డి.ఆర్.డి.ఎల్‌కు
కలాం పేరుపెట్టాలి
సంతాప తీర్మానంలో కేంద్రాన్ని కోరిన సి.ఎం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవ మృతి చెందిన నారాయణఖేడ్ శాసన సభ్యుడు పటోళ్ళ కిష్టారెడ్డికు శాసన సభ నివాళు ర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటించింది. సెప్టెంబర్ 23న శాసన సభ వర్షాకా సమావేశాు ప్రారంభం కాగానే, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తొుత అబ్దుల్ కలాం మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ కలాం సేవను కొనియాడారు.’’ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి పదవిని అధిరోహించిన మేధావి అబ్దుల్ కలాం. నిరంతరం దేశ ప్రయోజనా కోసం పనిచేశారు. హైదరాబాద్ తో ఆయనకు విడదీయరాని అనుబంధం వుంది. డి.ఆర్.డి.ఎల్. డైరెక్టర్ గా కలాం హైదరాబాద్ లో పనిచేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పరిశోధనుచేసి, సాంకేతిక రంగంలో ప్రపంచ దృష్టి హైదరాబాద్ పై పడేటట్టు చేసిన మహానుభావుడు కలాం ‘‘అని ముఖ్యమంత్రి కొనియాడారు.
హైదరాబాద్ లోని డి.ఆర్. డి.ఎల్ కు కలాం పేరు పెట్టాని రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఈ సందర్భంగా మరోసారి ఈ విషయం గుర్తుచేస్తున్నానని సి.ఎం చెప్పారు.
సభలో వివిధ పక్షా సభ్యు కలాం మృతికి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తంచేస్తూ, హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఎల్. కు కలాంపేరు పెట్టానని కేంద్రాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను సమర్ధించారు.
నారాయణఖేడ్ శాసన సభ్యుడు పటోళ్ళ కిష్టారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో తీర్మానం ప్రవేశ పెట్టారు. పటోళ్ళతో తనకు 40 ఏళ్ళ అనుబంధం వుందని సి.ఎం చెప్పారు. తెంగాణ ఉద్యమంలో ఆయన కీక పాత్ర పోషించారని నివాళుర్పించారు.
ఈ రెండు తీర్మానాను సభ ఆమోదించిన అనంతరం శాసన సభ సెప్టెంబర్ 29 కి వాయిదా పడిరది.
కలాం మృతికి మండలి సంతాపం:
సెప్టెంబర్ 23న ప్రారంభమైన శాసన మండలి సమావేశం కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభలో ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. విద్యార్థు, యువతకు, అన్ని రంగా వారికి అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాతగా నిచిపోయారని ఆయన నివాళుర్పించారు. పువురు సభ్యు కలాం మృతికి సంతాపం వ్యక్తంచేస్తూ, ఆయన సేవను కొనియాడారు.
హోం
»