈటెల రాజేందర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శించిన కళారూపాలు, ప్రదర్శలను అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలో వివిధ రంగాలో విశేష కృషిచేసిన ప్రముఖులను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్కరించారు. వివిధ సంక్షేమ పథకాలను  లబ్దిదారుకు పంపిణీచేశారు. ఈ వేడుకలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సాంస్కతిక సారధి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శలను, జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో కవి సమ్మేళనం, ఖవ్వాలి, పాట పోటీలు, వంట పోటీలు, నడక పోటీలు, జానపద గేయాలు, గోలుసుద్దు, ఒగ్గుకళా ప్రదర్శన వంటి విశేష కార్యక్రమాలు ప్రజలను మైమరపించాయి.

నగరంలోని మహాత్మా జ్యోతిరావు పూలే మైదానం (సర్కస్‌ గ్రౌండ్‌) లో సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిశాయి.

ఈ కార్యక్రమాలో జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, వివిధ శాఖ అధికార, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Other Updates