వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించిన జిఎస్ టి కౌన్సిల్ 21వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఈ సమావేశం పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఈ కింద పేర్కొన్న మేరకు చర్యలు తీసుకోవాలని సిఫారసులు చేసింది.
రిటర్నులు దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, సేల్స్ రిటర్న్ ను లేదా జిఎస్ టిఆర్ -1ను దాఖలు చేసేందుకు తుది గడువు తేదీని 2017 అక్టోబరు 10వ తేదీ వరకు సవరించాలని జిఎస్ టి కౌన్సిల్ సిఫారసు చేసింది.
అయితే, 100 కోట్ల రూపాయలకు పైబడిన మొత్తం టర్నోవర్ తో నమోదైన రిజిస్టర్డ్ పర్సన్స్ విషయంలో తుది గడువు తేదీ 2017 అక్టోబరు 3 గా ఉంచాలని కౌన్సిల్ సూచించింది.
జిఎస్ టిఆర్-2 దాఖలుకు 2017 అక్టోబరు 31వ తేదీ, జిఎస్ టిఆర్-3 దాఖలుకు 2017 నవంబరు 10వ తేదీ తుది గడువు తేదీలుగా ఉండాలని కౌన్సిల్ సూచించింది. ఇక జిఎస్ టిఆర్-4 దాఖలుకు తుది గడువు 2017 అక్టోబరు 18గానే ఉంటుంది. (దీనిలో ఏ మార్పు లేదు.) జిఎస్ టిఆర్-4 ను 2017 జులై – సెప్టెంబర్ త్రైమాసికానికి దాఖలు చేయనక్కరలేదు. జిఎస్ టిఆర్-4 ఎ ను కూడా ఈ త్రైమాసికానికి దాఖలు చేసే పనిని తప్పించారు.
తదుపరి కాలాలను పైన ప్రస్తావించినటువంటి రిటర్నుల సమర్పణకు గడువు తేదీలను తరువాత నోటిఫై చేయనున్నారు. జిఎస్ టిఆర్- 3 బి ని 2017 ఆగస్టు నుంచి డిసెంబరు నెలల వరకు సమర్పించాలి.
కంపోజిషన్ స్కీమ్ ను ఎంచుకోలేకపోయిన రిజిస్టర్డ్ పర్సన్ (మైగ్రేటెడ్ లేదా కొత్త రిజిస్ట్రెంట్) కు 2017 సెప్టెంబర్ 30 వ తేదీ వరకు కంపోజిషన్ ను ఎంచుకొనే అవకాశాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా రిజిస్టరైన వ్యక్తి కి 2017 అక్టోబర్ 1 నుంచి వర్తించే విధంగా కంపోజిషన్ స్కీమ్ తాలూకు ప్రయోజనాన్ని అందుకొనేందుకు అనుమతిని ఇవ్వాలి.
ప్రస్తుతం, ఇంటర్- స్టేట్ ట్యాక్సబుల్ సప్లయిస్ ను చేస్తున్న వ్యక్తి 20 లక్షల రూపాయల (జమ్ము కశ్మీర్ మినహా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో అయితే 10 లక్షల రూపాయల) త్రెషోల్డ్ ఎగ్జంప్షన్‌కు అర్హతను కలిగివుండరు. అటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవల సిందే. ఇంటర్- స్టేట్ ట్యాక్స బుల్ సప్లయిస్‌లోకి చేరే హస్తకళా వస్తువులను సరఫరా చేసే వ్యక్తులకు, వారు శాశ్వత ఖాతా సంఖ్య (పర్మనెంట్ అకౌంట్ నంబర్.. పిఎఎన్) ఉన్నంత కాలం, మొత్తం 20 లక్షల టర్నోవర్ వరకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపును ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. అలాగే, వస్తువులను కన్ సైన్ మెంట్ విలువతో సంబంధం లేకుండా, ఇ-వే బిల్లుతో వెళ్లాలి.
ప్రస్తుతం, జాబ్ వర్క్ ను ఇంటర్- స్టేట్ ట్యాక్స బుల్ సప్లయిస్ రూపంలో చేస్తున్న వర్కర్ సేవను 20 లక్షల రూపాయల (జమ్ము కశ్మీర్ మినహా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో అయితే 10 లక్షల రూపాయల) త్రెషోల్డ్ ఎగ్జెంప్షన్‌కు అర్హమైందిగా పరిగణించడం లేదు, అటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందే. ఒక రిజిస్టర్డ్ పర్సన్‌కు జాబ్ వర్క్ సేవను ఇంటర్- స్టేట్ ట్యాక్స బుల్ సప్లయిస్ రూపంలో చేస్తున్నట్లయితే గనక వస్తువులు వాటి కన్‌సైన్‌మెంట్ విలువతో సంబంధం లేకుండా ఇ-వే బిల్లు రక్షణతో వెళ్తున్నంత కాలం ఆ తరహా జాబ్ వర్కర్‌లను రిజిస్ట్రేషన్ పొందనవసరం లేకుండా మినహాయింపును ఇవ్వాలని నిర్ణయిం చారు. ఈ మినహాయింపు ఇ-వే బిల్లు అవసరపడని చాప్టర్ 71 పరిధిలోకి చేరుతున్న జ్యూయలరీ, స్వర్ణకారులు, వెండి నగల తయారీదారులకు సంబంధించిన జాబ్ వర్క్‌కు వర్తించదు.
ఫామ్ జిఎస్ టి ట్రాన్-1 ను ఒక్కసారి సవరించు కొనేందుకు అనుమతిస్తారు.
ఫామ్ జిఎస్‌టి ట్రాన్-1 సమర్పణకు గడువు తేదీని ఒక నెల రోజుల పాటు అంటే, 2017 అక్టోబరు 31 వరకు పొడిగించారు.
మూలం వద్ద పన్ను మినహాయింపు (టిడిఎస్), కలెక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్ (టిసిఎస్) వర్తించే వ్యక్తుల రిజిస్ట్రేషన్ 2017 సెప్టెంబర్ 18వ తేదీ నాటి నుంచి ఆరంభమ వుతుంది. అయితే, టిడిఎస్ మరియు టిసిఎస్‌ను మినహాయించడం లేదా వసూలు చేయడం ఏ తేదీ నుంచి అన్నది కౌన్సిల్ తరువాత నోటిఫై చేయనుంది.
ఎగుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించ డానికి రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన కేంద్ర, రాష్ట్రాల అధికారులతో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయా లని జిఎస్ టి కౌన్సిల్ నిర్ణయించింది.
అలాగే, జిఎస్‌టి అమలు కాలంలో ఎదురయ్యే ఐటి సవాళ్లను పర్యవేక్షించడం, పరిష్కరించడం కోసం మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని జిఎస్ టి కౌన్సిల్ నిర్ణయించింది.