GHMCజీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల

తారకరామారావు ఈ మేరకు ప్రణాళికను ఫిబ్రవరి18న విడుదల

చేశారు. ఈ ప్రణాళిక ద్వారా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌

కార్పొరేషన్‌లో సరికొత్త ఒరవడిలో పాలన ప్రారంభం కానుంది.

ఈ ప్రణాళికలో వెంటనే పరిష్కరించాల్సిన సమస్యల నుంచి

దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించేలా

ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా పాలనలో

జవాబుదారీతనానికి పెద్దపీట వేశారు. చేపట్టబోయే పనులతో

పాటు వాటికి కేటాయించే నిధులను కూడా అందులో స్పష్టం

చేశారు. జీహెచ్‌ఎంసీ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని

పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. సద్వినియోగం చేసుకుంటారన్నదే ము ఖ్యం. అని ము ఖ్యమంత్రి కొత్త

కార్పొరేటర్లకు చెప్పారు.

ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను కార్పొరేటర్లు గుండెల్లో

పెట్టుకోవాలి.జి.హెచ్‌.ఎం.సిలో లంచం ఇచ్చే అవసరం లేకుండా

ఇంటి పర్మిషన్‌ తెచ్చుకొనేలా పనిచేయాలి.ఆ రోజు వస్తేనే గెలిచిన

గెలుపునకు విలువ ఉంటుంది. అని సి.ఎం చెప్పారు.ఎట్టి పరిసిశీవతుల్లో

గర్వం, అహంకారం రావొద్దు. ప్రజలు ఎంత గొప్ప విజయం చేూ

రిస్తే అంత అణుకువతో ముందుకు పోవాలి అని హితబోధ చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక

శ్రద్ధ కనబరుస్తున్నదని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వందరోజుల్లో

ఆన్‌లైన్‌ అనుమతుల విధానం అందుబాటులోకి తెస్తున్నారు. దీనితోపాటు

హుస్సేన్‌సాగర్‌ ప్రకూజుాళన చేపడుతున్నారు. వీటితో పాటు జూన్‌

రెండోవారంలో మెట్రోరైలును ప్రారంభిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.

సర్కిళ్ళ పెంపు

పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు పరిపాలన

వికేంద్రీకరణ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న

సర్కిళ్ళ సంఖ్యను పెంచి వాటిని 30 సర్కిళ్ళు చేయనున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే వందరోజుల్లో 200 కోట్ల రూపాయల

ఖర్చుతో 659 బీటీ రోడ్లు, 20 కోట్ల రూపాయల ఖర్చుతో ?0 మోడల్‌

కూరగాయల మార్కెట్లు, ? అధునాతన కబేళాలు, 150 జిమ్నాజియంలు,

రూ. కోటి వ్యయంతో 10 స్మశానవాటికలు, 50 బస్‌బేలు, 100 ప ్లక్‌

టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

సీఎం మాటే శిరోధార్యం

సీఎం మాటనే శిరోధార్యంగా భావించి పనులు పూర్తి చేస్తున్నామని

మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పేద ప్రజలకు అందుబాటులోఉంటూ

అవినీతి లేకుండా పాలన సాగించాలని సీఎం తమను ఆదేశించారన్నారు.

భవన నిర్మాణాలకు అనుమతులను ఆన్‌లైన్‌లో ఇచ్చే విధంగా ప్రణాళికలు

రూపొందిస్తున్నట్లు తెలిపారు.

జీహెచ్‌ఎంసీలో..

భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో త్వరితగతిన స్పందించే

విధంగా ప్రణాళిక రూపొందించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో

ఏకకాలంలో అనుమతులు వచ్చేవిధంగా తయారు చేశారు. దరఖాస్తు

చేసిన 30 రోజుల్లోగా అనుమతులు రానున్నాయి. పాలనాపరమైన

కార్యక్రమాలపై పర్యవేకూజుణ చేయడానికి వార్డు కమిటీలు, ఏరియా

కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సలహాలు, ఫిర్యాదుల కోసం పోర్టల్‌

ఏర్పాటు చేశారు. చెత్త తరలింపునకు 2500 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు

చేస్తారు. రూ. 30 కోట్లతో నాలాల క్రమబద్దీకరణ చేయనున్నారు. 329

క్రీడా మైదానాల అభివృద్ధి, 20 కాలనీపార్కుల సుందరీకరణ చేపడతారు.

