తెలంగాణ ప్రాంతం భారతదేశంలోని దక్కను పీఠభూమిపై పారే గోదావరి, కృష్ణానదుల మధ్యనుంచి మానవ జీవన పరిణామాలకు అనాదిగా వేదికైంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలతో సరితూగగల అవశేషాలు బయల్పడ్డాయి. పడుతూనే ఉన్నాయి.
ఇలాంటి ప్రాచీన అవశేషాలను బయల్పరచి, వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఫలితాలను వెల్లడించే ప్రభుత్వ సంస్థను పురావస్తుశాఖ అంటాం. 1914లో ఆనాటి హైదరాబాద్ (నిజాం) రాష్ట్రంలో పురావస్తుశాఖ ఏర్పాటైంది. అయితే అంతకంటే అరవై సంవత్సరాల ముందే ఇంగ్లీషు పురావస్తు నిపుణుడు రాబర్ట్ బ్రూస్‌ఫూట్ భువనగిరిజిల్లా వలిగొండలో బృహత్‌శిలాయుగపు సమాధులను గుర్తించాడు. ఏమైనా ప్రభుత్వ పురావస్తుశాఖ ఏర్పాటైన తరువాతనే తెలంగాణ పురావస్తు విశేషాలు చాలా వెలుగులోకి వచ్చాయి. అలా వెలుగు చూసిన ముఖ్యాంశాలను నాలుగు కాలాలుగా విభజించి అర్థం చేసుకోవచ్చు. అవి:
1. హైదరాబాద్ దశ, 1914-1948
2. ప్రాజెక్టుల దశ 1956-1986
3. పరిశోధన దశ, 1986-2001
4. తెలంగాణ దశ 2001-2017
హైదరాబాద్ దశ-1914-1948
హైదరాబాదు రాష్ట్రంలో రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు గులావ్‌ు యాజ్దానీ ఆధ్వర్యంలో పలురకాల పురావస్తు అన్వేషణలు కొనసాగాయి. ఫలితంగా 1953లో ప్రచురించిన ‘ఆంటి్వరియన్ రిమెయిన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్’ అనే రిపోర్టులో తెలంగాణ చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన 118 స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొన్నారు. వాటిల్లో గోదావరికి ఉత్తరంగా ఉన్న వృక్ష శిలాజాలతోపాటు తెలంగాణ అంతటా విస్తరించిన 20 కొత్త రాతియుగ స్థలాలను, 96 బృహత్ శిలాయుగపు స్థలాలను పేర్కొని ప్రాథమిక వివరాలను అందించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న మౌలాలి, హస్మత్‌పేట, లింగంపల్లి, భువనగిరి పరిసరాల్లో ఉన్న రాయిగిరి తదితర ప్రదేశాల్లో వెలుగుచూసిన బృహత్ శిలాయుగపు చారిత్రక విశేషాలు ఈ కాలంలో బాగా ప్రచురితమయ్యాయి.
చారిత్రక స్థలాల్లో రాచకొండ, కొండాపూర్, భువనగిరి, వరంగల్‌వంటి విశేషమైన ప్రాచీన రాజధానీ నగరాలు, రామప్ప, హనుమకొండ వేయిస్తంభాల గుడి, కదిలె పాపన్నగుడి (నిర్మల్ జిల్లా)వంటి వాస్తుశిల్ప కట్టడాల విశేషాలు వెలుగులోకి వచ్చాయి. 1930లో ఆనాటి పురావస్తుశాఖ సంచాలకులు యాజ్దానీకి, రామప్ప గుడి కలలో కనిపించి ూలిపోనున్న తనను కాపాడుమనగా తను వెళ్లి అదే స్థితిలో ఉన్న రామప్ప, వేయి స్తంభాల గుడులకు సపోర్టింగ్ పిల్లర్స్ వేయించి కాపాడినట్లు ఆయన రాయడం ఆసక్తిని రేత్తిెస్తుంది.
ఇదే కాలంలో కొమఱ్ఱాజు వెంకట లక్ష్మణరావు, గడియారం రామకృష్ణశర్మ, ఒద్దిరాజు సోదరులు, దూపాటి వేంకట రమణాచార్యులు తదితర ప్రైవేటు వ్యక్తులు శాసనాల సేకరణ, ప్రచురణలమీద ఎంతో కృషి చేశారు.
