ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ళ పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్‌ ప్రకటించగా ఆయనను సీటుపై ఆసీనులను చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు ప్రతిపక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క, హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇతర ప్రతిపక్ష నాయకులు, కేటీఆర్‌, హరీష్‌రావు తదితరులు మాట్లాడి పద్మారావు సేవలను కొనియాడారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. సీఎం సమాధానం అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తరువాత సభ వాయిదా పడింది.

Other Updates