taశ్రీ టి. ఉడయవర్లు

 

మోముపై చెరగని చిరునవ్వు. మల్లెపూవు వంటి తెల్లని నలగని ఖద్దరు లాల్చీ

– పైజామా ధరించిన స్ఫురద్రూపం, మనస్సులో మమతల మడతలు, మాటలో

మన్నన, మృధుత్వం, ఆలోచనలో మానవత్వం, దేశభక్తి, చేతలో పొందిక,

అంకితభావం, గాంధేయం, క్రమశికూజుణ, ఆత్మగౌరవ పరిరకూజుణలో ఇంకెవ్వరూ

తనకుసాటి అన్నట్టు వ్యవహరించే బహుముఖ కార్యనిర్వ

హణాదకూజుతల కలపోతతో రూపుకట్టిన సేవామయ జీవి –

”ఎమ్మెల్‌”

వారి అసలు పేరు – మాదిరాజు లకీూజ్ము నరసింహారావు.

కాని పూర్తి పేరు పెట్టి, వారిని సంబోధించడం బహుశా

ఎవ్వరూ విని ఉండరు. ”ఎమ్మెల్‌” అంటేనే అందరికీ

కావలసిన ఆ పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి

స్పూరిస్తాడు.

నిజాం పాలనలో – 1901లో వెలసి విజ్ఞానజ్యోతులను

ప్రసరించిన తొలిగ్రంథాలయం – శ్రీకృష్ణ దేవరా

యాంధ్రభాషా నిలయానికి సుమారు అర్ధ శతాబ్దిపాటు

కార్యదర్శిగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కృషి చేసి తెలుగు

బాó షాబివó ృదిక్ధ ,ి సం స్క ృతీ వికాసానిక ి దోహ దం చసే ని ఎవుె ్మల్‌

ఊపిరి ఆగిపోయింది. 2016 ఫిబ్రవరి 12న శ్వాసకోశ

సంబంధ రుగ్మతతో ఉదయమే అస్తమించారు.

పూర్వపు వరంగల్‌ జిల్లా గార్ల జాగీరులోని

పండితాపురంలో మాదిరాజు నారాయణరావు – లకీూజ్ము బాయమ్మ దంపతుల ఆరుగురు

కుమారులలో రెండవ వారు ఎమ్మెల్‌. సంపన్నమైన ఉన్నత కుటుంబంలో 1928

నవంబర్‌ 7వ తేదీన పుట్టిన ఈయన ఖమ్మంలో మెట్రిక్‌ చదువుతున్న సమయంలో

హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకుడు రామానంద తీరశీవ పిలుపుతో ప్రేరణ పొంది,

విద్యారుశీవలందరితోపాటు పాఠశాల బహిష్కరించి చదువుకు స్వస్తి చెప్పాడు. నిజాం

పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడు. హయగ్రీవాచారి

నేతృత్వంలో క్రియాశీలపాత్ర నిర్వహించాడు. యువకుడైన ఎమ్మెల్‌ అండర్‌్‌గ్రౌండ్‌

సమాలోచనలకు, కార్యక్రమాలకు ఎంతగానో చేయూతనిచ్చాడు. నిజాం ప్రభుత్వానికి,

రజాకార్లకు పట్టుపడకుండా క్లిష్ట సమయంలో మారు వేషాలు వేసుకొని హైదరాబాద్‌

విమోచన ఉద్యమానికి బహుముఖ సంఘం కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్‌

జిల్లా శాఖ నిర్వాహకుడుగా, భారత సేవా సమాఖ్య కార్యవర్గ సభ్యుడుగా, భారత

కళాపరిషత్‌ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌

కాలేజీ విద్యారిశీవ సంఘం ఉపాధ్యూజుకుడుగా, తెలంగాణ జాతీయ విద్యారిశీవ సంఘం

కార్యదర్శిగా సేవలందించాడు.

