సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ రచయిత టంకశాల అశోక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతియేడాది అందించే ఉత్తమ అనువాద రచనల్లో 2016 సంవత్సరానికి తెలుగు భాష నుంచి టంకశాల అశోక్ అనువదించిన వల్లభాయ్ పటేల్ పుస్తకం అవార్డుకు ఎంపికైంది. అకాడమీ అధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ అధ్యక్షతన ఫిబ్రవరి 21న జరిగిన సమావేశంలో ఈ అవార్డును ఎంపికచేశారు. రాజామోహన్ గాంధీ ఇంగ్లీష్ లో రచించిన వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర పుస్తకాన్ని టంకశాల అశోక్ వల్లభాయ్ పటేల్ పేరుతో తెలుగులోకి అనువదించారు. టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఆయన పూర్తి అర్హుడని, ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. టంకశాలకు శుభాకాంక్షలు తెలిపారు.
హోం
»