?352 స్వయం సహాయక సంఘాలకు రూ. 100 కోట్లు విడుదల

చేస్తారు. మే 31లోగా 3.5 కోట్ల మొక్కలను పంపిణీ చేస్తారు. 32వేల

పెండింగ్‌ నల్లా కనెకూజున్‌ల దరఖాస్తుల పరిష్కారం, 3వేల కుటుంబాలకు

కొత్త నల్లా కనెకూజున్లు ఇస్తారు.

ఇలా పలు కార్యక్రమాలకు వందరోజుల ప్రణాళిక రూపొందించి

అమలు చేసే విధంగా మంత్రి కేటీఆర్‌ ప్రణాళికలు రూపొందించారు.

మున్సిపల్‌ చట్టాల్లో సవరణలు

చేస్తాం: మంత్రి కె.టి.ఆర్‌.

మున్సిపాలిటీల అభివృద్ధి, వంద శాతం

పన్ను వసూలు జరిగేలా చర్యలు

తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ మంత్రి

కె.టి.రామారావు అన్నారు. ఫిబ్రవరి 10న

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా

బాధ్యతలు చేపట్టిన అనంతరం బుద్ధపూర్ణిమ

గెస్ట్‌హౌజ్‌లో మున్సిపల్‌ అధికారులతో జరిపిన

సమీకూజు సమావేశంలో కీలక నిర్ణయాలు

తీసుకున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ బాధ్యతలు చేపట్టిన

తర్వాత అక్కడ పన్ను చెల్లింపులు పెరిగిందని,

మున్సిపాలిటీలల్లోనూ క్రమంగా పన్నుల

చెల్లింపులు పెరిగేలా ప్రణాళికలు

రూపొందిస్తామన్నారు. ప్రజల సహకారంతోనే

మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని,

ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఎన్జీవోలు,

ఆయా సంసశీవల సహకారంతో వార్డులు,

డివిజన్ల వారిగా, రాజకీయాలకు అతీతంగా

కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి చట్టాల సవరణకు

సమాలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర

పంచాయతీల పరిధిలో సొంత ఆదాయం

పెంపు, ఖర్చు తగ్గించే ప్రణాళికలతో పాటు

నిర్ణీత కాల వ్యవధిలో పౌర సేవలతో పాటు

అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు

సిద్ధం చేయనున్నట్లు మంత్రి కెటిఆర్‌

ప్రకటించారు. వంద రోజుల ప్రణాళిక

పూర్తయ్యేలోగా ఏడాది ప్రణాళికలతో అభివృద్ధి

పై దృష్టిసారిస్తున్నామని, తమిళనాడులో

ప్రయోగాత్మకంగా చేపట్టిన యూఎఫ్‌ఐడీసి

విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని

నిర్ణయించామన్నారు. ఇందులో

హైదరాబాద్‌ను మినహాయించి కార్పొరేషన్‌లు,

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల

బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు

చేయనున్నామని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల

మ్యానిఫెస్టో కాపీలను సంబంధిత

అధికారులకు అందజేయడంతో పాటు వాటి

అమలుకు కార్యాచరణ చేపట్టాలని సమీకూజులో

నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌,

ఎల్‌ఆర్‌ఎస్‌లు భవిష్యత్తులో ఉండవని ఇదే

చివరి అవకాశమని, అదనంగా కట్టిన, అక్రమ

సశీవలాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని

నిర్ణయించడమే కాకుండా ఇందుకోసం

చట్టాల్లో కొన్ని మార్పులు

తీసుకువస్తామన్నారు. క్రమబద్ధీకరణతో పాటు

కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు,

లేఅవుట్‌లు అందించేందుకు 100 రోజుల్లో

ఆన్‌లైన్‌ అప్రూవల్‌లు విధానాన్ని

ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని

మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు.

Other Updates