మొదటి నుంచి తెలుగు రచనలో మంచి ప్రవేశం ఉన్నందున ఆనాటి కాంగ్రెసు

ఉద్యమ వార్తలు, సుదీర్ఘ విశ్లేషణాత్మక వ్యాసాలు రాసేవారు. అవన్నీ ‘ఆంధ్రపత్రిక’లో

జీవిత చరిత్రల

రచనా శిల్పి

వీaతీషష్ట్ర-2016ఖీబికూaవశీబ్‌ 1 2/28/2016 7:13 ూవీ ూaస్త్రవ 46

మార్చి 2016 శ్రీ తెలంగాణ శ్రీ ?7

హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, తెన్నేటి విశ్వనాధం,

కె.వి. రంగారెడ్డి, జమలాపురం కేశవరావు, పండిత నరేంద్రజీ

లాంటి రాష్ట్ర నాయకుల జీవిత చరిత్రలన్నీ స్ఫూర్తివంతంగా

వ్రాశారు. జాతీయోద్యమ నిర్మాతలు, భారత జాతీయ – కాంగ్రెస్‌

అధ్యూజుకులు, తరతరాల నెహ్రూలు, తెలంగాణ ప్రముఖులు,

నూరుగురు తెలుగు ప్రముఖులు, తాజాగా తెలంగాణ చరిత్ర,

ఉద్య మాలు, పోరాటాలు లాంట ి ముప్పై ఐదు పెగౖ ా గ్రం దా¸ లు వ్రాసి

ముందు తరాలకు అందించారు.

జీవిత చరిత్రల రచయితగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ

198?లో అవారు ్డ ప్రద ానం చసే ంి ది. గ్రం దా¸ లయాె ద్య మానిక ి వారు

చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు

విశ్వవిద్యాలయం 1993లో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు

”బహుకరించింది. అంతేకాదు జీవిత చరిత్రల రచనా రంగంలో

గ్రంథాలయ ఉద్యమ రంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా

2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ

డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది. ఇంకా రాష్ట్రంలో ఎన్నో

సంసశీవలు వారి ప్రతిభా విశేషాలకు ఆనవాలుగా వారిని గౌర

వించాయి. అవార్డులు ప్రదానం చేశాయి. సరిగ్గా మూడు నెలల

క్రితమే వారి ఎనభై ఎనిమిదోపడి ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం

కార్యదర్శిగా వారు అందించిన సేవల దృష్ట్యా చంద్రునికో

నూలుపోగులాగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వారికి

జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసి సముచిత రీతిన

సత్కరించింది.

అనేక గాంధేయ సంసశీవలతో, గాంధీ భవన్‌ గ్రంథాలయం

లాంటి మరెన్నో సంసశీవలతో వారికి సన్నిహిత సంబంధం ఉండేది.

విద్యారిశీవ దశనుంచే జాతీయోద్యమంలో పాల్గొని నిజాం నిరంకుశ

పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన స్వాతంత్య్ర సమర

యోధుడూ ఎమ్మెల్‌కు కేంద్రప్రభుత్వం ”తామ్ర పత్రం” ప్రదానం

చేసి సన్మానించింది. ఇంకా వీరు ఉస్మానియా విశ్వవద్యాలయం

‘సెనెట్‌ సభ్యులుగా, మద్రాసు దూదర్శన్‌ కార్యక్రమాల సలహా

సంఘం సభ్యులుగా, ఫిలింసెన్సార్‌ బోర్డు సభ్యులుగా, ప్రతిభా

మూర్తి పి.వి. నరసింహారావు, ప్రత్యేక సంచికకు ప్రధాన

సం పాద కు డు గా, మర న్నో ప్రత ్యే క సం చికల ఎడటి రగ్‌ ా, బహు ముఖ

వ్యాపకాలతో నిరంతరం పాటుపడిన ఎమ్మెల్‌ ఎందుచేతనో గాని

తన జీవిత చరిత్ర వ్రాసుకోలేదు.

కాని యాభై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

వ్రాయా లనుకు న్నారు . తర త ర ాల తలె ుగు ప్రవ ుుఖులు శీర్షికన 515

మంది లఘు జీవిత వివరాలతో 770 పేజీల గ్రంథం ముద్రణకు

సది ం్ధ గా ఉన్నది. ఎవుె ్మల్‌ రచ న లో ్ల ఇది తల మానికం . ఇంకా ఎన్నో

రచనలు వారి కలం నుంచి జాలువారుతాయని ఆశించిన వారిని

నిరాశ చేసి అంతలోనే వారు కన్నుమూయడం విచారకరం.

ఎమ్మెల్‌ది రచయితగా, సంసాశీవనిర్వాహకుడుగా, కుటుంబ పెద్దగా

సంతృప్తికరమైన జీవితం అనవచ్చు. వారి సేవామయ జీవితంపై

రెండు తెలుగు రాష్ట్రాలలోని ఏ విశ్వవిద్యాలయం నుంచైనా

పిహెచ్‌.డి. సిద్ధాంత వ్యాసం ఎవరు వ్రాసినా వారికి సరైన నివాళి

కాగలదు. అందుకు కావలసినంత సామాగ్రి అందుబాటులో

ఉంది.

Other Updates