ప్రాజెక్టుల దశ-1956-86
1956లో తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర పురావస్తు శాఖ వందలాది చారిత్రక స్థలాలను వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే, వాటిల్లో ఎక్కువ భాగం ప్రాజెక్టుల ముంపు స్థలాలే. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, మంజీర, పోలవరం ప్రాజెక్టుల్లో మునిగిపోయిన చారిత్రక స్థలాలను పురావస్తుశాఖ ముందే పరిశోధించి నివేదికలను ప్రచురించింది. నాగార్జునసాగర్, ఏలేశ్వరం తవ్వకాల్లో చారిత్రక పూర్వయుగ విశేషాలతోపాటు ప్రముఖంగా శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాల కాలపు చారిత్రక విశేషాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయపు శ్రీశైలం పీఠం, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు స్థలాల్లోని చరిత్ర పూర్వయుగపు విశేషాలను నమోదు చేయగా పురావస్తుశాఖ, ముంపుకు గురైన దేవాలయాలను సురక్షితస్థలాలకు తరలించింది. తుంగభద్ర ప్రాజెక్టులో మునిగే మల్లేశ్వరం, సోమశిల, ూడలి సంగమేశ్వరం దేవాలయాలు అలా కాపాడబడ్డాయి. అలా చేయడం దేశంలో ఇదే ప్రథమం. అలాగే పోలవరం ప్రాజెక్టులో మునుగనున్న చారిత్రక స్థలాలను హైదరాబాద్ ంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య ఎం.ఎల్.. మూర్తి, పురావస్తుశాఖ అధికారులు అధ్యయనం చేసి వివరాలు ప్రకటించారు.
పరిశోధన దశ, 1976-2001
ఈ కాలంలో రాష్ట్ర పురావస్తుశాఖ ముఖ్యంగా శాతవాహన, విష్ణుకుండిన రాజవంశాల కాలాలకు చెందిన చారిత్రక కట్టడాల్లో తవ్వకాలు జరిపి వివరాలను ప్రకటించింది. అలా మనకు గోదావరి తీరస్థ గ్రామాలైన కోటి లింగాల, పాశిగామ, ధూళికట్ట, పెద్దబొూంరు, చిన్న బొూంరు ప్రాంతాల్లో శాతవాహన, శాతవాహన పూర్వయుగపు కట్టడాలు, బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, నాణేలు, తొలిరాతలు వెలుగు చూశాయి. కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని తెలిసి వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కలున్న చైతన్యపురి, నేలకొండపల్లి, కీసర, ఇంద్రపాలనగరం ప్రాంతాల్లో క్రీ.శ. 5వ శతాబ్దంనాటి బౌద్ధ కట్టడాలు, రాజధాని నగరాల కట్టడాలు, శాసనాలు వెలుగు చూశాయి. వీటివల్ల ఇంతకుముందు ఆంధ్ర చరిత్రకారులు భావించినట్లు విష్ణుకుండిన రాజుల రాజధాని వినుకొండ కాకుండా తెలంగాణలోనే ఉండేదని తేటతెల్లమైంది. అంతేకాకుండా, ఈ దశలో పురావస్తుశాఖ తెలంగాణ జిల్లాల శాసన సంపుటాలను ప్రచురించింది. శాఖ
ఉప సంచాలకులు పి.వి. పరబ్రహ్మశాస్త్రి కృషి ఈ విషయమై బహుధా ప్రశంసనీయం. అట్లాగే, శాఖ సంచాలకులు పి.వి. కృష్ణశాస్త్రి తెలంగాణలోని అనేక ప్రాంతాల చారిత్రక పూర్వయుగ విశేషాలను ప్రచురించడం ప్రశంసనీయం. ప్రత్యేకించి వారు చారిత్రక పూర్వయుగపు రాతి చిత్రలేఖనాలను వెలుగులోకి తేవడం.
