tsmagazineబ్రిటన్‌లో వరుసగా పద్దెనిమిది సంవత్సరా లనుంచి ప్రతిపక్షంలో ఉన్న లేబర్‌పార్టీ 1997లో అధికారంలోకి వచ్చి టోనీ బ్లెయర్‌ ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 43 సంవత్సరాలు. 1812లో లార్డ్‌ లివర్‌పూల్‌ తర్వాత ఇంత చిన్న వయస్సులో ప్రధానమంత్రి అయ్యింది బ్లెయిర్‌ ఒక్కడే. 2001 సాధారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించి బ్లెయిర్‌ రెండవసారి అధికారం చేపట్టాడు. ఆయన నుంచి బ్రిటిష్‌ ప్రజానీకం చాలా ఆశించింది. పరిపాలనలోనూ ఆయన అరుదైన రికార్డు నెలకొల్పుతారని భావించారు. కానీ ఆశాభంగమే ఎదురైంది. ఇరాక్‌పై యుద్ధంలో అమెరికాకు మద్ధతు యిచ్చినందుకు ఆయనకు ఈ గతి పట్టింది. అనంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు బుష్‌పార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయాడు. ఇరాక్‌పై బుష్‌ ప్రభుత్వ విధానమే ఎన్నికల్లో పరాజయానికి ప్రధాన కారణం. బ్రిటన్‌లోనూ ఇదే పద్ధతి పునరావృతం కాగలదని లేబర్‌పార్టీ భయపడడంతో ప్రధానమంత్రిని మార్చితే పరిస్థితి చక్కబడుతుందని భావించి బ్లెయర్‌ స్థానంలో గోర్డాన్‌ బ్రౌన్‌ను కూర్చోబెట్టింది.

దశాబ్దకాలంపాటు అప్రతిహతంగా బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న బ్లెయర్‌ చివరకు విఫలనేతగా వైదొలగాల్సి వచ్చిందంటే స్వయంకృతం. అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన పోరులో బ్లెయర్‌ ఎంతవరకు సఫలీకృతమయ్యారో తెలియదుకానీ పదవినుంచి మాత్రం అర్థాంతరంగా తొలగి పోవలసి వచ్చింది.

బేగంపేట విమానాశ్రయంలో నెహ్రూ

ఒకసారి ఒక విచిత్ర సంఘటన జరిగింది. నెహ్రూ కేరళ పర్యటనకై వెళుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో యాభై నిమిషాలు ఆగారు. గవర్నరు భీంసేన్‌ సచార్‌, ముఖ్యమంత్రి సంజీవరెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ఇతర ప్రముఖులంతా విమానాశ్రయానికి వచ్చి ఆయనను స్వాగతించారు. భోజనం కూడా చేశారు. ప్రధాని వెంట వచ్చిన అ.భా.కా. కమిటీ ప్రధానకార్యదర్శి సాదిక్‌ అలీ పత్రికా గోష్ఠి ఏర్పాటు చేశాడు. నెహ్రూ మాత్రం ఆ గోష్ఠిలో పాల్గొనక పూర్తి విశ్రాంతి తీసుకున్నారు. విరామ సమయం పూర్తికాగానే తానొచ్చిన మేఘధూత్‌లో ప్రయాణమయ్యారు. ఇంతలో ఏంజరిగిందో ఏమో కానీ రివ్వున విమానం దిగి తిరిగివచ్చి కేకలు పెట్టడం మొదలుపెట్టారు.

జరిగిందేమిటంటే, తనతో ప్రయాణించవలసిన సాదిక్‌ విమానంలో లేరు. ఆయన విమానాశ్రయ అతిథి గృహంలో సీతాయుద్ధవీర్‌ దంపతులతో మాటల్లోపడి ఢిల్లీ ప్రయాణం సంగతే మరిచిపోయారు. ఇంతలో నెహ్రూ తనకోసం కేకలు పెట్టడం వినిపించింది. పరుగెత్తుకుంటూ వెళ్లి విమానంలో కూర్చుండి పోయాడు. తన అనుచరులపట్ల నెహ్రం ఎంత శ్రద్ధ వహించేవాడో ఈ దృష్టంతం ఒక్కటి చాలు.

Other Updates