ఈ కాలపు ప్రైవేటు చరిత్రకారుల్లో ప్రశంసించదగిన వారు ముగ్గురు. వారిలో మొదటగా పేర్కొనవలసింది ఠాూర్ రాజారాం సింగ్ గురించి. ఆయన పెద్దపల్లి చుట్టుపక్కల ప్రవహించే గోదావరి లోయలో సుమారు 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వందలాది చరిత్ర పూర్వయుగ స్థలాలను గుర్తించి, వాటి విశేషాలను పురావస్తుశాఖ జర్నల్స్‌లో ప్రచురించారు. ధర్మపురికి చెందిన సంగనభట్ల నరహరి కోటి లింగాలలో దొరికిన నాణేలను పురావస్తుశాఖకు అప్పజెప్పి తద్వారా ఈ ప్రాంతంలో క్రీ.పూ. 4వ శతాబ్దంనాటి నాగరికత విలసిల్లిందని ఆధారాల వెలికితీతకు ఆద్యుడయ్యారు. అనంతరం వారిబాటలో పయనించిన దేమె రాజారెడ్డి, సూర్యనారాయణలు తెలంగాణలో వేలాది ప్రాచీన నాణేలు సేకరించి/అధ్యయనం చేసి ‘న్యుమిస్ మాటిక్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్’ అనే జర్నల్‌లో వివరాలు ప్రకటించారు. తద్వారా చారిత్రక సాహిత్య ఆధారాలు లేని ఎన్నో ప్రాథమిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే కాలంలో జగిత్యాలకు చెందిన జైశెట్టి రమణయ్య ఆనాటి కరీంనగర్ జిల్లాలోని పలు చారిత్రక దేవాలయాలను దర్శించి వాటి ప్రాథమిక చరిత్రను నమోదు చేశారు. బి.ఎన్. శాస్త్రిగారేమో తెలంగాణలోని అనేక స్థలాలు తిరిగి వందలాది శిలా శాసనాలు, రాగి శాసనాలు సేకరించి ‘మూసీ పబ్లిషేన్స్’ ద్వారా శాసన సంపుటులను, రాజవంశాలవారీగా సమగ్ర చరిత్రలను, జిల్లా సర్వస్వాలను ప్రచురించారు. తేరాల సత్యనారాయణ శర్మ ూడా వివిధ రాజవంశాల చరిత్రలు రాశారు. పురావస్తుశాఖలో అధికారులుగా పనిచేసిన పి.వి. పరబ్రహ్మశాస్త్రి, వి.వి. కృష్ణశాస్త్రి, నేలటూరు వేంకట రమణయ్య తదితర ఆంధ్రులు ూడా తెలంగాణ శాసనాలు, చరిత్ర పూర్వయుగ విశేషాలను వెలికితీయడంలో ప్రధాన భూమికను పోషించారు.
తెలంగాణ దశ-2001-2017
తెలంగాణ రాష్ట్రోద్యమ దశలో రాష్ట్ర పురావస్తు శాఖలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యమే కొనసాగినా కొన్ని జిల్లాల శాసన సంపుటాలు ప్రచురించబడ్డాయి. కోటిలింగాల, ఫణిగిరి, కీసర వంటిచోట్ల మరిన్ని తవ్వకాలు జరిగాయి. పురావస్తు శాఖకు ద్యావనపల్లి సత్యనారాయణ, సంగనభట్ల నర్సయ్యలు చేసిన విజ్ఞప్తుల మేరకు ధర్మపురి, చెగ్గాం, తదితర ప్రాంతాలనుంచి శిలాశాసనాలను సేకరించారు. సత్యనారాయణ వ్యక్తిగతంగా సుమారు 20 శాసనాలను, మరో 20 చారిత్రక పూర్వయుగ రాతి చిత్రలేఖన స్థలాలను గుర్తించి వాటి వివరాలను ప్రధాన దినప్రతికలు, టీవీల ద్వారా జన సామాన్యానికి చేరవేశారు. వీరి రాతి చిత్రలేఖన పరిశోధన వివరాలను పురావస్తుశాఖ ప్రచురించింది. ఇదే కాలంలో డి. సూర్యకుమార్ కొన్ని శాసనాలను ‘ఆ చంద్రతారార్కం’ పేరిట ప్రచురించగా, పి. జైకిషన్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గుర్తించిన ఇనుము-ఉక్కు పరిశ్రమలు, పనిముట్ల విశేషాలను ప్రచురించారు. వీే నరేందర్, సంగేవేని రవీంద్రలు ‘తెలంగాణ గడీలు’ అనే అంశంపైన ప్రాథమిక సమాచారాన్ని ప్రచురించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థకు చెందిన వ్యక్తులు, మరికొందరు ఔత్సాహికులు స్థల సందర్శనలు చేసి రాతి చిత్రలేఖన స్థలాలు, బౌద్ధ స్థావరాల ప్రాథమిక విశేషాలను పత్రికల ద్వారా ప్రజానీకానికి చేరవేశారు. వాటి ప్రామాణికతను పురావస్తుశాఖ ఇంకా గుర్తించవలసి ఉంది. పురావస్తుశాఖ ఇటీవల తెలంగాణలోని రక్షిత కట్టడాల జాబితాను ప్రచురించడంతోపాటు, పజ్జూరు, పుల్లూరుబండ ప్రాంతాల్లో తవ్వకాలు జరిపింది. ప్రభుత్వం కొత్త పురావస్తు చట్టాన్ని చేసింది. అయినా, గత వందేండ్లలో జరిగిన పురావస్తు పరిశోధనల ఫలితాలను సమన్వయం చేసి తెలంగాణ ప్రామాణిక చరిత్రను ప్రచురించడం ఇంకా మిగిలే ఉంది.